[ad_1]
Loan Rate Hike: దేశంలోని పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank Of India), కెనరా బ్యాంక్ (Canara Bank) తర్వాత ఇప్పుడు మరో బ్యాంకు కూడా రుణ రేట్లను (Lending Rates) పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
దేశంలోని పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన కోటక్ మహీంద్ర బ్యాంక్ తన కస్టమర్లకు షాక్ ఇస్తూ మార్జినల్ కాస్ట్ ఆధారిత రుణ రేట్లు (Kotak Mahindra Bank MCLR) పెంచింది. ఈ బ్యాంక్ MCLR 5 బేసిస్ పాయింట్లు లేదా 0.05 శాతం మేర పెరిగింది. కొత్త రేట్లు గురువారం (మార్చి 16, 2023) నుంచి అమలులోకి వచ్చాయి.
వివిధ కాలాలకు కోటక్ మహీంద్ర బ్యాంక్ MCLR
కోటక్ మహీంద్ర బ్యాంక్ ఓవర్‌నైట్ లోన్ (ఒక్క రోజు రుణం) MCLR ఇప్పుడు 8.25 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో.. 1 నెల కాల వ్యవధి MCLR 8.50 శాతానికి, 3 నెలల కాల వ్యవధి MCLR 8.65 శాతానికి చేరుకుంది. 6 నెలల కాల వ్యవధి MCLR 8.85 శాతానికి పెరిగింది. అదే విధంగా… 1 సంవత్సరం కాల వ్యవధి MCLR 9.05 శాతానికి, 2 సంవత్సరాల కాల వ్యవధి MCLR 9.10 శాతానికి 3 సంవత్సరాల కాల వ్యవధి MCLR 9.25 శాతానికి పెరిగింది.
అంటే, ఈ కాల వ్యవధులకు, సంబంధిత రేట్ల కంటే తక్కువకు కోటక్ మహీంద్ర బ్యాంక్ రుణాలు మంజూరు చేయదు. రేట్ల పెంపు తర్వాత… గృహ రుణం, కారు రుణం, విద్యా రుణం మొదలైన వాటిపై ఖాతాదార్లు ఇప్పటికే తీసుకున్న రుణం మీద నెలవారీ చెల్లించాల్సిన వాయిదా మొత్తం (EMI) పెరుగుతుంది. ఇకపై తీసుకునే రుణాలకు కూడా కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయి.
BPLR పెంచిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
బ్యాంక్ ఆఫ్ ఇండియా తన బేస్ రేట్ & బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటును బుధవారం (15 మార్చి 2023) నుంచి పెంచింది. ఈ బ్యాంక్ BPLR 0.70 శాతం లేదా 70 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ BPLR 14.15 శాతం నుంచి 14.85 శాతానికి పెరిగింది. బేస్ రేటు & BPLRను బ్యాంకులు మూడు నెలలకు ఒకసారి (త్రైమాసిక ప్రాతిపదికన) సవరిస్తుంటాయి.
కెనరా బ్యాంక్ కూడా MCLR పెంచింది
స్టేట్ బ్యాంక్ కంటే ముందే కెనరా బ్యాంక్ కూడా తన కస్టమర్లకు షాకిస్తూ MCLRని పెంచింది. ఈ బ్యాంక్ కొత్త రేట్లు 2023 మార్చి 12 నుంచి అమల్లోకి వచ్చాయి. బ్యాంక్ తన MCLR ని 45 బేసిస్ పాయింట్లు లేదా 0.45 శాతం వరకు పెంచింది. బ్యాంక్ ఓవర్‌నైట్ MLCRని 35 బేసిస్ పాయింట్లు పెంచి 7.90 శాతానికి చేర్చింది. 1-నెల MLCR 45 బేసిస్ పాయింట్లు పెరిగి 8.00 శాతానికి చేరుకుంది. 6 నెలల MLCRలో 10 బేసిస్ పాయింట్ల పెరుగుదల తర్వాత 8.40 శాతానికి చేరుకుంది. 3 నెలల MLCR 25 బేసిస్ పాయింట్లు పెరిగి 8.15 శాతానికి, 1 సంవత్సరం MLCR 10 బేసిస్ పాయింట్లు పెరిగి 8.60 శాతానికి చేరుకుంది.
[ad_2]
Source link
Leave a Reply