[ad_1]
భారత మార్కెట్..
గత కొంత కాలంగా భారత స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకుల్లో కొనసాగుతున్నాయి. అయితే ఇలాంటి సందర్భంలో Mobius క్యాపిటల్ పార్ట్నర్స్కు చెందిన మార్కెట్ నిపుణుడు మార్క్ మోబియస్ మాత్రం భారత మార్కెట్లపై తన నమ్మకాన్ని కొనసాగిస్తున్నారు. గతంలో మాట్లాడుతూ అదానీ వ్యవహారాన్ని పక్కన పెడితే భారత మార్కెట్లలో తాము పెట్టుబడులను కొనసాగిస్తామని ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే.
దీర్ఘకాలంలో రాబడి..
చాలా మంది విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి ఇతర చౌక మార్కెట్లకు వెళ్లటం స్వల్పకాలిక చర్యగా భావిస్తున్నట్లు మోబియస్ తెలిపారు. దీర్ఘకాలంలో భారత స్టాక్ మార్కెట్లు మంచి పనితీరును కనబరుస్తాయని తాను గట్టిగా నమ్ముతున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత వృద్ధి రేటు ప్రపంచంలోని చాలా దేశాలకంటే మెరుగైన స్థితిలో ఉందని ఆయన తెలిపారు.
కలిసొచ్చే అంశాలు..
చాలా దేశాలు తమ కంపెనీ ఉత్పత్తిని చైనా నుంచి భారత్ కు తరలిస్తున్నందున దీర్ఘకాలంలో ఇండియా మంచి మార్కెట్ గా మారుతుందని మోబియస్ తెలిపారు. దీనిలో భాగంగా సాఫ్ట్ వేర్, తయారీ రంగాలకు మారుతున్న టెక్నాలజీ అతిపెద్ద మద్ధతును అందిస్తుందని మోబియస్ వెల్లడించారు. ఇతర మార్కెట్లతో పోల్చితే భారత ఈక్విటీలో ఎక్కువ సంపాదించటానికి మంచి అవకాశంగా తాను భావిస్తున్నానని ఆయన వెల్లడించారు.
టార్గెట్ రంగాలు ఇవే..
ప్రఖ్యాత ఇన్వెస్టర్ మోబియస్ ప్రధానంగా సాఫ్ట్ వేర్, హెల్త్ కేర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలపై తన దృష్టి ఉందని తెలిపారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలకు పైపులు, టర్బైన్ల వంటి భాగాలను సరఫరా చేసే కంపెనీల్లో బలమైన రాబడులు పొందేందుకు అవకాశం ఉందని అన్నారు. భారతదేశంలో ఆరోగ్యం పట్ల ప్రజలకు ఆసక్తి పెరుగుతున్నందున మెడికల్ టెస్టింగ్ స్టాక్‌లు బాగా పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
[ad_2]
Source link
Leave a Reply