షుగర్‌ పేషెంట్స్‌ ఈ పండ్లు తింటే.. ఔషధంతో సమానం..!

[ad_1]

Best Fruits For Diabetes: డయాబెటిస్‌ తీవ్రమైన వ్యాధి. దీన్ని సైలెంట్‌ కిల్లర్‌ అని కూడా అంటారు. డయాబెటిస్‌కు శాశ్వత నివారణ లేదు. షుగర్‌ పేషెంట్స్‌ దీన్ని నియంత్రణలో ఉంచుకుంటేనే ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపగలరు. రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్‌లో ఉంచుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. షుగర్‌ పేషెంట్స్‌ పండ్లు తినకూడదనే అపోహలో ఉంటూ ఉంటారు. పండ్లలోని చక్కెర కారణంగా బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ పెరుగుతాయని చాలామంది అనుకుంటూ ఉంటారు. పండ్లలోని విటమిన్లు, మినరల్స్‌, ఫైబర్‌ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించగలవని, టైప్‌ 2 డయాబెటిస్‌ను కంట్రోల్‌ చేస్తాయని అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ (ADA) గుర్తించింది. షుగర్‌ పేషెంట్స్‌ కేవలం ఫ్రూట్‌ జ్యూస్‌లు తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉందని నిపుణలు అంటున్నారు. వీరు మొత్తం పండును తినాలని సూచిస్తున్నారు. డయాబెటిక్స్‌ షుగర్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవడానికి ఎలాంటి పండ్లు తినాలో ఈ స్టోరీలో చూద్దాం.

పీచ్‌..

పీచ్‌..

షుగర్ పేషెంట్స్‌ పీచ్‌ బెస్ట్‌ ఫ్రూట్‌ అనొచ్చు. ఒక పీచ్‌లో 59 కేలరీలు, 14 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. పీచ్‌లో 10 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. విటమిన్‌ సి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచడానికి సహాయపడుతుంది. ఈ పండులో 285 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. ఇది హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది. (image source – pixabay)

షుగర్‌ పేషెంట్స్‌ బరువు ఎందుకు తగ్గుతారు..?

షుగర్‌ పేషెంట్స్‌ బరువు ఎందుకు తగ్గుతారు..?

బెర్రీస్‌..

బెర్రీస్‌..

బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్‌, రాస్బెర్రీ, బ్లాక్‌ బెర్రీతో సహా అన్ని రకాల బెర్రీలు షుగర్‌ పేషెంట్స్‌కు ఉత్తమమైన ఎంపిక అని నిపుణులు సూచిస్తున్నారు. ADA ప్రకారం, బెర్రీలు సూపర్‌ఫుడ్‌. బెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్‌ అధికంగా ఉంటాయి. ఇవి షుగర్‌ పేషెంట్స్‌కు మేలు చేస్తాయి. ఒక కప్పు తాజా బ్లూబెర్రీస్‌లో 84 కేలరీలు, 21 గ్రాముల (గ్రా) కార్బోహైడ్రేట్లు ఉంటాయి.

(image source – pixabay)

Women Health: ఆడవాళ్లు ఈ సప్లిమెంట్స్‌ తీసుకుంటే.. హెల్తీగా ఉంటారు.. !

చెర్రీస్..

చెర్రీస్..

USDA ప్రకారం, ఒక కప్పు చెర్రీస్‌లో 52 కేలరీలు, 12.6 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. చెర్రీలో యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. గుండె సమస్యలు, క్యాన్సర్‌, డయాబెటిస్ వంటి సమస్యలతో పోరాడటానికి సహాయపడతాయి. (image source – pixabay)

Barley Water Health Benefits: బార్లీ నీళ్లు తాగితే శరీరానికి చలువ చేయడమే కాదు.. బరువు కూడా తగ్గుతారు..!

ఆప్రికాట్‌..

ఆప్రికాట్‌..

ఆప్పికాట్‌లో 17 క్యాలరీలు, 4 గ్రాముల కార్బోహైడ్రేట్లు మాత్రమే ఉంటాయి. ఆప్రికాట్‌లో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆహారంలోని గ్లూకోజ్‌ను రక్తంలోకి నెమ్మదిగా పంపిస్తుంది. నాలుగు చిన్న ఆప్రికాట్లలో 134 మైక్రోగ్రాముల విటమిన్‌ A ఉంటుంది. ఇది మీ రోజువారీ అవసరాన్ని తీరుస్తాయి. ఇది కళ్ల ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. మీ రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. (image source – pixabay)

యాపిల్‌..

యాపిల్‌..

USDA ప్రకారం, మీడియం సైడ్‌ యాపిల్‌ 95 కేలరీలు, 25 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. యాపిల్‌ పండ్లలో ఫైబర్, విటమిన్‌ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటుంది. ఈ పోషకాలు షుగర్‌ పేషెంట్స్‌కు మేలు చేస్తాయి.
పైన పేర్కొన్న పండ్లతో పాటు, మీరు ఆరెంజ్‌, పియర్, కివి, బొప్పాయి, అవకాడో వంటి పండ్లను కూడా మీ డైట్‌లో చేర్చుకోవచ్చు. ఈ పండ్లన్నింటిలో విటమిన్లు, ఫైబర్‌, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. దీంతో పాటు ఈ పండ్లన్నింటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇవి షుగర్‌ పేషెంట్స్‌కు మేలు చేస్తాయి.

డయాబెటిస్‌ కంట్రోల్‌లో ఉండాలంటే.. ఇవి కచ్చితంగా తినాలి..!

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *