GDP: క్షీణించిన భారత GDP వృద్ధి రేటు.. Q3లో ఎంతకు పడిపోయిందంటే..

[ad_1]

 గతేడాదితో పోలిస్తే..

గతేడాదితో పోలిస్తే..

అక్టోబరు-డిసెంబరుతో ముగిసిన త్రైమాసికానికి గాను భారత స్థూల దేశీయోత్పత్తి(GDP) గణాంకాలను ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. గతేడాదితో ఇదే సమయంతో పోలిస్తే ప్రస్తుతం వృద్ధిరేటు మందగించినట్లు వెల్లడించింది. 2021-22 Q3లో 6.3 శాతంగా నమోదైన GDP వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4.4 శాతానికి కుచించుకుపోయినట్లు తెలిపింది. తద్వారా వరుసగా రెండో త్రైమాసికంలోనూ వృద్ధి క్షీణించనట్లు అయింది. దీనికి తోడు ద్రవ్యలోటు సైతం గణనీయంగా పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

వడ్డీరేట్ల పెంపే కారణమా..?

వడ్డీరేట్ల పెంపే కారణమా..?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) వరుసగా వడ్డీ రేట్లను పెంచడం వల్ల డిమాండ్ దెబ్బతిన్నట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. తయారీ రంగం బలహీన పడటంతో వృద్ధిరేటు బాగా మందగించినట్లు భావిస్తున్నారు. ఈ త్రైమాసికంలో మాన్యుఫ్యాక్చరింగ్ వృద్ధి 1.1 శాతం క్షీణించింది. అయితే ఇలా జరగడం కూడా ఇది వరుసగా రెండోసారి. దీన్ని బట్టి వినియోగదారుల నుంచి డిమాండ్ లో తగ్గుదలతో పాటు ఎగుమతులు బలహీనంగా ఉన్నట్లు అర్థమవుతోంది.

 ఈ ఏడాది వృద్ధి రేటు ఎంతంటే..

ఈ ఏడాది వృద్ధి రేటు ఎంతంటే..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధిరేటు 7.0 శాతం ఉంటుందని తన రెండవ ముందస్తు అంచనాల్లో భాగంగా ప్రభుత్వం పేర్కొంది. అయితే అంతకు ముందు ఏడాదిలో ఇది 8.7 శాతం ఉన్నట్లు మొదట ప్రకటించగా, 9.1 శాతానికి సవరించినట్లు తాజాగా వెల్లడించింది. కొవిడ్ అనంతరం ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కాగా డిమాండ్ ఒక్కసారిగా ఊపందుకోవడంతో.. అప్పుడు పెద్ద మొత్తంలో వృద్ధిరేటు నమోదు అయినట్లు తెలుస్తోంది.

RBI అంచనా ప్రకారమే వృద్ధి:

RBI అంచనా ప్రకారమే వృద్ధి:

2022-23 Q3లో వాస్తవ GDP రూ.40.19 లక్షల కోట్లుగా ఉందని కేంద్ర గణాంకాల శాఖ అంచనా వేసింది. గతేడాది ఇదే సమయానికి నమోదైన రూ.38.51 లక్షల కోట్లతో పోలిస్ తే4.4 శాతం వృద్ధి నమోదైనట్లు వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ నామమాత్రపు GDP 15.9 శాతానికి పెరుగుతుందని భావిస్తున్నట్లు చెప్పింది. అయితే ఈ నెల ప్రారంభంలో.. ద్రవ్య విధాన సమీక్షలో భాగంగా దేశీయ వృద్ధి రేటును 7 నుంచి 6.8 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. Q3లో 4.4శాతం, Q4లో 4.2 శాతం పెరుగుదల ఉంటుందని ఇప్పటికే ప్రకటించగా.. ఇప్పడు అదే నిజమైంది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *