Osteoporosis: ఈ సమస్య ఉంటే ఎముకలు బలహీనపడతాయ్‌.. జాగ్రత్త..!

[ad_1]

Osteoporosis: ఆస్టియోపోరోసిస్ పెద్ద సమస్యగా మారుతోంది. మనదేశంలో సుమారు 5 కోట్ల మంది దీంతో బాధపడుతున్నారని అంచనా. మనదేశంలో ఆస్టియోపోరోసిస్‌ కారణంగా ఏటా సుమారు కోటి మంది ఎముకలు విరిగిపోయి బాధపడుతున్నారు. ఆస్టియోపోరోసిస్‌ అంటే.. ఎముకలు గుల్లబారటం. ఎముకల చేవ తగ్గిపోయి, దృఢత్వం కోల్పోయి.. బలహీనంగా అయిపోవటం. ఆస్టియోపోరోసిస్‌ వల్ల కణజాలం సాంద్రత తగ్గుతుంది. ఆస్టియోపోరోసిస్‌ పేషెంట్స్‌కు మామూలుగా కిందపడినా ఎముకలు విరిగిపోతుంటాయి. ఆస్టియోపొరోసిస్‌లో తరచూ తుంటి, మణికట్టు, వెన్నెముక వంటివి విరగటం చూస్తుంటాం. ఆస్టియోపోరోసిస్‌లో తొలిసారి ఎముక విరిగేంతవరకూ ఎలాంటి లక్షణాలూ కనిపించవు. ఆస్టియోపోరోసిస్‌ వల్ల నొప్పి, వైకల్యం, మంచానికే పరిమితం కావడం, కొన్ని సార్లు మరణమూ సంభవించవచ్చు.
నోయిడాలోని ఫోర్టిస్ హాస్పిటల్ ఆర్థోపెడిక్, జాయింట్ రీప్లేస్‌మెంట్ విభాగం, డైరెక్టర్ & HOD డాక్టర్ అతుల్ మిశ్రా ఆస్టియోపోరోసిస్‌ సమస్య గురించి, దాని కారణాలు, చికిత్స, లైఫ్‌స్టైల్‌ గురించి వివరించారు.
ఎముకల క్షీణత వ్యక్తి లైఫ్‌సైకిల్‌లో మామూలే.. కానీ సాధారణం కంటే.. క్షీణత వేగం ఎక్కువగా ఉంటే.. ఆస్టియోపోరోసిస్ సమస్య తలెత్తుతుందు. ఆస్టియోపోరోసిస్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి.

వయసు పెబడితే..

వయసుతో పాటు ఆస్టియోపోరోసిస్‌ ముప్పూ పెరుగుతూ వస్తుంది. ఎలాంటి వ్యాధులు లేకపోయినా.. 60 ఏళ్లు పైబడ్డ మహిళలకు, 70 ఏళ్లు పైబడ్డ పురుషులకు ఆస్టియోపోరోసిస్‌ వచ్చే అవకాశం ఎక్కువ. 65 ఏళ్లు దాటిన మహిళల్లో దాదాపు 85% మంది ఆస్టియోపోరోసిస్‌తో బాధపడుతున్నారని అంచనా. వృద్ధులు ఎముకల దృఢత్వాన్ని తరచూ పరీక్షించుకోవటం మంచిది.

వంశ చరిత్ర..

ఆస్టియోపోరోసిస్‌ వంశపారంపర్యంగానూ సంక్రమించే అవకాశం ఉంది. మీ కుటుంబంలో ఎవరికైనా ఎముకలు గుల్లబారటం, మెడ బాగా ముందుకు వంగిపోవటం, తుంటి విరగటం వంటి సమస్యలు ఉంటే.. మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇలాంటి వారికి ఆస్టియోపోరోసిస్‌ వచ్చే ప్రమాదం ఎక్కువ.

బరువు తక్కువగా ఉన్నా

శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి (బీఎంఐ) 19 కన్నా తక్కువగా ఉన్నట్టయితే ఆస్టియోపోరోసిస్‌ ముప్పు ఉన్నట్లే. నెలసరి నిలిచిపోయిన మహిళల్లో ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ స్థాయులు తగ్గుతాయి. ఇది ఆస్టియోపోరోసిస్‌కు దారితీస్తుంది. బలహీనంగా ఉన్నవారికి ఎముకలు విరిగిపోయే అవకాశమూ ఎక్కువే.

ఈ అలవాట్లు ఉంటే ప్రమాదం..

అల్కహాల్‌ ఎక్కవగా తాగినా, . సిగరెట్లు, బీడీలు, చుట్టల అలవాటు ఉన్నా ఆస్టియోపోరోసిస్‌ వచ్చే ప్రమాదం ఉంది.

ఈ సమస్యలు ఉంటే..

కీళ్లవాతం, ప్రొస్టేట్‌ క్యాన్సర్‌, బ్రెస్ట్‌ క్యాన్సర్‌, డయాబెటిస్‌, థైరాయిడ్‌ ,త్వరగా నెలసరి నిలిచిపోవటం, అండాశయాలు తొలగించాల్సి రావటం, హెచ్‌ఐవీ, పేగుల్లో పూత, సిలియాక్‌ డిసీజ్‌ వంటి జీర్ణకోశ సమస్యలు.. ఉంటే.. ఆస్టియోపోరోసిస్‌ ముప్పు ఎక్కువగా ఉంటుంది.

ఎముకలు బలహీనపడటం సడెన్‌గా వచ్చే సమస్యకాదు. ముందుగానే జాగ్రత్తలు పాటిస్తే.. ఆస్టియోపొరోసిస్‌ ముప్పును తగ్గించుకోవచ్చు. ఎముకలు బలంగా ఉండేలా చూసుకోవచ్చు. ఆ జాగ్రత్తలు ఏమిటో చూసేయండి.

పోషకాహారం తీసుకోండి..

ఎముకల ఆరోగ్యానికి క్యాల్షియం, విటమిన్‌ డి, ప్రొటీన్‌ చాలా అవసరం. పాలు.. పెరుగు, మజ్జిగ, పన్నీర్‌, ఛీజ్‌ వంటి డైరీ పదార్థాలు.. పాలకూర వంటి ఆకు కూరలు.. సాల్మన్‌, సారడైన్‌ వంటి చేపలను క్రమం తప్పకుండా తీసుకుంటే క్యాల్షియం ఎక్కువగా లభిస్తుంది. రోజూ కాసేపు ఒంటికి ఎండ తగిలేలా చూసుకుంటే విటమిన్‌ డిని పొందొచ్చు. మన శరీరం కాల్షియం గ్రహించుకోవడానికి, ప్రోటీన్‌ అవసరం, ఆహారంలో తగినంత ప్రొటీన్‌ ఉండేలా చూసుకోవటం మంచిది. పప్పులు, చేపలు, పీతలు, రొయ్యలు, మాంసం, చికెన్‌, పాల పదార్థాలలో ప్రొటీన్‌ ఎక్కవగా లభిస్తుంది. ఇవి మీ డైట్‌లో చేర్చుకోండి. రోజూ కాసేపు ఒంటికి ఎండ తగిలేలా చూసుకుంటే విటమిన్‌ డిని పొందొచ్చు.

వ్యాయామం చేయండి..

క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం ఎముకల ఆరోగ్యానికి మంచిది. బరువులు ఎత్తే, కండరాలను బలోపేతం చేసే, శరీర నియంత్రణకు తోడ్పడే వ్యాయామాలు ఎముకలకు మేలు చేస్తాయి. బరువు అదుపులో ఉంచుకోవటం మంచిది. ఆల్కహాల్ తాగడం తగ్గించాలి, స్మోకింగ్‌ అలవాటు ఉంటే మానేయండి.

ఎముక బలాన్ని టెస్ట్‌ చేయించుకోండి..

ఎముక సాంద్రతను తెలిపే పరీక్ష చేయించుకోవాలి. డ్యూయల్ ఎనర్జీ ఎక్స్-రే అబ్సార్ప్టియోమెట్రీ (DXA లేదా DEXA) స్కాన్ చేయించుకుంటే మంచిది. ఆస్టియోపొరోసిస్‌ ఉన్నట్టు నిర్ధారణ అయితే కనీసం 2-3 సంవత్సరాల పాటు చికిత్స తీసుకోవాలి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *