[ad_1]
మూడు కంపెనీలు..
ప్రధానంగా అదానీకి చెందిన అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్, అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ కంపెనీలపై స్వల్ప కాలిక అదనపు నిఘాను ఎన్ఎస్ఈ పెంచింది. ఈ కంపెనీల ట్రేడింగ్ పై అందించే మార్జిన్ విషయంలో తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. కొత్త పొజిషన్లు ఫిబ్రవరి 6 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ క్రమంలోనే స్టాక్ ఎక్స్ఛేంజ్ అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ బ్యాండ్‌ను 10% నుంచి 5%కి తగ్గించింది.
|
ఆస్తుల జాతీయం..
అదానీ వివాదం దావానలం లాగా ఇన్వెస్టర్ల సంపదను దహించి వేస్తుండగా.. రాజకీయ డిమాండ్లు సైతం పెరిగాయి. అదానీ అండ్ కో వాణిజ్య ఆస్తులను జాతీయం చేయాలని బీజేపీ నేత సుబ్రమ్మణ్య స్వామి డిమాండ్ చేయటం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.
అమెరికాలో ఇబ్బందులు..
యూఎస్ స్టాక్ మార్కెట్ సూచీ S&P Dow Jones అదానీ కంపెనీల విషయంలో కీలక ప్రకటన చేసింది. అదానీ గ్రూప్ లోని ప్రఖ్యాత కంపెనీ అదానీ ఎంటర్ ప్రైజెస్ సబ్సిడరీ ఇండీసెస్ నుంచి తొలగిస్తున్నట్లు అందులో వెల్లడించింది. ఫిబ్రవరి 7 నుంచి ఇవి అమలులోకి రానున్నాయి. అదానీ కంపెనీలపై వచ్చిన సంచలన రిపోర్స్ తర్వాత చాలా సంస్థలు చర్యలకు దిగుతున్నాయి.
పతనమౌతున్న షేర్లు..
అదానీ ఎంటర్ ప్రైజెస్ స్టాక్ ఏకంగా 25 శాతం మేర అంటే ఒక్కో షేరుకు రూ.391.30 నష్టపోయి రూ.1,173.95 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఇది కంపెనీ 52 వారాల కనిష్ఠ ధర కావటం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది. ఇతర అదానీ స్టాక్స్ సైతం భారీగానే నష్టపోయాయి.
[ad_2]
Source link
Leave a Reply