[ad_1]
భారత అంతరిక్ష చరిత్రలో మహోజ్వల ఘట్టం ఆవిష్కృతమైంది. చంద్రుడిపై అన్వేషణల్లో ఇప్పటిదాకా ఏ దేశమూ అందుకోలేకపోయిన సంక్లిష్ట లక్ష్యాన్ని ఇస్రో విజయవంతంగా చేరుకుని..ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద వ్యోమనౌకను సురక్షితంగా దించి.. గగన వీధిలో త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేసింది. ల్యాండర్ చంద్రుడిపై దిగిన క్షణంలో 140 కోట్ల మంది భారతీయుల హృదయాలను పులకించిపోయాయి. లైవ్‌లో ల్యాండింగ్ ప్రక్రియ మొదలుకాగే.. అందరూ ఊపిరి బిగబట్టి కన్నార్పకుండా ఉండిపోయారు.
[ad_2]
Source link
Leave a Reply