మళ్లీ కొత్త శిఖరం ఎక్కిన నిఫ్టీ బుల్‌, 10 శాతం పడిపోయిన జీ ఎంటర్‌టైన్‌మెంట్‌

[ad_1]

Stock Market News Today in Telugu: మంగళవారం సెషన్‌లో రికార్డు స్థాయిలో క్లోజ్‌ అయిన NSE నిఫ్టీ, ఈ రోజు (బుధవారం, 21 ఫిబ్రవరి 2024) కూడా బుల్‌ పవర్‌ చూపించింది, మరోమారు కొత్త రికార్డు గరిష్ట స్థాయిలో ప్రారంభమైంది. ఈ రోజు నిఫ్టీ తొలిసారిగా 22,248 వద్ద ఓపెన్‌ అయింది. ఇది నిఫ్టీకి కొత్త జీవిత కాల గరిష్టం (Nifty fresh all-time high). మెటల్‌, PSU బ్యాంకుల బూమ్ కారణంగా స్టాక్ మార్కెట్లకు మద్దతు దొరికింది. ట్రేడ్‌ ప్రారంభ సమయంలో IT, బ్యాంక్ షేర్లు కూడా పెరిగే మూడ్‌లో ఉన్నాయి.

ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది…

గత సెషన్‌లో (మంగళవారం) 73,057 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 210.08 పాయింట్లు లేదా 0.29 శాతం పెరుగుదలతో 73,267.48 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. మంగళవారం 22,197 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 51.90 పాయింట్లు లేదా 0.23 శాతం పెరుగుదలతో 22,248.85 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 

విస్తృత మార్కెట్లలో, BSE మిడ్‌ క్యాప్ ఇండెక్స్‌ 0.26 శాతం & స్మాల్‌ క్యాప్ ఇండెక్స్‌ 0.44 శాతం పెరిగాయి.

BSE స్మాల్‌ క్యాప్ స్టాక్స్‌లో.. GOCL, క్యాంపస్‌ యాక్టివ్‌వేర్‌ దాదాపు 11 శాతం పెరిగాయి.

BSE మిడ్‌ క్యాప్ స్టాక్స్‌లో.. NIACL, GIC RE, యూనియన్‌ బ్యాంక్‌, జిందాల్‌ స్టీల్‌ 2-7 శాతం వరకు పుంజుకున్నాయి. 

సెన్సెక్స్ షేర్లు
మార్కెట్‌ ప్రారంభ సమయంలో సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లో 14 స్టాక్స్‌ లాభాల్లో, 16 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. సెన్సెక్స్‌ షేర్లలో JSW స్టీల్‌, M&M దాదాపు 2 శాతం పెరగాయి. ఇన్ఫోసిస్‌ స్లిప్‌ అయింది. 

నిఫ్టీ షేర్లు
నిఫ్టీ 50 ప్యాక్‌లో.. 31 స్టాక్స్‌ లాభపడగా, 19 స్టాక్‌లు క్షీణిస్తున్నాయి. మొత్తం NSEలో, 1478 షేర్లు పెరుగుతున్న ధోరణిలో, 652 షేర్లు పడిపోతున్న ధోరణిలో కనిపించాయి. ప్రస్తుతం, NSEలో 2,215 షేర్లు ట్రేడ్ అవుతున్నాయి, వాటిలో 68 షేర్లు అప్పర్ సర్క్యూట్‌లో లాక్‌ అయ్యాయి. 107 షేర్లు 52-వారాల గరిష్ట స్థాయి వద్ద ట్రేడవుతున్నాయి.

సెక్టార్లలో నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 1 శాతం, నిఫ్టీ PSU బ్యాంక్ ఇండెక్స్ 0.8 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ మీడియా ఇండెక్స్ 2 శాతం పడిపోయింది.

విలీన ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు ఎలాంటి చర్చలు జరపడం లేదని సోనీ స్పష్టం చేయడంతో జీ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్లు ఈ రోజు 10 శాతం పడిపోయాయి. మరోవైపు, జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ ఖాతాల్లో దాదాపు రూ.2,000 కోట్ల మళ్లింపు జరిగినట్లు సెబీ కనిపెట్టింది, మొదట వేసిన అంచనా కంటే ఇది దాదాపు 10 రెట్లు ఎక్కువ మొత్తం.

హిందాల్కో పూర్తి స్థాయి అమెరికన్ అనుబంధ సంస్థ నోవెలిస్, USలో IPO కోసం అప్లై చేయడంతో హిందాల్కో షేర్లు 3 శాతం పెరిగాయి.

ఈ రోజు ఉదయం 09.50 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 136.20 పాయింట్లు లేదా 0.19% పెరిగి 73,193.60 దగ్గర; NSE నిఫ్టీ 33.25 పాయింట్లు లేదా 0.15% పెరిగి 22,230.20 వద్ద ట్రేడవుతున్నాయి. 

గ్లోబల్‌ మార్కెట్లు
ఆసియా మార్కెట్లలో, ఈ ఉదయం హాంగ్‌ సెంగ్‌ లోయర్‌ సైడ్‌లో ఉంది. ఇది తప్ప మిగిలిన మార్కెట్లన్నీ దాదాపు ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి, 0.1 శాతం నుంచి 0.7 రేంజ్‌లో ఉన్నాయి. యూఎస్‌ మార్కెట్లు నష్టాల్లో ముగియడం ఆసియా బెంచ్‌మార్క్‌లపై ప్రభావం చూపింది. నిన్న, అమెరికన్‌ మార్కెట్లలో, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.17 శాతం తగ్గింది. S&P 500 0.6 శాతం, టెక్-హెవీ నాస్‌డాక్‌ కాంపోజిట్ 0.92 శాతం నష్టపోయాయి.

US 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్‌ 4.3 శాతం స్థాయిలో ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు దాదాపు 83.50 డాలర్ల వద్ద ఉంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు – ఈ రోజు రేట్లు ఇవి

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *