రూ.2 వేల నోట్లను మార్చుకోవడానికి ఈ రోజే లాస్ట్‌ డేట్‌, ఈ గడువు పొడిగిస్తారా?

[ad_1]

Rs 2000 Notes: రూ.2000 నోట్లను మార్చుకోవడానికి లేదా డిపాజిట్ చేయడానికి ఈ రోజే లాస్ట్‌ డేట్‌. ఈ రోజు దాటితే అవి చెల్లుతాయా, నోట్ల మార్పిడికి రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) గడువు పెంచుతుందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి.

‘క్లీన్ నోట్ పాలసీ’లో భాగంగా రూ.2000 నోట్లను చలామణీ నుంచి ఉపసంహరించుకోవాలని, ఈ ఏడాది మే 19న, రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్ణయించింది. ఈ పెద్ద నోట్ల ముద్రణను 2018-19లోనే నిలిపివేసింది. ప్రజలకు నాణ్యమైన నోట్లు అందుబాటులో ఉండేలా చూడడమే RBI ‘క్లీన్ నోట్ పాలసీ’ ఉద్దేశం. 

2000 రూపాయల నోట్లను ఖాతాల్లో డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి ఏ బ్యాంక్‌ బ్రాంచ్‌కైనా వెళ్లవచ్చని, విత్‌డ్రా ప్రకటన సమయంలోనే ఆర్‌బీఐ ప్రజలకు సూచించింది. 2000 నోట్లను ఖాతాల్లో డిపాజిట్‌ చేయడం/ఎక్సేంజ్‌ చేసుకునే అవకాశం సెప్టెంబర్ 30 వరకు అన్ని బ్యాంకుల్లో అందుబాటులో ఉంటుంది. RBIకి చెందిన 19 ప్రాంతీయ కార్యాలయాల్లో (ROలు) కూడా సెప్టెంబర్ 30 వరకు పెద్ద నోట్లను మార్చుకోవచ్చు. 

రూ.2000 నోట్ల డిపాజిట్‌/మార్పిడి గడువు పెంచుతారా?
ఈ నెల ప్రారంభంలో (01 సెప్టెంబర్‌ 2023), పింక్‌ నోట్ల డిపాజిట్‌/ఎక్సేంజ్‌ లెక్కలను ఆర్‌బీఐ విడుదల చేసింది. అప్పుడు చెప్పిన లెక్క ప్రకారం, 31 ఆగస్టు 2023 నాటికి, దేశంలో చెలామణిలో ఉన్న మొత్తం రూ. 2000 నోట్లలో 93% నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చాయి. ఇంకా రూ. 24,000 కోట్ల విలువైన పింక్‌ నోట్లు బ్యాంకింగ్‌ సిస్టమ్‌లోకి రావలసి ఉంది. అయితే, ఒకటో తేదీ తర్వాత, రూ.2 వేల నోట్ల గణాంకాలను సెంట్రల్‌ బ్యాంక్‌ మళ్లీ రిలీజ్‌ చేయలేదు. సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు మరికొన్ని నోట్లు బ్యాంకుల వద్దకు వచ్చి ఉంటాయి. చాలా బ్యాంకుల్లోకి పింక్‌ నోట్లు రావడం పూర్తిగా ఆగిపోయినట్లు తెలుస్తోంది.

రూ.2000 నోట్ల డిపాజిట్‌/మార్పిడి గడువు ఈ రోజుతో (సెప్టెంబర్ 30, 2023) ముగుస్తుంది. ఈ గడువును మరో నెల రోజుల పాటు, అంటే అక్టోబర్‌ 31 వరకు పెంచవచ్చని కొన్ని నేషనల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో వార్తలు కనిపిస్తున్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఉన్నతాధికారుల నుంచి తమకు అలాంటి సమాచారం అందిందని ఆయా ఫ్లాట్‌ఫామ్స్‌ ప్రకటించాయి. ఏది ఏమైనా, గడువు పెంపుపై అఫీషియల్‌గా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. లాస్ట్‌ డేట్‌ పెంపుపై మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడుతున్న వార్తలన్నీ ఊహాగానాలే. వాస్తవం ఏంటన్నది ఆర్‌బీఐ మాత్రమే చెబుతుంది.

ఆగస్టు 31 నాటికి, చలామణీలో ఉన్న రూ.2000 నోట్లలో 93% నోట్లు బ్యాంకుల్లోకి తిరిగి వచ్చాయి. ఆ తర్వాతి నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతో కొంత మొత్తం తిరిగి వచ్చి ఉంటుంది. అంటే, ఆర్థిక వ్యవస్థలో మిగిలే రూ.2 వేల నోట్లు చాలా తక్కువగా ఉంటాయి. దీనిని బట్టి, రెండు వేల రూపాయల నోట్లను మార్చుకునే గడువును పొడిగించే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. 2000 రూపాయల నోట్ల చట్టబద్ధతను రద్దు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని కొన్ని రిపోర్ట్స్‌ను బట్టి తెలుస్తోంది. సెప్టెంబర్ 30, 2023 తర్వాత కూడా రూ.2000 నోట్లు చట్టబద్ధంగా కొనసాగుతాయని గానీ, చెల్లుబాటు కావని గానీ రిజర్వ్‌ బ్యాంక్‌ ఇప్పటి వరకు చెప్పలేదు. 

నోట్లను ఉపసంహరించుకున్నారు గానీ రద్దు చేయలేదు కాబట్టి, సెప్టెంబర్‌ 30 తర్వాత కూడా రూ.2 వేల నోట్లు లీగర్‌ టెండర్‌గా కొనసాగుతాయని ఒక వర్గం వాదిస్తోంది. 

ఆర్‌బీఐ చట్టం, 1934లోని సెక్షన్ 24(1) ప్రకారం రూ. 2000 డినామినేషన్ బ్యాంక్ నోట్ నవంబర్ 2016లో తీసుకొచ్చారు. అంతకుముందే, చలామణిలో ఉన్న మొత్తం రూ.500 & రూ.1000 నోట్ల చట్టబద్ధతను రద్దు చేశారు. దీంతో, ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన నోట్ల కొరతను తీర్చడానికి రూ.2000 నోట్ల డినామినేషన్‌ను ఆర్‌బీఐ తీసుకువచ్చింది. ఇప్పుడు, ఇతర డినామినేషన్ల నోట్లు కూడా తగినన్ని అందుబాటులో ఉన్నాయి కాబట్టి, 2000 రూపాయల నోట్లను ప్రవేశపెట్టిన లక్ష్యం నెరవేరింది. దీంతో, 2018-19లో 2000 రూపాయల నోట్ల ముద్రణను RBI నిలిపేసింది. 

మరో ఆసక్తికర కథనం:తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు – ఈ రోజు రేట్లు ఇవి

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *