మ్యూచువల్‌ ఫండ్స్‌ ముచ్చటపడిన 3 స్టాక్స్‌ – వీటి దశ తిరినట్లేనా?

[ad_1]

Stock to Buy: 2022లో, రిటైల్ ఇన్వెస్టర్లతో పాటు మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు కూడా ఈక్విటీ మార్కెట్ల వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. భారత స్టాక్ మార్కెట్‌ చరిత్రలోనే ఒక సమస్యాత్మక సంవత్సరంగా 2022 గుర్తుండిపోతుంది. ఆ ఏడాది, నైకా, జొమాటో, పేటీఎం (Nykaa, Zomato, Paytm) వంటి న్యూ ఏజ్‌ టెక్‌ స్టాక్స్‌ అతి భారీగా పతనమయ్యాయి. 2023లో, ఈ పరిస్థితిలో మార్పు రావచ్చన్న ఆశ కనిపిస్తోంది.    

మార్కెట్ డేటా ప్రకారం.. మ్యూచువల్‌ ఫండ్స్‌ (mutual funds) జనవరి నెలలో యాడ్‌ చేసుకున్న స్టాక్స్‌లో Nykaa, Zomato, Paytm అగ్రస్థానంలో ఉన్నాయి.     

“ఈ మూడు కంపెనీల దీర్ఘకాలిక వృద్ధి సామర్థ్యం భారీగా ఉంటుంది. అందువల్ల, స్వల్పకాలిక సవాళ్లు ఉన్నప్పటికీ, ఈ స్టాక్‌కు కొనుగోలుదార్లు ఉన్నారు. ముఖ్యంగా, వాటి లిస్టింగ్ గరిష్ట ధరల నుంచి భారీగా కరెక్షన్‌ తర్వాత ఇవి ఫేవరేట్స్‌గా మారాయి” అనిి జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ VK విజయకుమార్ చెప్పారు.   

  

నైకా       
Nykaa బ్రాండ్‌ను నడుపుతున్న బ్యూటీ & ఫ్యాషన్ ఈ-టైలర్ FSN E-కామర్స్ వెంచర్స్ ‍‌(FSN E-Commerce Ventures) స్టాక్‌, గత నెలలో మ్యూచువల్ ఫండ్స్ టాప్-10 లార్జ్‌ క్యాప్ స్టాక్ పిక్స్‌లో ఒకటి. మ్యూచువల్ ఫండ్స్ ఆ నెలలో కంపెనీకి చెందిన 2.96 కోట్ల షేర్లను కొన్నాయి. నైకాలో.. SBI మ్యూచువల్ ఫండ్ 174%, నిప్పన్ ‍‌(Nippon) 122%, మిరే (Mirae) 46% వాటాను పెంచుకున్నట్లు ICICI డైరెక్ట్ డేటాను బట్టి తెలుస్తోంది.    

జొమాటో        
జనవరి నెలలో, ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటోకు చెందిన 3.47 కోట్ల షేర్లను మ్యూచువల్‌ ఫండ్స్‌ కొనుగోలు చేశాయి. ICICI ప్రుడెన్షియల్ AMC ఈ స్టాక్‌లో తన హోల్డింగ్‌ను రెట్టింపు చేసింది. బరోడా BNP పరిబాస్ మ్యూచువల్ ఫండ్ రూ. 9.45 కోట్ల విలువైన జొమాటో షేర్లను కొన్నది. ఈ మ్యూచువల్ ఫండ్ కొత్తగా కొన్న స్టాక్స్‌లో జొమాటోది అగ్రస్థానం.

పేటీఎం     
గత నెలలో, మిడ్‌ క్యాప్ కేటగిరీలో మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు చేసిన టాప్-10 పేర్లలో Paytm (One97 Communications Ltd) షేర్లు ఉన్నాయి. కొనుగోలుదార్ల లిస్ట్‌లో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, మిరే అసెట్, ICICI ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, HDF MF, UTI, నిప్పాన్ వంటి మ్యూచువల్‌ ఫండ్స్‌ ఉన్నాయి.   

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *