[ad_1]
తిన్న తర్వాత.. బ్రష్ చేయడం..
కొంతమందికి తిన్న వెంటనే బ్రష్ చేసే అలవాటు ఉంటుంది. ఏదైనా ఎసిడిక్ ఆహార పదార్థా తిన్న తర్వాత.. అరగంట పాటు బ్రష్ చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. నారింజ, ద్రాక్షపండ్లు, నిమ్మకాయ వంటి సిట్రిక్ యాసిడ్ ఉన్న పండ్లు.. పంటి ఎనామిల్‌ను బలహీనపరుస్తాయి. సిట్రస్ పండ్లు తిన్నతర్వాత.. బ్రష్ చేస్తే పళ్లపై ఎనామిల్ దెబ్బతింటాయి.
Diabetes control: ఈ మొక్క ఆకులతో.. షుగర్‌కు చెక్ పెట్టవచ్చు..!
వీకెండ్ రోజు ఎక్కువగా నిద్రపోతున్నారా..?
వారం అంతా పని చేసి అలసిపోయి… కొంతమంది వీక్‌ఎండ్స్‌లో ఎక్కువగా నిద్రపోతూ ఉంటారు. జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజీ & మెటబాలిజమ్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం వీక్‌ఎండ్‌లో అతిగా నిద్రపోవడం ఆరోగ్యానికి హాని చేస్తుంది. దీని కారణంగా.. అనేక వ్యాధుల ముప్పు పెరుగుతుంది. వీక్ ఎండ్‌లో నిద్రను పూడ్చుకునే బదులు, ప్రతి రోజు రాత్రి 7 నుంచి 8 గంటలు ప్రశాంతంగా నిద్రపోండి.
Anti inflammatory herbs: వేసవిలో ఇన్ఫ్లమేషన్ తగ్గించే మూలికలు ఇవే..!
భోజనం స్కిప్ చేస్తున్నారా..?
కొంతమంది బరువు తగ్గడానికి, క్యాలరీ ఇన్‌టెక్ తగ్గించుకోవడం కోసం మధ్యాహ్నం పూట భోజనం మానేస్తూ ఉంటారు. కాని ఈ అలవాటు మంచిది కాదు. ఒక పరిశోధన ప్రకారం, రోజంతా తరచుగా తినే వారి కంటే క్రమం తప్పకుండా భోజనం దాటవేసే వ్యక్తులు ఎక్కువ బరువు పెరుగుతారు. మధ్యాహ్న భోజనాన్ని స్కిప్ చేస్తే.. ఆకలి తర్వాత పెరుగుతుంది, దీని కారణంగా మీరు ఎక్కువగా తింటారు.
వ్యాయామం తర్వాత ప్రొటీన్ షేక్..
వ్యాయామం తర్వాత.. ప్రోటీన్ షేక్ తాగితే కండరాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, నొప్పిని తగ్గిస్తుంది. కానీ మీరు పని తర్వాత, రాత్రి పూట వ్యాయామం చేసి ప్రొటీన్ షేక్ తీసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. భోజనం, ప్రొటీన్ రెండూ మీ కడుపుకు హెవీగా ఉంటాయి. ఇది జీర్ణం కావడమూ చాలా కష్టంగా ఉంటుంది.
యాపిల్ తొక్క తీస్తున్నారా..?
చాలా మంది ఆపిల్‌పై తొక్క తీసి తింటూ ఉంటారు. కానీ ఆపిల్ చర్మంపై దాదాపు రెండింతలు ఫైబర్, 25% ఎక్కువ పొటాషియం, 40% ఎక్కువ విటమిన్ ఎ ఉంటాయి. యాపిల్‌లోని దాదాపు 100% క్వెర్సెటిన్ పై తొక్కలో ఉంటుంది. యాపిల్ తొక్కతో పాటు తినాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు.
Lemon Juice: నిమ్మరసం రోజూ తాగితే.. ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఈ అలవాట్లు మానుకోండి..
- చాలా మంది డైట్ సౌడా మంచిదని తాగుతూ ఉంటారు. డైట్ సోడా ఎక్కువగా తాగితే బరువు పెరిగే అవకాశం ఉంది.
- జిమ్‌లో ఎక్కువ వ్యాయామం చేయడం మంచిదని భావిస్తారు, కానీ ఇలా చేయడం వల్ల కండరాలు రిపేర్ చేయడానికి సమయం దొరకదు, ఇది నిద్రకు భంగం కలిగించవచ్చు.
- బాటిల్ వాటర్ తాగడం, బాటిల్‌లో బ్యాక్టీరియా, రసాయనాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధనలో తేలింది, బదులుగా ఫిల్టర్ చేసిన, శుద్ధి చేసిన పంపు నీటిని తాగండి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply