[ad_1]
దంచికొట్టిన ఐపీవో..
డిసెంబర్ మాసంలో మార్కెట్లోకి వచ్చిన ఐపీవో సులా వైన్ యార్డ్స్ విపరీతమైన వృద్ధిని సాధిస్తోంది. పైగా డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ బలమైన వ్యాపార నవీకరణ తర్వాత ఇన్వెస్టర్లు కంపెనీ షేర్లను విపరీతంగా కొంటున్నారు. గడచిన 6 ట్రేడింగ్ సెషన్లలో స్టాక్ దాదాపుగా 32 శాతం లాభపడింది. దీంతో స్టాక్ తన 52 వారాల గరిష్ఠ స్థాయి అయిన రూ.432.40 ధరకు చేరుకుంది.
షేర్లెందుకు పెరుగుతున్నాయ్..?
లిక్కర్ స్టాక్ కిక్కిచ్చే పనితీరు వెనుక ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. ముందుగా డిసెంబరులో మార్కెట్లో అడుగుపెట్టి లిస్ట్ అయిన ఐపీవో బంపర్ విక్రయాలను నమోదు చేసింది. అక్టోబర్- డిసెంబర్ క్వార్టర్లో బ్రాండ్ అమ్మకాలు ఏకంగా 13% పెరిగాయి. దీనికి తోడు ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ ముకుల్ అగర్వాల్ డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీలో వాటాలను కొనుగోలు చేయటంతో స్టాక్ ధర మంచి బూమ్ ను నమోదు చేసింది.
డిసెంబర్ త్రైమాసికంలో..
ఈ ఏడాది డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో సులా వైన్ యార్డ్స్ రూ.187.2 కోట్ల విలువైన లిక్కర్ సేల్స్ నమోదు చేసింది. దీనికి ముందు ఏడాది ఇదే కాలంలో కంపెనీ విక్రయాలు రూ.165.7 కోట్లుగా ఉన్నాయి. FY23లోని తొమ్మిది నెలల కాలంలో బ్రాండ్ అమ్మకాలు దాదాపుగా 28% పెరిగాయి. అలాగే కంపెనీ వైన్ టూరిజం ఆదాయం 13% వృద్ధి చెంది రూ.23 కోట్లకు చేరుకుంది.
ప్రముఖ ఇన్వెస్టర్..
స్టాక్ మార్కెట్ ప్రముఖ ఇన్వెస్టర్ ముకుల్ అగర్వాల్ సులా వైన్ యార్డ్స్ కంపెనీ షేర్లను తన పోర్ట్ ఫోలియోలో చేర్చారు. ప్రస్తుతం ఆయన కంపెనీకి చెందిన 16 లక్షల షేర్లను కలిగి ఉన్నారు. ఇది కంపెనీ మెుత్తం షేర్లలో దాదాపుగా 1.9 శాతం ఈక్విటీకి సమానం.సోమవారం సాయంత్రం 3.20 గంటల సమయంలో స్టాక్ ధర ఎన్ఎస్ఈలో రూ.426 వద్ద ఉంది. ఈ క్రమంలో స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ.305.35గా ఉంది.
నీరసంగా లిస్టింగ్..
సులా వైన్ యార్డ్స్ స్టాక్ ఐపీవోగా డిసెంబర్ 12, 2022లో మార్కెట్లోకి వచ్చింది. అప్పట్లో ఐపీవో 12-14 డిసెంబర్ 2022 వరకు తెరచి ఉంది. కంపెనీ ఒక్కో షేరు ధరను రూ.340-357గా నిర్ణయిస్తూ ప్రైస్ బ్యాండ్ రిలీజ్ చేసింది. అలా కంపెనీ డిసెంబర్ 22న స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ అయ్యింది. ప్రారంభంలో ఈ లిక్కర్ స్టాక్ నీరసంగా తగ్గింపు ధరకు మార్కెట్లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం స్టాక్ పనితీరు కారణంగా కేవలం నెలరోజుల్లోనే ఇన్వెస్టర్లు ఒక్కో షేరుపై దాదాపు రూ.100 వరకు లాభాన్ని ఆర్జించారు.
[ad_2]
Source link
Leave a Reply