Asteroid: ఎల్లుండి భూమి దిశగా దూసుకొస్తున్న భారీ ఆస్ట్రాయిడ్.. నాసా హెచ్చరికలు

[ad_1]

అంతరిక్షం నుంచి దూసుకొచ్చే ఆస్ట్రాయిడ్లు (Asteroids) భూమిని (Earth) ఢీకొంటే మానవ జీవితానికి భారీ విపత్తు సంభవించవచ్చు. ఈ నేపథ్యంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ (Jet Propulsion Laboratory) రాబోయే రోజుల్లో భూమికి గ్రహశకలాల ముప్పు ఉందని, సాపేక్షంగా ఇవి అతి సమీపంగా వస్తాయని హెచ్చరించింది. ఏప్రిల్ మొదటి వారంలోనే ఐదు గ్రహశకలాలు భూమికి చేరువుగా వస్తున్నట్టు నాసా తెలిపింది. వీటిలో రెండు గ్రహశకలాలు ఒకే రోజు సమీపంగా వస్తుండటం గమనార్హం.

ముఖ్యంగా నాసా (NASA) గ్రహశకలం వాచ్ డాష్‌బోర్డ్ భూమికి సాపేక్షంగా దగ్గరగా ఉండే గ్రహశకలాలు, తోకచుక్కలను ట్రాక్ చేస్తుంది. ఆస్ట్రాయిడ్ ప్రయాణ విధానం, వ్యాసం, సాపేక్ష పరిమాణం, భూమి నుంచి ఉన్న దూరం, వచ్చే తేదీ మొదలైన వివరాలు డ్యాష్‌బోర్డులో ఉంటాయి.

ఆస్ట్రాయిడ్ 2023 FU6:45 అడుగుల పరిమాణంలో ఉండే చిన్న ఆస్ట్రాయిడ్ భూమికి సమీపంగా ఏప్రిల్ 3 న భూమికి సమీపంగా వచ్చింది. ఆ సమయంలో రెండింటికి మధ్య దూరం 1,870,000 కిలోమీటర్ల దూరం.

ఆస్ట్రాయిడ్ 2023 FS11: 82 అడుగుల ఈ గ్రహశకలం విమానం పరిమాణంలో ఉంటుంది.. ఇది కూడా ఏప్రిల్ 3న భూమికి సమీపంగా 6,610,000 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఆస్ట్రాయిడ్ 2023 FA7: 92 అడగులు పరిమాణంలో ఓ పెద్ద విమానం సైజులో ఉండే ఈ గ్రహశకలం ఏప్రిల్ 4న భూమికి సమీపంగా వస్తుంది. భూమికి 2,250,000 కి.మీ. దూరంలో వస్తుంది.

ఆస్ట్రాయిడ్ 2023 FQ7: ఏప్రిల్ 5న 65 అడుగుల పొడవుతో ఇంటి పరిమాణంలో ఉండే ఈ గ్రహశకలం భూమికి 5,750,000 కిలోమీటర్ల సమీపానికి రానుంది.

ఆస్ట్రాయిడ్ 2023 FZ3: రాబోయే గ్రహశకలాలలో అతి పెద్ద గ్రహశకలం. ఇది ఏప్రిల్ 6న భూమిని దాటి వెళుతుందని అంచనా వేస్తున్నారు. 150 అడుగుల వెడల్పు గల గ్రహశకలం 67,656 కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తుంది. ఇది భూమికి 4,190,000 కి.మీ సమీపానికి వస్తుంది. అయినప్పటికీ ప్రమాదకరం కాదు..

కిలోమీటరు కంటే ఎక్కువ వెడల్పు ఉన్న 850తో సహా అన్ని పరిమాణాలలో ఉన్న దాదాపు 30,000 గ్రహశకలాలు భూమికి సమీపంలో ఉన్నాయి. ‘నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ (NEO)’లోని వీటి వల్ల రాబోయే 100 ఏళ్ల భూమికి ముప్పు ఉండదని అంటున్నారు.

NASA ప్రకారం.. మన సౌర వ్యవస్థ ఏర్పడిన తర్వాత గ్రహశకలాలు మిగిలి ఉన్నాయి. మన సౌర వ్యవస్థ సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల కింద వాయువులు, ధూళి మేఘాలతో ఏర్పడింది. ఇది జరిగినప్పుడు చాలా పదార్థం మేఘం మధ్యలో పడిపోయి సూర్యుడు ఏర్పడ్డాడు. మేఘంలోని కొన్ని ధూళి గ్రహాలుగా మారాయి.
ఇటీవల NASA ప్లానెటరీ డిఫెన్స్ కోఆర్డినేషన్ ఆఫీస్ దాదాపు ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్ పరిమాణంలో కొత్తగా కనుగొన్న గ్రహశకలం 23 సంవత్సరాల తర్వాత ప్రేమికుల రోజున భూమిని ఢీకొనే చిన్న అవకాశం ఉందని పేర్కొంది.

Read More Latest Science And Technology News And Telugu News

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *