లివర్ ట్రాన్స్‌ప్లాంట్ ఎలా జరుగుతుందంటే..

[ad_1]

సరిలేని ఆహారపు అలవాట్లు, కలుషిత ఆహారం, చెడు అలవాట్లు, ఫాస్ట్ లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా లివర్‌ని దెబ్బతీస్తాయి. మెట్రోపాలిటన్ నగరాల్లో లివర్ సమస్యలు గణనీయంగా పెరుగుతున్నాయని, అవగాహనతోనే నియంత్రణ సాధ్యమని పరిశోధనలు చెబుతున్నాయి. ప్రజల్లో సరైన అవగాహన లేని కారణంగా లివర్ సమస్యలు ప్రాణాంతకంగా మారుతున్నాయి.

​కాలేయ మార్పిడి ..

లివర్ సమస్యలు మెడిసిన్‌తో తగ్గనప్పుడు కాలేయ మార్పిడి కచ్చితంగా అవసరమవుతుంది. మార్పిడి తప్ప మరో మార్గం లేనప్పుడు కాలేయ పనితీరు, మార్పిడిపై అవేర్‌నెస్ అనేది ముఖ్యం.

కాలేయంలో ముఖ్యంగా రెండు భాగాలుంటాయి. ప్రతి భాగంలోనూ రెండు ఉపభాగాలు ఉంటాయి. వీటిని సెగ్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ విడివిడిగా రక్తప్రసరణ వ్యవస్థ ఉంటుంది. ఇలాంటి నిర్మాణం ఉండడం వల్లే కాలేయంలో కొంత భాగం పాడైనా దానిని మాత్రమే తొలగిస్తారు. కాలేయంలో మూడో వంతున్నా.. అదే చేసే పనులన్నీ చేస్తుంది. అంతేకాకుండా రెండు, మూడు నెలలో అది మామూలు పరిమాణానికి పెరుగుతుంది

Also Read : Diabetes and Lemon : నిమ్మకాయని ఇలా తీసుకుంటే షుగర్ కంట్రోల్ అవుతుందట..

​లివర్ ప్రాబ్లమ్స్..

లివర్ సింథటిక్ ఫంక్షణ్ దెబ్బ తినడంతో బ్లీడింగ్, కామెర్లు, ఎన్ఫెఫలోపతి వంటి సమస్యలు, ఎ,బి,సి,డి,ఇ వైరస్‌ల ఇన్ఫెక్షన్లతో హెపటైటిస్ కూడా ఉంది. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటుంటే సిర్రోసిస్ వస్తుంది. ఫ్యాటీ లివర్ కూడా మరో సమస్య. లివర్ పనిచేయకపోతే సర్జరీ ఎక్కటే మార్గం. ఎన్పెఫలోపతి బ్లీడింగ్, ఎసైటిస్ ముదిరినా ట్రాన్స్‌ప్లాంట్ జరగాల్సిందే. ఇది మంచిది. పునురత్పత్తి స్వభావం ఉన్న కాలేయాన్ని ఒకరి నుంచి ఒకరికి మార్చడం సులువే. కాలేయంలో ఉండే ఎనిమిదింటిలో మూడు సెగ్మెంట్స్ ఉన్నా.. రెండు మూడు నెలల్లో పూర్తి పరిమాణంలో కాలేయం ఏర్పడుతుంది. కాలేయం పూర్తిగా పాడైన వారికి ఆరోగ్యవంతులైన వారి కాలేయంలో కొంతభాగాన్ని అమర్చితే రెండు నెలల్లో దాత, గ్రహీతల్లోనూ పెరిగి తిరిగి సాధారణ స్థాయికి వస్తుంది. దీని గురించి ప్రతి ఒక్కరికి అవేర్‌నెస్ రావాలి.

Also Read : Neck Pain : మెడనొప్పి ఇలా వస్తే డేంజర్.. జాగ్రత్త..

​ముందుగానే గుర్తిస్తే..

కాలేయ సమస్యలను ముందుగానే గుర్తిస్తే ట్రీట్‌మెంట్ ఈజీ అవుతుంది. అయితే, ప్రజెంట్ కేసులు 90 శాతం ముదిరాకే హాస్పిటల్స్‌కి వస్తున్నారు. దీంతో సర్జరీ కష్టమవ్వడంతో పాటు పేషెంట్స్ త్వరగా రికవరీ అయ్యే శక్తిని కోల్పోతాడు. ఈ దశలో లివర్ ట్రాన్స్‌ప్లాంట్ ద్వారే పేషెంట్ ప్రాణాలను కాపాడొచ్చు. అయితే, అవయవదానంపై కూడా ప్రజల్లో అవగాహన లేకపోవడంతో లివర్ ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దీనిపై అవగాహన పెరగాలి.

Also Read : Migraine : ఈ ఆసనాలతో మైగ్రేన్ తలనొప్పి ఇట్టే తగ్గుతుందట..

​ఎలాంటి జాగ్రత్తలు..

లివర్ ప్రాబ్లమ్స్ రాకుండా ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవడం, అనారోగ్య లక్షణాలను గుర్తించి తక్షణమే డాక్టర్స్‌ని కన్సల్ట్ అవ్వాలి. లివర్ ట్రాన్స్‌‌ప్లాంట్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

-Prof. Dr. Tom Cherian , Founder & MD South Asian Liver Institute, Banjara Hills, Hyderabad

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
Read More : Relationship News and Telugu News

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *