[ad_1]
RBI Repo Rate News: మన దేశంలో వడ్డీ రేట్ల పెంపునకు మరోమారు రంగం సిద్ధమైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) తన వడ్డీ రేటును పెంచవచ్చు. అయితే, ఈ పెరుగుదల వేగం ఈసారి కొంచెం తక్కువగా ఉండవచ్చు. రెపో రేటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచినట్లయితే, అది ఈ సంవత్సరంలో మొదటి పెంపు అవుతుంది.
ఈ సంవత్సరంలో మొదటి ‘రిజర్వ్ బ్యాంక్ పరపతి విధాన కమిటీ (Monetary Policy Committee) సమీక్ష సమావేశం’ నేటి నుంచి బుధవారం వరకు (సోమవారం, ఫిబ్రవరి 06, 2023 నుంచి ఫిబ్రవరి 08 2023) జరుగుతోంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (RBI Governor Shaktikanta Das), సమావేశం చివరి రోజు అయిన బుధవారం మధ్యాహ్నం సమయంలో MPC నిర్ణయం గురించి ప్రకటన చేస్తారు.
వేగంగా తగ్గుతున్న ద్రవ్యోల్బణం (Inflation) & దిగుమతి ధరల తగ్గింపు మధ్య, రెపో రేటును రిజర్వ్ బ్యాంక్ 25 బేసిస్ పాయింట్ల (bps) మేర పెంచవచ్చని తన నివేదికలో బార్ల్కేస్ వెల్లడించింది. ద్రవ్యోల్బణ భారం క్రమంగా దిగి వస్తుండడంతో రెపో రేటు పెంపు 25 bpsను మించకపోవచ్చని మార్కెట్ కూడా అంచనా వేస్తోంది.
అంతా ఊహిస్తున్నట్లుగా.. రెపో రేటును 25 bps (0.25%) పెంచాలని MPC సమావేశంలో నిర్ణయిస్తే, మొత్తం రెపో రేటు 6.50 శాతానికి (RBI Repo Rate) చేరుతుంది. ప్రస్తుతం రెపో రేటు 6.25 శాతంగా ఉంది.
డిసెంబర్లో పెరిగిన రెపో రేటు
రిజర్వ్ బ్యాంక్, చివరి సారిగా 2022 డిసెంబర్ నెలలో రెపో రేటును పెంచింది. అప్పుడు 35 బేసిస్ పాయింట్లను సెంట్రల్ బ్యాంక్ పెంచింది, మొత్తం రెపో రేటు 6.25 శాతానికి చేర్చింది. అంతకు ముందు జరిగిన 3 వరుస సమీక్షల్లోనూ 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేటును రిజర్వ్ బ్యాంక్ పెంచిన సంగతి మార్కెట్‌ను ట్రాక్ చేస్తున్న మన అందరికీ తెలిసిందే.
రెపో రేటు పెంపును 2022 మే నెల నుంచి సెంట్రల్ బ్యాంక్ ప్రారంభించింది. తాజాగా జరుగుతున్న సమీక్షలో మరో 25 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉంది కాబట్టి, రెపో రేటును (గత ఏడాది మే నుంచి) 225 బేసిస్ పాయింట్లు పెంచినట్లవుతుంది. దీంతో, రెపో రేటు 6.5 శాతానికి చేరుతుంది.
2023 జనవరి 31, ఫిబ్రవరి 1 తేదీల్లో జరిగిన సమావేశంలో, అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ US FED కూడా వడ్డీ రేట్ల పెంపులో దూకుడు ప్రదర్శించలేదు. మార్కెట్ ఊహించినట్లు 25 బేసిస్ పాయింట్ల పెంపుతో సరిపెట్టింది. ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, యూరప్ సెంట్రల్ బ్యాంక్‌లు కూడా రేట్ల పెంపులో దూకుడు చూపలేదు. అందువల్లే RBI కూడా ఇక నుంచి దూకుడు తగ్గిస్తుందని అంతా భావిస్తున్నారు.
ద్రవ్యోల్బణం మరింత తగ్గవచ్చు
డిసెంబర్ 2022లో, భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం ఒక సంవత్సరం కనిష్ట స్థాయికి దిగి వచ్చింది, వరుసగా రెండో నెలలోనూ 6 శాతం కంటే తక్కువగా నమోదైంది. ద్రవ్యోల్బణం మరింత తగ్గే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. 2023 చివరి నాటికి ద్రవ్యోల్బణం 5-5.5 శాతంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భారతదేశం సహా ప్రపంచ స్థాయిలోనూ ద్రవ్యోల్బణంలో తగ్గుదల ఉండొచ్చన్న నివేదికలు వెలువడుతున్నాయి.
[ad_2]
Source link
Leave a Reply