షుగర్‌ పేషెంట్స్‌ సమ్మర్‌లో తాగాల్సిన డ్రింక్స్‌ ఇవే..

[ad_1]

​Diabetes Drinks: వేసవి కాలంలో వేడిని తట్టుకోవడానికి కూల్‌ డ్రింక్స్‌, షర్బత్‌లు, జ్యూస్‌లు ఎక్కువగా తాగుతూ ఉంటాం. అయితే, షుగర్‌ పేషెంట్స్‌కు ఇవి విషంతో సమానం. సమ్మర్‌లో డయాబెటిక్‌ పేషెంట్స్‌ ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా.. బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ అమాంతంగా పెరుగుతాయి. డయాబెటిక్‌ పేషెంట్స్‌కు రక్తంలో చక్కెర స్థాయిలు ధీర్ఘకాలం పాటు నియంత్రణలో లేకపోతే, అనేక అరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. అధిక దాహం, తరచుగా మూత్రవిసర్జన, అలసట, బరువు తగ్గడం, అస్పష్టమైన దృష్టి వంటి అనేక సమస్యలు వస్తాయి. వేసవి కాలం రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి కూల్‌ డ్రింక్స్‌కు బదులుగా.. అరోగ్యకరమైన పానీయాలు తీసుకోవాలని ప్రముఖ డైటీషియన్‌, ఫ్యాట్‌ టీ స్లిమ్‌ డైరెక్టర్‌, పోషకాహార నిపుణురాలు శిఖా అగర్వాల్‌ శర్మ అన్నారు.

నీళ్లు ఎక్కువగా తాగండి..

నీళ్లు ఎక్కువగా తాగండి..

రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో లేకపోతే.. డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. తగినంత నీరు తాగడం వల్ల యూరిన్‌ ద్వారా బ్లడ్‌లోని అదనపు గ్లూకోజ్‌ బయటకు వెళ్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిలూ.. నియంత్రణలో ఉంటాయి. రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్‌ ఉంచుకోవడానికి, శరీరంలోని వేడిని తగ్గించడానికి.. సరిపడా నీళ్లు తాగడం చాలా ముఖ్యం.

నిమ్మరసం నీళ్లు..

నిమ్మరసం నీళ్లు..

డయాబెటిక్‌ పేషెంట్స్‌ వేసవిలో నిమ్మరసం నీళ్లూ తాగితే మంచిదని నిపుణులు చెబుతున్నారు. నిమ్మరసంలో విటమిన్‌ సీ మెండుగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. నిమ్మరసం నీళ్లు డీహైడ్రేషన్‌ను దూరం చేస్తాయి. అయితే చాలామంది నిమ్మరసం నీళ్లలో చక్కెర వేసి తాగుతూ ఉంటారు. మీరు చక్కెరకు బదులుగా, నల్ల ఉప్పు వేసుకుని తాగండి.

ఫ్రూట్‌ జ్యూస్‌కు బదులు.. వెజిటెబుల్‌ జ్యూస్‌ తాగండి..

ఫ్రూట్‌ జ్యూస్‌కు బదులు.. వెజిటెబుల్‌ జ్యూస్‌ తాగండి..

వేసవిలో ఫ్రూట్‌ జ్యూస్‌లు ఎక్కువగా తాగుతూ ఉంటారు. పండ్లలో సహజ చక్కెర ఎక్కువగా ఉంటుంది, దీని కారణంగా రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు పెరుగుతాయి. సమ్మర్‌లో ఫ్రూట్‌ జ్యూస్‌కు బదులుగా వెజిటెబుల్‌‌‌‌‌‌ జ్యూస్‌ తాగండి. కూరగాయల రసం తాగితే.. షుగర్‌తో పాటుగా హైపర్‌టెన్షన్‌ కూడా కంట్రోల్‌లో ఉంటుంది.

కొబ్బరి నీళ్లు..

కొబ్బరి నీళ్లు..

కొబ్బరి నీళ్లు రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కొబ్బరి నీళ్లలో యాంటీ-ఆక్సిడెంట్, హైపోగ్లైసీమిక్, నెఫ్రోప్రొటెక్టివ్ లక్షణాలు ఉన్నాయి. ఇవి డయాబెటిక్‌ పేషెంట్స్‌కు మేలు చేస్తాయి. కొబ్బరి నీళ్లలో కార్బ్‌స్‌ తక్కువగా ఉంటాయి. అసంతృప్త కొవ్వులు ఉండవు, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కొబ్బరి నీళల్లో ఉండే పోషకాలు బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుతాయి.

Also Read: ఈ ఐదు పనులు మానేస్తే.. 15 రోజుల్లో షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది..!

మజ్జిగ..

మజ్జిగ..

ఈ దేశీ ఇండియన్ సూపర్ డ్రింక్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. మజ్జిగలోని ప్రోబయోటిక్స్‌.. గట్‌ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మజ్జిగ తాగడం వల్ల హైపర్‌టెన్షన్‌, కొలెస్ట్రాల్ స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి. మజ్జిగలో కేలరీలు, ఫ్యాట్‌, గ్రైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉంటాయి. వేసవిలో మజ్జిగ తాగితే.. డయాబెటిక్‌ పేషెంట్స్‌కు మేలు జరుగుతుంది.

Also Read: షుగర్‌ ఉంటే.. చేతులపై ఈ లక్షణాలు కనిపిస్తాయి..!
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *