స్థిర ఆదాయం లేని ఫ్రీలాన్సర్లు, కన్సల్టెంట్లు – ఏ కేటగిరీ కింద ఐటీఆర్‌ ఫైల్‌ చేయాలంటే?

[ad_1]

Income Tax Return Filing 2024: జీతం తీసుకునే టాక్స్‌ పేయర్ల (salaried taxpayers) విషయంలో ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్న్‌ ఫైలింగ్‌ చాలా సులభంగా ఉంటుంది. శాలరీడ్‌ పర్సన్స్‌ ITRలో తికమకలు, తలనొప్పులు ఉండవు. పైగా, ప్రి-ఫిల్డ్‌ ఐటీ ఫామ్స్‌ వచ్చాక వాళ్ల పని ఇంకా సింపుల్‌గా మారింది. 

రెగ్యులర్ ఉద్యోగాలు కాకుండా ఫ్రీలాన్సర్‌ లేదా కన్సల్టెంట్‌గా పని చేస్తున్న వాళ్ల సంఖ్య ఇటీవలి సంవత్సరాల్లో బాగా పెరిగింది. ఈ కేటగిరీకి చెందిన వాళ్ల ITR దాఖలు ప్రక్రియ భిన్నంగా ఉంటుంది.

స్టాండర్డ్ డిడక్షన్ అర్హత ఉండదు 
శాలరీడ్‌ టాక్స్‌పేయర్‌లా ITR-1 లేదా ITR-2ను ఫ్రీలాన్సర్ లేదా కన్సల్టెంట్‌ ఫైల్ చేయలేడు. అతని ఆదాయం జీతం నుంచి రాదు కాబట్టి రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్ బెనిఫిట్‌ కూడా పొందలేడు. 

ఏ పన్ను విధానాన్ని ఎంచుకోవాలి?
వర్తించే ఆదాయపు పన్ను స్లాబ్ & రేట్‌ ఇక్కడ కీలక విషయం. ఫ్రీలాన్సర్‌ లేదా కన్సల్టెంట్‌గా ఏడాది పొడవునా సంపాదించిన మొత్తాన్ని బట్టి స్లాబ్ స్టిస్టమ్‌, పన్ను రేటు వర్తిస్తుంది. జీతం తీసుకునే వ్యక్తుల్లా ప్రతి సంవత్సరం ఇష్టమైన పన్ను విధానాన్ని (Tax Regime) వీళ్లు ఎంచుకోలేరు. ఈ కేటగిరీ వ్యక్తులు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు. అయితే, ఒకసారి కొత్త విధానంలోకి మారిన తర్వాత, ఇక దానిని మార్చుకునే అవకాశం ఉండదు.

ప్రిజమ్టివ్‌ టాక్సేషన్‌ స్కీమ్‌
ఫ్రీలాన్సర్లు, కన్సల్టెంట్‌లు ఊహాజనిత పన్నుల పథకాన్ని (Presumptive Taxation Scheme) ఎంచుకునే ఆప్షన్‌ పొందుతారు. వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం సంపాదించే వాళ్లు ఇన్‌కమ్‌ టాక్స్‌ చట్టంలోని సెక్షన్ 44ADA ప్రకారం ఈ స్కీమ్‌ను ఎంచుకోవచ్చు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 75 లక్షలు దాటకుండా ఆదాయం పొందిన నిపుణులకు మాత్రమే ఇది వరిస్తుంది. అంతకుముందు ఏడాది ఇది రూ. 50 లక్షలుగా ఉంది. ఈ స్కీమ్‌ అర్హత ఉంటే, మొత్తం రిసిప్ట్స్‌లో 50% వ్యాపార ఆదాయంగా చూపించొచ్చు, దాని ప్రకారం టాక్స్‌ కడితే చాలు.

కన్సల్టెంట్ ఆదాయం రూ.75 లక్షల కంటే ఎక్కువ ఉంటే, సెక్షన్‌ 44AD కింద ఈ స్కీమ్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇందులో మొత్తం కలెక్షన్స్‌ పరిమితిని గత ఏడాది ఉన్న రూ.2 కోట్ల నుంచి ఇప్పుడు రూ.3 కోట్లకు పెంచారు. అయితే, కమీషన్, బ్రోకరేజ్, ఏజెన్సీ వ్యాపారం నుంచి ఆదాయం వస్తుంటే ఈ ప్రయోజనం పొందలేరు.

ఏ ITR ఫామ్‌ ఎంచుకోవాలి?
వృత్తిపరమైన ఆదాయం ఉన్న ఫ్రీలాన్సర్లు, కన్సల్టెంట్లు ITR-3 ఫామ్‌ నింపాలి. ప్రిజమ్టివ్‌ టాక్సేషన్‌ స్కీమ్‌ ఎంచుకుంటే ITR-4 తీసుకోవాలి. రూ.75 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే, లేదా నష్టాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలంటే ITR-3 ఫారాన్ని మాత్రమే ఎంచుకోవాలి. 

కన్సల్టెంట్లు, ఫ్రీలాన్సర్లకు ITR ఫైలింగ్‌ గడువు ఎప్పుడు?
ఐటీఆర్‌ దాఖలు విషయంలో కన్సల్టెంట్లు, ఫ్రీలాన్సర్లకు ప్రత్యేక గడువంటూ ఉండదు. సాధారణ పన్ను చెల్లింపుదార్లకు వర్తించే తేదీలే వాళ్లకూ వర్తిస్తాయి. సాధారణంగా, ఐటీఆర్‌ దాఖలు చేయడానికి గడువు జులై 31. అయితే, ఒక కన్సల్టెంట్ సెక్షన్ 44AB కింద ఆడిట్ పరిధిలోకి వస్తే, అప్పుడు ఐటీఆర్‌ దాఖలు గడువు అక్టోబర్‌ 31కి మారుతుంది. 

మరో ఆసక్తికర కథనం: ఈ విషయాలను మీ ఐటీఆర్‌లో కచ్చితంగా చూపాలి, లేకపోతే రూ.10 లక్షల ఫైన్‌!

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *