[ad_1]
ప్రముఖ పోషకాహార నిపుణురాలు కిరణ్ కుక్రేజా రాగి బాటిల్/పాత్రలో ఉంచిన నీటిని సరైన పద్ధతిలో తాగితేనే.. శరీరానికి మేలు జరుగుతుందని అన్నారు. రాగి పాత్ర/ సీసాలో నీరు తాగే అలవాటు ఉంటే.. 3 రకాల తప్పులను నివారించాలని సూచించారు. లేకపోతే.. దష్ప్రభావాలు ఎదుర్కోవలసి వస్తుందని అన్నారు.
రోజంతా.. ఆ నీళ్లే తాగొద్దు..
మీరు రోజంతా రాగి సీసాలో/ పాత్రలో నిల్వ ఉంచిన నీళ్లు తాగుతుంటే.. కాపర్ టక్సిసిటీ అయ్యే ప్రమాదం ఉందని కిరణ్ కుక్రేజా అన్నారు. దీని కారణంగా.. వికారం, మైకం, కడుపు నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. లివర్, కిడ్నీల వైఫల్యానికి దారితీస్తుంది. రాగి అధిక మొత్తంలో నీటిలో చేరితే.. అది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
ఇవి కలపొద్దు..
చాలా మంది.. ఆరోగ్యానికి మంచిదనే ఉద్దేశంలో ఉదయాన్నే ఖాళీ కడుపుతో నిమ్మరసం, తేనె కలిపిన నీళ్లు తాగుతుంటారు. కానీ, రాగి పాత్ర/సీసాలో నిల్వ ఉంచిన నీటిలో నిమ్మరసం, తేనె మిక్స్ చేసుకుని తాగకూడదని కిరణ్ కుక్రేజా అన్నారు. నిమ్మరసంలోని యాసిడ్.. కాపర్‌తో రియాక్ట్ అవుతుంది. దిని కారణంగా.. కడుపు నొప్పి, ఎసిడిటీ, వాంతులు అవుతాయి.
కాపర్ బాటిల్‌ను రోజు శుభ్రం చేయవద్దు..
రాగి పాత్రలను రోజూ శుభ్రం చేయకూడదని కిరణ్ కుక్రేజా అన్నారు. రోజూ బాటిల్ శుభ్రం చేస్తే.. దానిలోని ప్రయోజనకరమైన లక్షణాలు తగ్గుతాయి. రోజూ దాన్ని నీటోతో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. నెలకొసారి ఉప్పు, నిమ్మరసం వేసి శుభ్రం చేసుకోండి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply