[ad_1]
సీఈవో స్పందన..
ఎయిర్ ఇండియా మూత్ర విసర్జన కేసు ఇప్పుడు ఎయిర్‌లైన్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ క్యాంప్‌బెల్ విల్సన్ దృష్టికి వెళ్లింది. ఇలాంటి ఘటన జరగటంపై ఆయన ప్రకటన చేశారు. ఘటన జరిగినప్పుడు విమానంలో డ్యూటీలో ఉన్న నలుగురు సిబ్బందికి, ఒక పైలట్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఆయన విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
దీంతో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు వ్యూహం రచించారు. పైగా విమానంలో ప్రయాణించే సమయంలో ఆల్కహాల్ అందించే విధానాన్ని సమీక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇలాంటి ఘటన జరగటంపై క్షమాపణలు చెప్పారు.
దిల్లీలో అరెస్ట్..
ఇదిలావుండగా ఎయిర్ ఇండియా విమానంలో తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసినందుకు బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తిని దిల్లీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. 2022న న్యూయార్క్ నుంచి దిల్లీకి వస్తున్న ఏఐ-102 విమానంలో ఈ ఘటన జరిగింది. ఈ వ్యవహారంలో ఎయిర్ ఇండియా మెుత్తంగా.. నలుగురు క్యాబిన్ సిబ్బంది, ఒక పైలట్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చి విచారణ పూర్తయ్యే వరకు విధుల నుంచి తప్పించింది. మద్యం సేవించటం, సంఘటనను మేనేజ్ చేయటం, ఫిర్యాదు నమోదు, ఫిర్యాదు నిర్వహణ వంటి విషయాల్లో ఏమైనా లోపాలు ఉన్నాయా అనేదానిపై కంపెనీ అంతర్గతంగా విచారణ చేపడుతోంది.
అంతర్జాతీయ కంపెనీ..
నవంబర్ 26, 2022న న్యూయార్క్ నుంచి దిల్లీ వెళ్లే ఎయిర్ ఇండియా విమానం బిజినెస్ క్లాస్‌లో మూత్ర విసర్జన ఘటన మీడియాలో పెద్ద చర్చకు కారణం అయ్యింది. ఇందులో నిందితుడు మిశ్రా అసభ్యంగా ప్రవర్తించాడు. ఎయిర్ ఇండియాకు మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దిల్లీ పోలీసులు జనవరి 4న మిశ్రాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇదే సమయంలో అతను పనిచేస్తున్న అంతర్జాతీయ కంపెనీ వెల్స్ ఫార్గో అతడిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు గత శుక్రవారం ప్రకటించింది. మద్యం మత్తులో చేసిన ప్రవర్తనను బహుళజాతి కంపెనీ సైతం తప్పుపట్టింది.
ఆందోళన వ్యక్తం..
ఎయిరిండియా విమానాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని.. కొందరు ప్రయాణికులు తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేయటం వల్ల ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ క్యాంప్ బెల్ విల్సన్ అధికారికంగా ప్రకటించారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసేందుకు కంపెనీ చర్యలు చేపడుతుందని వెల్లడిస్తూ క్షమాపణలు కోరారు. విమాన ప్రయాణ సమయంలో తాము ఈ రెండు అంశాలపైనా మరింత మెరుగ్గా చేయగలమని ఎయిర్ ఇండియా గుర్తించిందని.. ఆ దిశలో చర్యలు చేపడతామని అన్నారు.
[ad_2]
Source link
Leave a Reply