[ad_1]
Hyderabad Man Buys McLaren 765 LT Spider: హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అత్యంత ఖరీదైన కారును కొనుగోలు చేశారు. మెక్‌లారెన్ 765 ఎల్‌టీ స్పైడర్ మోడల్ కారును నగరానికి చెందిన బిజినెస్ మ్యాన్ నసీర్ ఖాన్ కొన్నారు. దీని ఖరీదు ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. సుమారు 12 కోట్లు వెచ్చింది వ్యాపారవేత్త నసీర్ ఖాన్ మెక్ లారెన్ కారు కొనుగోలు చేసి రికార్డు సృష్టించారు. దేశంలో అత్యంత ఖరీదైన కార్లలో ఈ మోడల్ ఒకటని ఆటోమొబైల్స్ విశ్లేషకులు తెలిపారు.
సోషల్ మీడియాలో వైరల్..
తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ వద్ద వ్యాపారవేత్త నసీర్ ఖాన్‌కు మెక్ లారెన్ సంస్థ కారు డెలివరీ చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోనే మెక్ లారెన్ 765 ఎల్టీ స్పైడర్ కొనుగోలు చేసిన తొలి వ్యక్తిగా నగరానికి చెందిన నసీన్ ఖాన్ నిలిచారు. ఇండియాలో మార్కెట్ లో అత్యంత ఖరీదైన టాప్ ఎండ్ కార్లలో మెక్ లారెన్ ఒకటని కార్టోక్ డాట్ కామ్ రిపోర్ట్ చేసింది. కార్ లవర్ అయిన నసీర్ ఖాన్ వద్ద ఇప్పటికే టాప్ ఎండ్ కార్లు చాలా ఉన్నాయి. తాజాగా మెక్ లారెన్ ను కొనుగోలు చేసిన వ్యాపారవేత్త.. కారు డెలివరీ అయిన తరువాత తన ఇన్‌స్టాగ్రామ్ లో ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి. ఇన్ఫినిటీ మోటార్స్, లలిత్ చౌదరి వల్లే తనకు కార్ సాధ్యమైందని ధన్యవాదాలు తెలిపారు.
News Reels
మెక్ లారెన్ 765 ఎల్టీ స్పైడర్ ప్రత్యేకతలివే..
ఏరో డైనమిక్ డిజైన్‌తో రూపొందించిన ఈ సూపర్ కారు టాప్ ఓపెన్ అయ్యేందుకు 11 సెకన్ల సమయం పడుతుందట. ఈ కారుకు 4.0 లీటర్ టర్బోఛార్జ్‌డ్ వీ8 పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఈ మెక్ లారెన్ మోడల్ కారు ఇంజిన్ 765 పీఎస్, 800 ఎన్ఎం పీక్ టార్క్ జనరేట్ చేస్తుంది. కార్బన్ ఫైబర్‌తో కారు బాడీని తయారుచేశారు. ఈ కారు కేవలం 2.7 సెకన్లలో గంటకు 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 7.2 సెకన్లకు గంటకు 124 కి.మీ వేగం అందుకునే మెక్ లారెన్ 765 ఎల్టీ స్పైడర్ కార్లు గరిష్టంగా గంటకు 205 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి.
కార్లంటే ఇష్టపడే నసీర్ ఖాన్ వద్ద పలు టాప్ మోడల్ కార్లు ఉన్నాయి. ఆయన గ్యారేజీలో ప్రస్తుతం రోల్స్ రాయిస్ కలినన్ బ్లాక్ బ్యాడ్జ్, ఫెరారీ 812 సూపర్ ఫాస్ట్ కార్, మెర్సిడీజ్- బెంజ్ జీ350డీ, ఫోర్డ్ ముస్టంగ్, లంబోర్గిని అవెంటడార్, లంబోర్గిని ఉరుస్ లాంటి కోట్ల విలువ చేసే ఖరీదైన కార్లు ఉన్నాయి.
[ad_2]
Source link
Leave a Reply