[ad_1]
ప్రపంచ అగ్రగామిగా..
అంబానీలకు చెందిన రిలయన్స్ రిటైల్ ప్రపంచంలోనే అతిపెద్ద గార్మెంట్ సెల్లర్ గా మారనున్నట్లు తెలుస్తోంది. రానున్న రెండు సంవత్సరాల్లో కంపెనీ విక్రయాల విషయంలో ఈ మార్కును చేరుకోవాలని లక్ష్యంగా నిర్థేశించుకున్నట్లు తెలుస్తోంది. ఇషా అంబానీకి పగ్గాలు అప్పగించిన నాటి నుంచి రిలయన్స్ రిటైల్ వ్యాపారం సెరవేగంగా దూసుకుపోతోంది. కొత్త బ్రాండ్ల కొనుగోలు నుంచి విక్రయాల పెరుగుదల వరకు అనేక కొత్త రికార్డులను కంపెనీ సాధించింది.
ఫ్యాషన్ దిగ్గజంగా..
ప్రస్తుతం రిలయన్స్ రిటైల్ దేశవ్యాప్తంగా 4000 కంటే ఎక్కువ రిటైల్ స్టోర్లను కలిగి ఉంది. Trends, Centro, Azorte, Fashion Factory వంటి పేర్లతో రిలయన్స్ స్టోర్లను నిర్వహిస్తోంది. ఈ విభాగంలో దేశంలోనే అగ్రగామిగా కొనసాగుతోంది. రిటైలర్ 2020 సంవత్సరంలో ఏకంగా 430 మిలియన్ల దుస్తులను విక్రయించింది. ఈ సంఖ్య అమెరికా, కెనడాలోని మెుత్తం జనాభా దుస్తులు ధరించడానికి సరిపోతుంది. దేశంలో ప్రజల ఆదాయాలు పెరుగుతున్నందున ప్రీమియం సెగ్మెంట్లో వృద్ధి కొంచెం వేగంగా ఉంటుందని కంపెనీ అంచనా వేస్తోంది.
రెండేళ్లలో.. సీక్రెట్ టార్గెట్
రిలయన్స్ రిటైల్ రాబోయే రెండేళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద గార్మెంట్ సెల్లర్‌గా అవతరించనుందని, మందగమనం సంకేతాలు కనిపించటం లేదని టాప్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. భారత్ వంటి దేశంలో కస్టమర్ ఖర్చు పూర్తిగా సెంటిమెంట్‌పై ఆధారపడి ఉంటుందనే సూత్రాన్ని టార్గెట్ చేసుకుని కంపెనీ వ్యాపారంలో ముందుకు సాగేందుకు ప్రణాళికలు రచిస్తోంది. రిలయన్స్ రిటైల్ గత దశాబ్దంలో గ్రూప్ వార్షిక రేటుపై 17% వృద్ధిని సాధించింది. గడచిన ఆదేళ్ల కాలాన్ని పరిశీలిస్తే ఫ్యాషన్, జీవనశైలి ద్వారా వృద్ధి 43 శాతంగా ఉన్నట్లు గ్రూప్ వెల్లడించింది.
93 శాతం వృద్ధి అక్కడినుంచే..
ప్రస్తుతం భారతదేశంలో టైర్-2, టైర్-3 నగరాల్లో ఫ్యాషన్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ప్రాంతాల నుంచి 2022 ఆర్థిక సంవత్సరంలో 93% కంటే ఎక్కువ వృద్ధిని సాధించినట్లు పేర్కొంది. ఆన్లైన్ షాపింగ్ అనుభవం లేనివారు సాధారణంగా ఫ్యాషన్ సెగ్మెంట్ నుంచి కొనుగోలు చేయటం ప్రారంభిస్తారని తెలుస్తోంది. అనేక నగరాల్లో ఆర్థిక వ్యవస్థ విస్తరిస్తున్నందున కంపెనీకి ఇది చాలా వరకు కలిసొస్తున్న అంశంగా ఉంది.
[ad_2]
Source link
Leave a Reply