Astrology: అక్కడ పుట్టుమచ్చలు ఉంటే అదృష్టమేనటా..!

[ad_1]

ఎక్కడుంటే మంచిది

ఎక్కడుంటే మంచిది

శరీరంలో వివిధ భాగాల్లో పుట్టు మచ్చల వల్ల వివిధ ప్రయోజనాలు ఉన్నాయని వివరిస్తున్నారు. మగవారికీ, ఆడవారికీ పుట్టుమచ్చల విషయంలో చాలా తేడాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే పుట్టు మచ్చలు ఉన్న చోటును బట్టి అవి మంచివా కాదో చెబుతారు. పుట్టుమచ్చులు ఎక్కడ ఉంటే మంచిదో తెలుసుకుందాం..

కుడి చేతి మీద:
కుడిచేతిపై పుట్టుమచ్చ ఉన్నవారికి డబ్బుకు కొరత ఉండదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. వారు జీవితంలో అన్ని సౌకర్యాలు పొందడమేకాకుండా.. సమాజంలో చాలా గౌరవం లభిస్తుందట. వారు అన్ని రంగంలో విజయాలు సాధిస్తారు. మగవారు తమ కుడివైపు శరీర భాగాలపై పుట్టుమచ్చలు కలిగివుంటే అదృష్టమని పండితులు వివరిస్తున్నారు. అదే మహిళలైతే… ఎడమవైపు శరీరంపై పుట్టుమచ్చలు మంచిదట.

12 కంటే ఎక్కవ

12 కంటే ఎక్కవ

ఓ వ్యక్తి శరీరంపై 12 కంటే ఎక్కువ పుట్టుమచ్చలు ఉంటే మంచిది కాదట. వారి జీవితంలో ఆనందం, మనస్శాంతి ఉండవని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. కుడి కనుబొమ్మపై పుట్టుమచ్చ ఉంటే… వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుందట. అదే ఎడమ కనుబొమ్మపై పుట్టుమచ్చ ఉంటే… వైవాహిక జీవితంలో మనస్పర్థలు, గొడవలు జరుగుతాయట.

ముక్కుపై
ముక్కులో, ముక్కుపైన పుట్టుమచ్చ ఉంటే… ఆ వ్యక్తి చాలా టాలెంట్ కలిగి ఉంటారు. ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా మహిళలు ఈ విషయంలో అదృష్టవంతులవుతారు. పై పెదవిపై పుట్టుమచ్చ ఉన్నవారికి… హృదయమంతా ప్రేమతో నిండి ఉంటుందట. వారిలో లైంగిక కోరికలు చాలా బలంగా ఉంటాయట. అదే పుట్టుమచ్చ కింది పెదవిపై ఉంటే… వారి జీవితంలో పేదరికం ఉంటుందట.

ఎడమ బుగ్గపై

ఎడమ బుగ్గపై

ఎడమ బుగ్గపై పుట్టుమచ్చ ఉంటే నిరాశతో ఉంటారు. కుడి బుగ్గపై పుట్టుమచ్చ ఉంటే… సంపన్నులు అవుతారట.కుడిచేతిపై పుట్టుమచ్చ ఉన్నవారికి డబ్బుకు కొరత ఉండదని శాస్త్రం చెబుతోంది. వారు జీవితంలో అన్ని సౌకర్యాలు పొందడమేకాకుండా.. సమాజంలో చాలా గౌరవం లభిస్తుందని శాస్త్రం తెలుపుతోంది. వీరు అన్ని రంగంలో విజయాలు సాధిస్తారు.

ఛాతీ మధ్యలో
ఛాతీ మధ్యలో పుట్టుమచ్చ ఉన్న వ్యక్తికి లక్ష్మి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. వీరు ఎప్పుడు అమ్మవారి అనుగ్రహం పొందుతారట. అంతేకాకుండా వీరు అర్థికంగా చాలా బలంగా ఉంటారట. వీరు జీవితంలో ఏమి పనులు చేయాలనుకున్న సులభంగా చేస్తారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా అనుకున్న కోరికలు నెరవేరుతాయట.

ముఖంపై

ముఖంపై

ముఖం మధ్యలో పుట్టుమచ్చ ఉంటే… అది ప్రేమకు గుర్తు. అదే మోల్ ముఖంపై కుడివైపు ఉంటే ఆ వ్యక్తి ఏదైనా ఒక సబ్జెక్టుపై విపరీతమైన నాలెడ్జిని పొందగలరట. ముఖంపై ఎడమవైపు ఉంటే… వారు డబ్బును వృథా చేస్తారట. కళ్లలోపల పుట్టుమచ్చ ఉండేవారు సెన్సిటివ్‌గా ఉంటారట. చిన్న చిన్న విషయాలపైనా లోతుగా స్పందిస్తారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

అరచేతిలో
కుడి అరచేతిలో పుట్టుమచ్చ ఉంటే.. అలాంటి వ్యక్తి చాలా అదృష్టవంతుడని శాస్త్రం చెబుతోంది. ఈ వ్యక్తులు ఏ పనిలో చేయి వేసినా విజయం సాధిస్తారట. చెవిలో పుట్టుమచ్చ ఉంటే… ఎక్కువ కాలం జీవిస్తారట. నాలుకపై పుట్టుమచ్చ ఉంటే వారు చెప్పింది నిజమవుతుందట.

Note: ఈ వార్త జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం ఇచ్చాం. దీనిని వన్ ఇండియా ధృవీకరించడం లేదు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *