[ad_1]
News
oi-Chandrasekhar Rao
న్యూఢిల్లీ:
రష్యా-ఉక్రెయిన్
మధ్య
సుదీర్ఘకాలంగా
యుద్ధానికి
అంతు
ఉండట్లేదు.
గత
ఏడాది
ఫిబ్రవరి
24వ
తేదీన
ఆరంభమైన
ఈ
యుద్ధం
ఇంకా
కొనసాగుతోంది.
రెండు
దేశాలు
సై
అంటే
సై
అంటోన్నాయి.
రష్యా
దాడిలో
ఉక్రెయిన్
తూర్పు
ప్రాంతంలోని
ప్రధాన
నగరాలన్నీ
ధ్వంసం
అయ్యాయి.
అయినా
ఉక్రెయిన్
వెనక్కి
తగ్గట్లేదు.
యూరోపియన్
యూనియన్,
నార్త్
అట్లాంటిక్
ట్రీటీ
ఆర్గనైజేషన్
సభ్య
దేశాలు
అందిస్తోన్న
ఆయుధ
సామాగ్రితో
రష్యాను
ఢీ
కొడుతోంది.
ఉక్రెయిన్‌పై
దండెత్తిన
రష్యాను
పాశ్చాత్య
దేశాలన్నీ
బహిష్కరించిన
విషయం
తెలిసిందే.
అన్ని
రకాల
నిషేధాజ్ఞలను
జారీ
చేశాయి.
అనేక
ఆంక్షలను
విధించాయి.
ఈ
పరిణామాలను
భారత్..
తనకు
అనుకూలంగా
మార్చుకుంది.
రష్యాతో
తన
అనుబంధాన్ని
మరింత
బలోపేతం
చేసుకుంది.
అక్కడి
నుంచి
క్రూడాయిల్‌ను
దిగుమతి
చేసుకుని..
దాన్ని
శుద్ధి
చేసి
యూరోపియన్
యూనియన్
దేశాలకు
ఎగుమతి
చేస్తోంది.
ఈ
పరిస్థితుల
మధ్య
భారత్-రష్యా
ఉమ్మడిగా
మరిన్ని
కీలక
నిర్ణయాలను
తీసుకునే
దిశగా
అడుగులు
వేస్తోన్నాయి.
ఆర్థిక
కార్యకలాపాల
కోసం
వినియోగించే
రూపే,
మీర్
కార్డులను
పరస్పరం
తమ
తమ
దేశాల్లో
ప్రవేశపెట్టాలని
భావిస్తోన్నాయి.
వాణిజ్యం,
ఆర్థిక,
శాస్త్రీయ,
సాంకేతిక,
సాంస్కృతిక
సహకారంపై
ఇటీవల
రెండు
దేశాల
మధ్య
జరిగిన
సమావేశంలో
ఈ
అంశంపై
చర్చించాయి.
విదేశాంగ
మంత్రి
సుబ్రహ్మణ్యం
జైశంకర్,
రష్యా
ఉప
ప్రధాన
మంత్రి
డెనిస్
మంటురోవ్..
పాల్గొన్న
అత్యున్నతస్థాయి
భేటీ
ఇది.
నేషనల్
పేమెంట్
కార్పొరేషన్,
యూనిఫైడ్
పేమెంట్స్
ఇంటర్ఫేస్,
బ్యాంక్
ఆఫ్
రష్యాకు
చెందిన
ఫాస్టెస్ట్
పేమెంట్
సిస్టమ్
అధికారులు
దీనిపై
అధ్యయనం
చేయాలని
నిర్ణయించారు.
రూపే
కార్డును
భారత్‌లో
అన్ని
రకాల
ఆర్థిక
కార్యకలాపాల
కోసం
వినియోగిస్తోన్న
విషయం
తెలిసిందే.
మీర్
కార్డులు-
రష్యాలో
చలామణిలో
ఉన్నాయి.
పరస్పర
అంగీకారంతో
ఈ
రెండు
కార్డులను
తమతమ
దేశాల్లో
వినియోగంలోకి
తీసుకుని
రావాలని
ప్రాథమికంగా
నిర్ణయించుకున్నాయి.
భారత్‌లో
మీర్
కార్డులు,
రష్యాలో
రూపే
కార్డులను
చలామణిలోకి
తీసుకుని
రావడం
వల్ల
ఈ
రెండు
దేశాల
మధ్య
గల
ఆర్థిక
సంబంధాలు
మరింత
బలోపేతమౌతాయని
భావిస్తోన్నాయి.
ఇది
అమల్లోకి
వస్తే-
రష్యన్లు
భారత్‌లో
తమ
దేశానికి
చెందిన
మీర్
కార్డును
ఆర్థిక
కార్యకలాపాల
కోసం
స్వేచ్ఛగా
వినియోగించుకోవడానికి
వెసలుబాటు
కల్పించినట్టవుతుంది.
ఇమ్మీడియట్
పేమెంట్
సర్వీస్,
యూపీఐ,
భిమ్,
నేషనల్
ఎలక్ట్రానిక్
టోల్
కలెక్షన్,
భారత్
బిల్‌పే
వంటి
రిటైల్
చెల్లింపుల్లో
ఈ
కార్డులను
రష్యన్లు
వాడుకోవచ్చు.
అదే
తరహాలో
రూపే
కార్డు
భారతీయులు
రష్యాలో
వినియోగించుకోవచ్చు.
English summary
India and Russia likely to accept for their financial transaction accepting RuPay and Mir cards
India and Russia likely to accept for their financial transaction accepting RuPay and Mir cards.
Story first published: Sunday, April 30, 2023, 18:02 [IST]
[ad_2]
Source link
Leave a Reply