[ad_1]
Paytm FASTag: పేటీఎమ్‌కి మరో షాక్ తగిలింది. ఇకపై పేటీఎమ్ ద్వారా ఫాస్టాగ్‌లు జారీ చేయొద్దని IHMCL ఆదేశాలు జారీ చేసింది. పేటీఎమ్ నుంచి ఫాస్టాగ్‌ని తొలగించాలని తేల్చి చెప్పింది. ఇప్పటి వరకూ ఈ సర్వీస్‌లు అందించేందుకు పేటీఎమ్‌కి అవకాశమిచ్చిన సంస్థ ఇప్పుడు ఆ జాబితా నుంచి తొలగించింది. టాప్‌అప్స్,డిపాజిట్స్ స్వీకరించకూడదని ఆదేశించింది. IHMCL పరిధిలో మొత్తం 32 బ్యాంకులున్నాయి. వీటి ద్వారా ఫాస్టాగ్ జారీ చేసేందుకు అవకాశముంది. ఇప్పుడీ జాబితాలో పేటీఎమ్ కనిపించదు. ఈ 32 బ్యాంకులలో Allahabad Bank, Airtel Payments Bank, ICICI Bank, HDFC Bank, SBI తదితర బ్యాంకులున్నాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతానికి 8 కోట్ల మంది ఫాస్టాగ్ యూజర్స్ ఉన్నారని, అందులో Paytm Payments Bank (PPBL) మార్కెట్ షేర్ 30% మేర ఉందని NHAI అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఏడాది జనవరి 19వ తేదీనే పేటీఎమ్ కొత్తగా ఫాస్టాగ్‌లూ జారీ చేయొద్దని ఆంక్షలు విధించింది Indian Highways Management Company Ltd.
Travel hassle-free with FASTag! Buy your FASTag today from authorised banks. @NHAI_Official @MORTHIndia pic.twitter.com/Nh798YJ5Wz
— FASTagOfficial (@fastagofficial) February 14, 2024
మరిన్ని చూడండి
[ad_2]
Source link
Leave a Reply