[ad_1]
Stock Market Closing 10 October 2023:
భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. సోమవారం నాటి నష్టాల నుంచి రికవరీ అయ్యాయి. ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధ భయాల నుంచి ఇన్వెస్టర్లు బయటపడ్డారు. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 177 పాయింట్లు పెరిగి 19,689 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 566 పాయింట్లు పెరిగి 66,079 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 2 పైసలు బలపడి 83.27 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 65,512 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 65,662 వద్ద మొదలైంది. 65,662 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 66,180 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 566 పాయింట్లు పెరిగి 66,079 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
సోమవారం 19,512 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 19,565 వద్ద ఓపెనైంది. 19,565 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,717 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 177 పాయింట్లు పెరిగి 19,689 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ ఎగిసింది. ఉదయం 44,027 వద్ద మొదలైంది. 44,004 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,487 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 473 పాయింట్లు ఎగిసి 44,360 వద్ద ముగిసింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 44 కంపెనీలు లాభాల్లో 5 నష్టాల్లో ఉన్నాయి. కోల్ ఇండియా (5.07%), అదానీ పోర్ట్స్ (3.54%), భారతీ ఎయిర్‌టెల్ (2.54%), కొటక్ బ్యాంక్ (2.34%), హిందాల్కో (2.38%)షేర్లు లాభపడ్డాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్ (0.70%), సిప్లా (0.50%), టీసీఎస్ (0.24%), డాక్టర్ రెడ్డీస్ (0.16%), టైటాన్ (0.05%) నష్టపోయాయి. హెల్త్‌కేర్ మినహా బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, మెటల్, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎగిశాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.330 పెరిగి రూ.58,530 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.500 పెరిగి రూ.72,600 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.140 పెరిగి రూ.23,760 వద్ద కొనసాగుతోంది.
క్రితం సెషన్లో ఏం జరిగిందంటే?
భారత స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధం అంతర్జాతీయ మార్కెట్లలో నెగెటివ్ సెంటిమెంటుకు దారితీసింది. ఒక్క రోజులోనే ముడి చమురు ధరలు ఐదు శాతానికి పైగా పెరగడంతో ద్రవ్యోల్బణం అదుపు తప్పుతుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. అదే జరిగితే ఆర్థికవృద్ధి మందగించే అవకాశం ఉంది. దాంతో ఆసియా, ఐరోపా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 141 పాయింట్లు తగ్గి 19,512 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 483 పాయింట్లు తగ్గి 65,512 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి ఫ్లాట్‌గా 83.27 వద్ద స్థిరపడింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
[ad_2]
Source link
Leave a Reply