Chia Seeds Water: ఈ గింజలు నీటిలో నానబెట్టి ఉదయం తాగితే.. బరువు తగ్గడమే కాదు, ఎముకలు బలంగా ఉంటాయ్..!

[ad_1]

యాంటీఆక్సిడెంట్లు మెండుగా..

యాంటీఆక్సిడెంట్లు మెండుగా..

చియా సీడ్స్‌లో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు చియా విత్తనాలలో ఉండే సున్నితమైన కొవ్వులు, రాన్సిడ్‌లు కాకుండా కాపాడతాయ. అంతేకాదు ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరానికి రక్షణ కల్పిస్తాయి. (image source – pixabay)​

Food Allergy: సాధారణంగా వచ్చే.. ఫుడ్‌ అలెర్జీలు ఇవే..!

జీర్ణక్రియకు మేలు జరుగుతుంది..

జీర్ణక్రియకు మేలు జరుగుతుంది..

చియా విత్తనాలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. చియా గింజలు నానబెట్టిన నీటిని ఉదయం ఖాళీ కడుపుతో తాగితే.. జీర్ణశక్తి పెరుగుతుంది, పేగు కదలికలను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన జీర్ణక్రియ చాలా అవసరం. ఫైబర్‌ మిమ్మల్ని ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. మీరు ఎక్కువగా తినకుండా నియంత్రిస్తుంది. (image source – pexels)

బరువు తగ్గుతారు..

బరువు తగ్గుతారు..

చియా గింజలు అధిక మొత్తంలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది చియా విత్తనాలను వాటి బరువు కంటే.. 10-12 రెట్లు నీళ్లు పీల్చుకునేలా చేస్తుంది. వాటికి జెల్‌ రూపం ఇస్తుంది. ఉదయం పూట ఖాళీ కడుపుతో నీటిలో నానబెట్టిన చియా సీడ్స్‌ తీసుకుంటే.. మీకు సంపూర్ణత్వ భావన పెరుగుతుంది, ఆహారాన్ని శోషించడాన్ని నెమ్మదిస్తుంది. తద్వారా మీరు తక్కువ కేలరీలు తినేలా చేస్తుంది. దీంతో మీరు త్వరగా బరువు తగ్గుతారు. (image source – pexels)

ఈ 6 విత్తనాలు తింటే.. సులభంగా బరువు తగ్గుతారు..!

ప్రొటీన్‌ అధికంగా ఉంటుంది..

ప్రొటీన్‌ అధికంగా ఉంటుంది..

చియా గింజలు 14% ప్రోటీన్‌తో తయారవుతాయి. వీటిలో అమైనో యాసిడ్ ప్రొఫైల్‌‌ కూడా అద్భుతంగా ఉంటుంది. బరువు తగ్గడానికి, కండరాల పెరుగుదల, రిపేర్‌కు ప్రొటీన్‌ అవసరం. ప్రోటీన్-రిచ్ ఫుడ్స్ తింటే.. మిమ్మల్ని సంతృప్తిగా ఉంచుతుంది, మీరు కేలరీలు తీసుకోండి తగ్గిస్తారు. (image source – pixabay)

గుండెకు మేలు చేస్తుంది..

గుండెకు మేలు చేస్తుంది..

చియా విత్తనాలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ – ఆల్ఫా-లినోలెనిక్‌ యాసిడ్‌ మెండుగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఉదయం పూట ఖాళీ కడుపుతో చియా గింజలు నానబెట్టిన నీటిని తాగితే.. గుండె జబ్బులు వచ్చే ముప్పు తగ్గుతుంది.​

Health Care: ఎప్పుడూ అలసటగా, నీరసంగా ఉంటుందా..? ఈ ఆహారాలకు దూరంగా ఉండండి..!

ఎముకలు స్ట్రాంగ్‌గా ఉంటాయ్..

ఎముకలు స్ట్రాంగ్‌గా ఉంటాయ్..

చియా గింజల్లో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చియా విత్తనాల్లో రోజువారీ సిఫార్సు చేసిన కాల్షియంలో 18% కలిగి ఉంటాయి. కాల్షియం మీ ఎముకలు, దండాలను స్ట్రాంగ్‌గా ఉంచుతుంది. (image source – pexels)

షుగర్‌ పేషెంట్స్‌కు మంచిది..

షుగర్‌ పేషెంట్స్‌కు మంచిది..

చియా విత్తనాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని, బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ను తగ్గిస్తాయి. చియా విత్తనాలు భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడంలో సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. షుగర్‌ పేషెంట్స్‌ వారి డైట్‌లో చియావిత్తనాలు చేర్చుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ​snoring causes: గురక ఎందుకు పెడతారో తెలుసా..?

ఇన్ఫ్లమేషన్‌ తగ్గిస్తుంది..

ఇన్ఫ్లమేషన్‌ తగ్గిస్తుంది..

మన శరీరంలోని అనారోగ్యాలకు అధిక స్థాయి ఇన్ఫ్లమేషన్‌ ప్రధాన కారణం. ప్రతిరోజూ 37 గ్రాముల చియా గింజలను తినడం వల్ల హెచ్‌ఎస్-సిఆర్‌పి వంటి ఇన్‌ఫ్లమేటరీ మార్కర్లను 40% తగ్గించవచ్చని ఓ అధ్యయనం స్పష్టం చేసింది. ఈ అధ్యయనంలో 20 మంది షుగర్‌ పేషెంట్స్‌కు 3 నెలల పాటు చియా సీడ్స్‌ ఇచ్చారు. రోజూ ఖాళీ కడుపుతో నీటిలో నానబెట్టిన చియా సీడ్స్‌ తీసుకంటే.. శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ను తగ్గించవచ్చు. (image source – pexels)

మార్నింగ్ డిటాక్స్ డ్రింక్

మార్నింగ్ డిటాక్స్ డ్రింక్

రాత్రంతా నీటిలో నానబెట్టిన ఒక చెంచా చియా గింజలను మీ ఉదయం పూట నిమ్మ, తేనె వాటర్‌లో మిక్స్‌ చేసుకుని తాగొచ్చు. ఈ డ్రింక్‌ శరీరం నుంచి విషాన్ని, వ్యర్థపదార్థాలను తొలగిస్తుంది. ఈ డ్రింక్‌ బెల్లీ ఫ్యాట్‌ను కరిగించడానికి సహాయపడుతుంది.

(image source – pexels)

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *