[ad_1]
బరువు తగ్గుతారు..
భోజనం సరిగ్గా నమలకుండా.. వేగంగా తినడం వల్ల ఆహారం సరిగ్గా తిన్నామన్న భావన కలగదు. దీంతో ఎక్కువగా తింటూ ఉంటారు. దీనివల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఆహారాన్ని బాగా నమిలి మింగడం ద్వారా ఎక్కువగా తినే వీలుండదు. ఆహారాన్ని బాగా నమిలి తింటే.. క్యాలరీల శాతం తగ్గుతుందని, దీంతో బరువు తగ్గుతారని చైనాకు చెందిన హర్బిన్ మెడికల్ యూనివర్శిటీ నిర్వహించిన అధ్యయనంలో తేలింది.
జీర్ణవ్యవస్థకు మంచిది..
ఎక్కువగా నమిలి తినడం వల్ల ఆహారం బాగా జీర్ణం అవుతుంది. నోట్లోనే ఆహారం మెత్తగా కావడం వల్ల జీర్ణ వ్యవస్థపై భారం తగ్గుతుంది. ఆహారాన్ని బాగా నమిలి మింగడం వల్ల అది పూర్తిగా జీర్ణమై దానిలోని పోషకాలన్నీ శరీరానికి సక్రమంగా అందుతాయి. మన లాలాజలంలో ఆహారాన్ని జీర్ణం చేసే ఎంజైములు ఉంటాయి. అవి ఆహారంతో కలవడం వల్ల అది తక్కువ సమయంలోనే జీర్ణమైపోతుంది.
ఒత్తిడి తగ్గుతుంది..
ఆహారాన్ని పూర్తిగా నమలడం ద్వారా ఎక్కువగా తిన్నట్లు ఫీలింగ్ వస్తుంది. తద్వారా, ఇది మానసిక ప్రశాంతతను చేకూర్చుతుంది. అంతేకాక, ఒత్తిడిని నియంత్రించడానికి ఇది సహాయపడుతుంది.
పళ్లకు మంచిది..
మనం ఆహారాన్ని ఎంత ఎక్కువగా నమిలితే మన దంతాలకూ మంచిదే. నమలడం వల్ల దవడలకు మంచి వ్యాయామం దొరుకుతుంది. ఆహారాన్ని నమిలేటప్పుడు వచ్చే లాలాజలం దంతాలకు హాని చేసే బ్యాక్టీరియాను నాశనం చేసి దంతక్షయాన్ని తగ్గిస్తుంది.
ఎన్నిసార్లు నమలాలి..?
మనం తీసుకొనే ఆహారాన్ని బట్టి ఎంతసేపు నమలాలనేది ఆధారపడి ఉంటుంది. పండ్లు, కూరగాయలు వంటి వాటిని ఐదు నుంచి పదిసార్లు నమిలితే చాలు. వీటికంటే.. గట్టిగా ఉండే పదార్థాలను ఇంకొంచెం ఎక్కువగా నమలాలి. నెమ్మదిగా.. ఆహారం పూర్తిగా ద్రవరూపంలోకి మారేంత వరకూ నమలాలి. దాన్ని పూర్తిగా మింగిన తర్వాతే ఆ తర్వాత ముద్ద తినడం ప్రారంభించాలి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply