[ad_1]
కానీ, అటువంటి సంఘటన జరిగితే ఆన్లైన్ పరిస్థితేంటి? ఇది కేవలం ప్రచారమా? అని జనాలు తెగ చర్చించుకోవడం మొదలుపెట్టారు. అయితే, ఈ ఆందోళనలు పూర్తిగా కల్పితం కాదని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. ‘బలమైన సౌర తుఫాను భూమిని తాకుతుందని, అనుసంధానిత ప్రపంచంలో ఇప్పటివరకు జరగని అరుదైన సంఘటన కారణంగా ఇంటర్నెట్ అంతరాయానికి విస్తృతంగా కారణమవుతుంది’ అని తెలిపింది. టైలిగ్రాఫ్ లైన్లలో మంటలు చెలరేగి.. ఆపరేటింగ్ వ్యవస్థలు విద్యుదాఘాతానికి గురైన 1859 నాటి కారింగ్టన్ సంఘటనను ఈ సందర్భంగా ప్రస్తావించింది. అలాగే, 1989 సౌర తుఫాను క్యూబెక్ పవర్ గ్రిడ్‌ను గంటల తరబడి ప్రభావితం చేసిన అంశాన్ని గుర్తుచేసింది.
ఇర్విన్లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ సంగీత అబ్దు జ్యోతి మాట్లాడుతూ.. ‘తీవ్రమైన సౌర తుఫాన్లు సంభవిస్తే ఎలా ఉంటుందన్న పరిస్థితి ఎన్నడూ ఎదుర్కోలేదు.. మా మౌలిక సదుపాయాలు దానికి ఎలా స్పందిస్తాయో మాకు తెలియదు.. మా వైఫల్య పరీక్షలో అలాంటి దృశ్యాలు కూడా లేవు.. దీనిని అంచనా వేయలేం’ అని ఆమె అన్నారు.
ప్రొఫెసర్ జ్యోతి రాసిన ‘సోలార్ సూపర్‌స్టార్మ్స్: ప్లానింగ్ ఫర్ ఆన్ ఇంటర్నెట్ అపోకలిప్స్’ అనే రిసెర్చ్ పేపర్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. శక్తివంతమైన సౌర తుఫాను సుదూర కనెక్టివిటీ కలిగిన సముద్రగర్భ కమ్యూనికేషన్ కేబుల్స్ వంటి మౌలిక సదుపాయాలను పెద్ద ఎత్తున ప్రభావితం చేసే అవకాశం ఉందని జ్యోతి చెప్పారు. ఇటువంటి అంతరాయాలు నెలల తరబడి కొనసాగుతాయని, కేవలం ఒక్క అమెరికాలోనే రోజుకు 11 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నష్టం చవిచూడాల్సి వస్తుందని ఆ పత్రిక పేర్కొంది.
భూమిపై అత్యంత ఉష్ణోగ్రత నమోదైన రోజుగా జూలై 4న నిలిచింది. సూర్యుడు ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో నిప్పులు కురిపించాడు. స్పేస్ వెదర్ శాస్త్రవేత్త తమితా స్కోవ్.. సూర్యుని చుట్టూ తిరుగుతున్న నాసా సోలార్ అండ్ హీలియోస్పిరిక్ అబ్జర్వేటరీ (SOHO) ద్వారా సంగ్రహించిన సౌర తుఫాను లేదా కరోనల్ మాస్ ఎజెక్షన్ల (CMEలు) వీడియోను పంచుకున్నారు.
Read More Latest Science & Technology News And Telugu News
[ad_2]
Source link
Leave a Reply