Herbs for Constipation : ఈ ట్యాబ్లెట్స్ వేసుకుంటే మలబద్ధకం దూరం..

[ad_1]

Herbs for Constipation : మలబద్ధకం రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. కొన్ని సార్లు హెల్దీ డైట్ ఫాలో అయ్యే వారికి కూడా ఈ సమస్య ఉంటుంది. ఆహారంతో పాటు, మద్యం తీసుకోవడం, జంక్ ఫుడ్, వర్కౌట్ చేయకపోవడం, పొగతాగడం అనేక కారణాలున్నాయి. మూలికా ఔషధాలు గ్యాస్ వంటి మస్యల్ని దూరం చేస్తాయి. ఇవే మాత్రల రూపంలో దొరుకుతాయి. వీటిని ఎలా తీసుకోవాలో చూద్దాం.

మూలికా మాత్రలు..

ఆయుర్వేద ఫార్మసీలలో మూలికా పదార్థాలు సమృద్ధిగా ఉన్న మాత్రలు అందుబాటులో ఉంటాయి. అవేంటో తెలుసుకోండి.

ఫెన్నెల్ సీడ్..

ఫెన్నెల్ సీడ్ పిల్ ప్రేగు కదలికను మెరుగ్గా చేస్తుంది. మలబద్దకాన్ని దూరం చేస్తుంది.

సనయ్..

ప్రేగుల పొరను చికాకు పెట్టే సెనోసైడ్స్‌లను తగ్గించడం ద్వారా సమస్యని దూరం చేస్తుంది.

Also Read : Diabetes control Drinks : ఈ 5 డ్రింక్స్‌ని పరగడపున తాగితే షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయట..

ఆవాలు..

వీటితో తయారైన మందు కూడా బాగా పని చేస్తుంది.

మలబద్ధకాన్ని దూరం చేసే టిప్స్..

ఈ టిప్స్‌తో మలబద్ధకం మాయం అవుతుంది..!

అజ్వైన్..

సమస్యని దూరం చేసేందుకు కూడా ఓమా చాలా బాగా పనిచేస్తుంది.

మలబద్దకాన్ని దూరం చేసే టీలు..

మూలికలతో టీ తయారు చేసుకుని తాగడం వల్ల మలబద్ధకం దూరమవుతుంది.

అల్లం టీ..

యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్న అల్లం టీ ప్రేగు కదలికను మెరుగ్గా చేస్తుంది.

పుదీనా టీ..

పుదీనాలోని మెంథాల్ జీర్ణ సమస్యల్ని, మలబద్ధకాన్ని దూరం చేస్తుంది.

herbal medicine

చమోమిలే టీ..

చమోమిలే అని కూడా పిలుస్తారు. దీనిని తాగడం వల్ల ప్రేగు కదలికల్ని మెరుగ్గా చేస్తుంది. మలబద్ధకాన్ని దూరం చేస్తుంది.

ప్రో బయోటిక్స్..

ప్రో బయోటిక్ పేగు గోడని బలపరుస్తుంది. ప్రేగుల్లోని హానికరమైన బ్యాక్టీరియాని చంపుతుంది.
మంచి, చెడు బ్యాక్టీరియా స్థాయిలను బ్యాలెన్స్ చేయడం ద్వారా మలబద్ధకాన్ని దూరం చేయొచ్చు.
నీటిలో నానబెట్టిన దాల్చిన చెక్క, జిన్సెంగ్ వంటి మూలికలు పేగు ఆరోగ్యాన్ని మెరుగపరిచే బ్యాక్టీరియాని ఉత్పత్తి చేస్తాయని తేలింది.
కాబట్టి, ప్లాంట్ బేస్డ్ ప్రో బయోటిక్స్ తీసుకోవడం మంచిది.

Also Read : వీటితో పళ్ళు తోమితే మరకలు మాయమై తెల్లగా మెరుస్తాయట..

మెగ్నీషియం..

మెగ్నీషియం సిట్రేట్‌ని సప్లిమెంట్‌గా తీసుకోవడం వల్ల మలబద్ధకాన్ని దూరం చేసుకోవచ్చు. మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని ప్రేగులు నీటిని పీల్చుకోవడానికి సాయపడతాయి. ఇది ప్రేగు కదలికల్ని ఈజీగా చేసి మలబద్దకాన్ని దూరం చేస్తుంది.
మెగ్నీషియం ఎక్కువగా ఉండే మూలికల్లో మెంతికూర, అల్లం, ఆవాలు, జాజికాయ, వాముని తీసుకుంటే మలబద్ధకం దూరమవుతుంది.

ఫైబర్..

ఫైబర్ అనేది సంక్లిష్ట కార్బోహైడ్రేట్‌కి ఓ రూపం. ఇది మానవ శరీరం ద్వారా సులభంగా జీర్ణం చేయదు. ఈ ఫైబర్ మలబద్ధకాన్ని దూరం చేసేందుకు హెల్ప్ చేస్తుంది.
ఫైబర్ ఎక్కువగా ఉండే మూలికలు, సప్లిమెంట్స్ సమస్యని దూరం చేస్తుంది.
సైలియంతో సహా ఫైబర్ సప్లిమెంట్స్ కూడా బాగా పనిచేస్తాయి.
కొన్ని ఫైబర్ మూలికలలో కొత్తిమీర, తులసి, థైమ్, రోజ్‌మెరీని ఎలా అయినా తీసుకుంటే సమస్య పరిష్కారమవుతుంది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
Read More : Home Remedies News and Telugu News

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *