హై బీపీ ఉన్నవారు.. ఈ పండ్లు, కూరగాయలు తింటే మంచిది..!

[ad_1]

​Hypertension: ప్రస్తుతం చాలా మంది హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నారు. హైపర్‌టెన్షన్‌ కారణంగా.. హార్ట్‌ ఎటాక్‌, స్ట్రోక్‌, కిడ్నీ సమస్యలు, కంటిచూపు కోల్పోవడం, మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే హైపర్‌టెన్షన్‌ను ‘సైలెంట్‌ కిల్లర్‌’ అని పిలుస్తారు. ప్రపంచ జనాభాలో 30 శాతానికి పైగా హైబీపీతో బాధపడుతున్నారని కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవడానికి.. ఎన్నో మందులు, చికిత్సలు ఉన్నాయి. వైద్యులు సూచించిన మందులతో పాటు జీవినశైలిలో మార్పులు చేసుకుంటూ, పోషకాహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే.. హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవచ్చని నిపుణులు అంటున్నారు. హైపర్‌టెన్షన్‌ కారణంగా తలెత్తే ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని చెబుతున్నారు. హైపర్‌టెన్షన్‌ను నియంత్రించడానికి సహాయపడే.. కూరగాయలు, పండ్ల గురించి ఈ స్టోరీలో చూద్దాం.

పొటాషియం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి..

పొటాషియం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి..

హైపర్‌టెన్షన్‌తో బాధపడే వాళ్లు పొటాషియం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. పొటాషియం కంటెంట్‌.. శరీరంలోని అదనపు సోడియం స్థాయిలను తగ్గిస్తుంది. దీంతో అధిక రక్తపోటు తగ్గుతుంది. పొటాషియం మరి ముఖ్యంగా.. రక్తనాళాల్లో ఒత్తడిని తగ్గించి.. రక్తప్రసరణ సాఫీగా జరగడానికి సహాయపడుతుంది. మీ డైట్‌లో పొటాషియం ఎక్కువగా ఉండే.. ఆకుకూరలు, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, బచ్చలికూర, బ్రకోలీ, టొమాటోలు, బంగాళదుంపలు, చిలగడదుంపలు తీసుకోండి. అరటిపండ్లు, పుచ్చకాయ, కమల, నేరేడు వంటి పండ్లలోనూ పొటాషియం అధికంగా ఉంటుంది. ఇవి హైపర్‌టెష్షన్‌ పేషెంట్స్‌కు మేలు చేస్తాయి.

విటమిన్‌ సీ ఫుడ్స్‌..

విటమిన్‌ సీ ఫుడ్స్‌..

విటమిన్‌ సీ మెండుగా ఉండే పండ్లు, కూరగాయలలో ఆరోగ్యాన్ని ప్రోత్సహించే యాంటీఆక్సిడెంట్ అంశాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తనాళాలపై ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. దీంతో, హైపర్‌టెన్షన్‌ కంట్రోల్‌లో ఉంటుంది. దీంతోపాటు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మీ డైట్‌లో సిట్రస్‌ పండ్లు, కమల, పుచ్చకాయ, జామకాయ వంటి పండ్లు మీ ఆహారంలో తీసుకోండి.

ఉల్లిపాయ..

ఉల్లిపాయ..

ఉ ల్లిపాయలో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. దీనిలో ముఖ్యంగా.. క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. అధిక రక్తపోటుతో బాధపడేవారు.. ఉల్లి ముక్కలను పెరుగులో కలుపుకుని తీసుకుంటే.. చాలా మంచిది. (image source – unsplash)

టమాటా..

టమాటా..

టమాటా హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్‌లో ఉంచడమే కాకుండా.. గుండె సమస్యలకు దారితీసే చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిని నియంత్రిస్తుంది. మంచి రిజల్ట్స్‌ కోసం.. రోజు టమాటా జ్యూస్‌ తాగడం అలవాటు చేసుకోండి.

Also Read: డయాబెటిక్‌ పేషెంట్స్‌.. సమ్మర్‌లో ఈ డ్రింక్స్‌ తాగితే షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది..!

ప్రోటిన్‌..

ప్రోటిన్‌..

హైపర్‌టెన్షన్ ఉన్నవారు.. ప్రోటిన్‌ ఎక్కువగా ఉన్న సోయా, మిల్క్‌ ప్రొటిన్‌ ఆహారాలు తీసుకుంటే.. సిస్టోలిక్‌ రక్తపోటు తగ్గుతుంది. మీ డైట్‌లో బాదంపప్పు, పిస్తా, అక్రోట్, బఠాణీలు, రాజ్మా, బీన్స్, చిక్కుళ్లు,చేపలు చేర్చుకోండి. ఇవి అధిక రక్తపోటుని తగ్గించడానికి సహాయపడతాయి.

Also Read: వెజిటేరియన్స్‌ ఇవి తింటే.. ప్రొటిన్స్‌ లోపం రాదు..!

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *