[ad_1]
హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా..
ఇక తాజాగా బంగారం ధరల విషయానికి వస్తే నేడు కొద్దిగా క్షీణించినట్లుగా కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే నేడు బంగారం ధరలు పెరుగుదలను నమోదు చేయలేదు. ఈరోజు ఈ సమయానికి హైదరాబాద్ లో 22 క్యారెట్ల, 10 గ్రాముల బంగారం ధర 52,200 రూపాయలుగా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్ లో 56 వేల 950 రూపాయలుగా ఉంది. గత మూడు రోజుల నుంచి హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,200 వద్ద స్థిరంగా ఉంది అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 56,950 రూపాయల వద్ద స్థిరంగా ఉంది.
ఢిల్లీ లో బంగారం ధరలు పది రోజుల్లో ఎంతగా పెరిగాయంటే
ఇక దేశ రాజధాని ఢిల్లీలో నేడు బంగారం ధరలు విషయానికి వస్తే ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర 52,350 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,100 వద్ద ట్రేడ్ అవుతుంది. గత పది రోజుల్లో ఢిల్లీలో బంగారం ధర బాగా పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. జనవరి 9వ తేదీన ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 51,750 ఉంటే, నేడు 52,350 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. అంటే బంగారం ధర ఢిల్లీలో ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర విషయానికి వస్తే, జనవరి 9న 56,440 ట్రేడ్ కాగా ఈరోజు 57,100 వద్ద ట్రేడ్ అవుతుంది. ఈరోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ బంగారం ధరల పెరుగుదల మరింత నమోదు చేసే పరిస్థితి కనిపిస్తుంది.
ముంబైలో గత 10 రోజుల్లో బంగారం ధరల పెరుగుదల ఇలా
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో బంగారం ధరల విషయానికి వస్తే ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ముంబైలో 52,200గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నేడు 56,950 వద్ద కొనసాగుతుంది. గత పది రోజుల్లో ధరలు ఏ విధంగా పెరిగాయి అంటే.. జనవరి 9న ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 51 వేల 600 రూపాయలుగా ఉంది. నేడు 52,200గా ట్రేడ్ అవుతుంది. ఇక జనవరి 9న ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 56,290 రూపాయలుగా ట్రేడ్ అయ్యింది. ఇక నేడు 56,950గా ట్రేడ్ అవుతుంది.
బంగారం ధరల పెరుగుదలకు కారణాలివే
మొత్తంగా చూస్తే పెరిగిన బంగారం ధరలు సామాన్య, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేసే పరిస్థితి ఉండకపోవచ్చు అన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న భావన వ్యక్తం అవుతుంది. గ్లోబల్ మార్కెట్లో బుల్లిష్ ట్రెండ్ కారణంగా దేశీ మార్కెట్లో బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని భావిస్తున్నారు. అయితే నేడు స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు రేపు ఏ విధంగా మారుతాయి అన్నది కొనుగోలుదారులు ఆసక్తిగా చూస్తున్నారు.
[ad_2]
Source link
Leave a Reply