99580847

[ad_1]

Anti Inflammatory Herbs: మన శరీరంలోకి ఏదైనా వైరస్‌లు, బ్యాక్టీరియా, విష పదార్థాలు ప్రవేశించినా, ఏదైనా గాయం అయినా.. మన బాడీ రోగనిరోధక వ్యవస్థను యాక్టివ్‌ చేస్తుంది. మన రోగనిరోధక వ్యవస్థ వాటితో పోరాడటానికి ఇన్ఫ్లమేటరీ కణాలు, సైటోకిన్లు పంపుతుంది. ఈ కణాలు బాక్టీరియా, ఇతర ఏజెంట్లను ట్రాప్‌ చేయడానికి, కణాలను రిపేర్‌ చేయడానికి ఇన్ఫ్లమేటరీ గుణాలను విడుదల చేస్తాయి. ఫలితంగా నొప్పి, వాపు, మంటకు కారణం అవుతాయి. కానీ ఈ వాపును మనం చూడలేం, కాని శరీర వ్యవస్థలను కూడా ప్రభావితం చేస్తుంది. ఇన్ప్లమేషన్‌ దీర్ఘకాలం ఉంటే.. గుండె సమస్యలు, డయాబెటిస్‌, అర్థరైటిస్‌ వంటి తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది. ప్రముఖ పోషకాహార నిపుణురాలు లవ్‌నీత్‌ బాత్రా ఇన్ఫ్లమేషన్‌ను తగ్గించే మూలకల గురించి తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో వివరించారు.​

అశ్వగంధ..

అశ్వగంధ..

అశ్వగంధ ఒక పురాతన ఔషదం. ఆయుర్వేదంలో అనేక అనారోగ్యలను చికిత్స చేయడానికి అశ్వగంధను ఉపయోగిస్తారు. అశ్వగంధలో విత్ఫెరిన్ A (WA)తో సహా అనేక సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరరంలో ఇన్ఫ్లమేషన్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. ఇన్ఫ్లమేషన్‌ గుర్తులను తగ్గించి.. రోగనిరోధక కణాలను మెరుగుపరుస్తుంది. అశ్వగంధలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ స్ట్రెస్, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి మన రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. (image source – pixabay)

అల్లం..

అల్లం..

అల్లంలో జింజెరోల్, షోగోల్, జింగిబెరెన్, జింజెరోన్ వంటి 100 కంటే ఎక్కువ క్రియాశీల సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. అల్లం తరచుగా తీసుకుంటే.. ఇన్ఫ్లమేషన్‌ తగ్గడంతో పాటు కొలస్ట్రాల్‌ కరుగుతుంది, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అల్లం జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. (image source – pixabay)

తులసి..

తులసి..

తులసిలో యాంటీమైక్రోబయల్, యాంటీ అలెర్జిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. జలుబు చేసినప్పుడు తులసి టీ తాగితే.. నాసికా శ్లేష్మ పొర వాపును నివారిస్తుంది.

నల్లమిరియాలు..

నల్లమిరియాలు..

నల్ల మిరియాలలో పైపెరిన్‌ అనే ముఖ్యమైన కాంపౌండ్‌ ఉంటుంది. ఇది శరీరంలోని ఇన్ఫ్లమేషన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్‌-ఎ, సి పుష్కలంగా ఉంటాయి. ఇవి మన రోగనిరోధక వ్యవస్థను బూస్ట్‌ చేస్తాయి.

పసుపు..

పసుపు..

పసుపులోని ప్రధాన యాంటీ ఆక్సిడెంట్ అయిన కర్కుమిన్‌కు శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇన్ఫ్లమేషన్‌ను ప్రోత్సహించే జన్యువులను యాక్టివ్‌ చేసే NF-kB క్రియాశీలతను కర్కుమిన్‌ నిరోధిస్తుంది. (image source – pixabay)

ఈ జాగ్రత్తలు తీసుకోండి..

ఈ జాగ్రత్తలు తీసుకోండి..
  • మన శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడానికి.. మన లైఫ్‌స్టైల్‌లో కొన్ని మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
  • మీ డైట్‌లో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి పోషకాలు అధికంగా ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోండి.
  • క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే.. కొవ్వు కరుగుతుంది, రక్తప్రసరణ మెరుగుపడుతుంది. తద్వారా వాపును తగ్గించవచ్చు.
  • ఒత్తిడి కారణంగా.. ఇన్ఫ్లమేషన్‌ పెరిగే అవకాశం ఉంది. ధ్యానం, యోగా, ప్రాణాయమం ప్రాక్సిస్‌ చేస్తే మీ స్ట్రెస్‌ లెవల్స్‌ తగ్గుతాయి.
  • స్మోకింగ్, మద్యానికి దూరంగా ఉండండి. వీటి కారణంగా మన శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ పెరుగుతుంది.
  • నిద్రలేమి కారణంగా మన శరీరంలో ఇన్ఫ్లమేటరీ పదార్థాలు విడుదల అవుతాయి. ప్రతి రోజూ కనీసం 8 గంటలు నిద్రపోయేలా చూసుకోండి.

గమనిక:ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *