Bank Stocks: కొనుగోలుకు మూడు బ్యాంక్ స్టాక్‍లను సూచిన బ్రోకరేజీలు..

[ad_1]

HDFC బ్యాంక్‌

HDFC బ్యాంక్‌

ఆనంద్ రాఠీ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కు రూ. 1908 టార్గెట్ ధరతో కొనుగోలు చేయాలని సిఫార్సు చేశారు. ప్రస్తుత మార్కెట్ ధర ఒక్కో షేరు రూ.1597 ఉంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్టం వరుసగా రూ. 1721 మరియు 52 వారాల కనిష్టం 1271. స్టాక్ చివరి 5 సంవత్సరాల రాబడి 70%, 3 సంవత్సరాల రాబడి 23 శాతంగా ఉంది.సెప్టెంబర్ 30, 2022తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత మొత్తం ఆదాయాన్ని 11% వృద్ధితో రూ.49,182 కోట్లుగా ప్రకటించింది.

దీర్ఘకాలిక వృద్ధి

దీర్ఘకాలిక వృద్ధి

“దేశంలో బ్యాంకింగ్ సేవలు తక్కువగా ఉండటంతో HDFC బ్యాంక్‌కు ఇప్పటికే భారీ అవకాశం ఉందని ఆనంద్ రాఠీ తెలిపింది. రిటైల్‌లో నిరంతర వృద్ధితో ట్రాక్‌లో ఉందని పేర్కొంది. బ్రాంచ్ నెట్‌వర్క్, కార్డ్‌ల వ్యాపారం కొనసాగుతున్న విస్తరణ, విలీనంతో పాటు, దీర్ఘకాలిక వృద్ధికి సహాయపడుతుందని తెలిపింది.

ICICI బ్యాంక్‌

ICICI బ్యాంక్‌

ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లను రూ.1070 టార్గెట్ ధరతో కొనుగోలు చేయాలని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ కోటక్ సెక్యూరిటీస్ ఇసూచించింది. మీరు

ఈ స్టాక్ చివరి ట్రేడింగ్ ధర రూ. 879. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6,13,366.40 కోట్లు. స్టాక్ 52 వారాల గరిష్టం రూ.958 మరియు 52 వారాల కనిష్టం వరుసగా రూ.642గా ఉంది. ఈ స్టాక్ గత 5 సంవత్సరాలలో 177%, గత 3 సంవత్సరాలలో 62% రాబడి ఇచ్చింది. గత 1 సంవత్సరంలో ఈ స్టాక్ 20% ర్యాలీ చేసింది.

 బంధన్ బ్యాంక్‌

బంధన్ బ్యాంక్‌

కోటక్ సెక్యూరిటీస్ పెట్టుబడిదారులకు బంధన్ బ్యాంక్ స్టాక్‌ను సూచించింది. ఒక్కోటి టార్గెట్ ధర రూ.280గా నిర్ణయించింది. ఇంట్రాడేలో 2% క్షీణతతో స్టాక్ చివరి ట్రేడింగ్ ధర రూ. 226గా ఉంది.. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.36,541 కోట్లుగా ఉంది. షేర్లు గత 1-నెలలో 5% ర్యాలీ చేశాయి.

Note: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే ఇచ్చాం. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు రిస్క్ తో కూడుకున్నది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *