[ad_1]
Sovereign Gold Bond: పెట్టుబడులు పెట్టి మంచి ఆదాయం సంపాదించాలని భావించే వాళ్లకు, ముఖ్యంగా బంగారంలో పెట్టుబడి పెట్టాలని అనుకునే వాళ్లకు సావరిన్ గోల్డ్ బాండ్ (SGB) స్కీమ్ మంచి అవకాశం. డిస్కౌంట్‌లో బంగారం కొనవచ్చు.
సావరిన్ గోల్డ్ బాండ్ (SGB) స్కీమ్ 2022-23 నాలుగో విడత సబ్‌స్క్రిప్షన్ సోమవారం (06 మార్చి 2023) నుంచి ప్రారంభమైంది, 10వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇష్యూ ప్రైస్‌గా ఒక్కో గ్రాము బంగారం ధరను ₹5,611 గా నిర్ణయించారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని, డిజిటల్ మోడ్‌లో చెల్లింపు చేసిన పెట్టుబడిదార్లకు ఒక్కో గ్రాముకు ₹50 డిస్కౌంట్ ఇస్తారు. ఇలాంటి వాళ్లకు ఒక్కో గ్రాము బంగారం రూ. 5,561 ధరకే లభిస్తుంది.
SGBలను కేంద్ర ప్రభుత్వ తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జారీ చేసి, విక్రయిస్తుంది.
సావరిన్ గోల్డ్ బాండ్లను ఎలా కొనాలి?
సావరిన్ గోల్డ్ బాండ్లను కొనుగోలు చేయడం చాలా సులభం. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, పోస్టాఫీలు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్చేంజీల (NSE, BSE) ద్వారా దరఖాస్తు చేసుకుని SGBలను పొందవచ్చు.
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
భారతదేశ నివాసితులు, ట్రస్ట్‌లు, HUFలు, స్వచ్ఛంద సంస్థలు సావరిన్ గోల్డ్ బాండ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మైనర్ల తరఫున ఒక సంరక్షకుడు లేదా మరికొందరితో కలిసి ఉమ్మడిగా కూడా వీటిని కొనవచ్చు.
సావరిన్ గోల్డ్ బాండ్ల వల్ల ఏంటి లాభం?
SGBలపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి 2.50% ఫిక్స్‌డ్ రేటుతో (కూపన్ రేట్) వడ్డీ చెల్లిస్తారు. బాండ్ ఇష్యూ తేదీ నుంచి వడ్డీ రేటు లెక్కింపు ప్రారంభం అవుతుంది.
ఎంత బంగారం కొనవచ్చు?
గోల్డ్ బాండ్ ద్వారా 1 గ్రాము బంగారాన్ని కూడా కొనుక్కోవచ్చు. ఇలా ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం ఒక గ్రాము నుంచి 4 కిలోల వరకు వ్యక్తులు (individuals) కొనుక్కోవచ్చు. HUFలకు కూడా గరిష్ట పరిమితి 4 కిలోలు. ట్రస్టులు, ఆ తరహా సంస్థలకు గరిష్ట పరిమితి 20 కిలోలు.
గోల్డ్ బాండ్లపై పన్ను మినహాయింపు
సావరిన్ గోల్డ్ బాండ్ కాల వ్యవధి 8 సంవత్సరాలు. జారీ తేదీ నుంచి ఐదేళ్ల లోపు డబ్బు వెనక్కు తీసుకోవాడనికి కుదరదు. ఐదేళ్ల తర్వాత రిడీమ్ (premature redemption) చేసుకోవచ్చు. పూర్తి కాలమైన 8 సంవత్సరాల వరకు మీరు (మెచ్యూరిటీ వరకు) బాండ్లను కొనసాగిస్తే, దీనిపై వచ్చే దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను (Long-term capital gains tax) మినహాయింపు మీకు దక్కుతుంది. బాండ్ బదిలీపై వచ్చే దీర్ఘకాలిక మూలధన లాభాలపై ఇండెక్సేషన్ బెనిఫిట్ కూడా అందుతుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
[ad_2]
Source link
Leave a Reply