[ad_1]
Bank Privatisation: గత కొంత కాలంగా, కేంద్ర ప్రభుత్వం అనేక ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో భారీ మార్పులు తీసుకొచ్చింది. 2019 ఆగస్టులో, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 10 బ్యాంకుల్లో నాలుగింటిని ఏకీకృతం చేసింది. క్రమంగా, ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్యను 27 నుంచి 12కు తగ్గించింది.
జాబితా విడుదల చేసిన నీతి ఆయోగ్
బ్యాంకింగ్ రంగం ఒక వ్యూహాత్మక రంగంగా గుర్తింపు పొందింది. తాజాగా, కొన్ని బ్యాంకుల ప్రైవేటీకరణ మీద మరోసారి చర్చ జరుగుతోంది. బ్యాంకింగ్ సంస్థల ప్రైవేటీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం విస్తృతంగా సన్నాహాలు చేస్తోంది. రెండు బ్యాంకులు, ఒక సాధారణ బీమా కంపెనీని (General Insurance Company) ప్రైవేట్ పరం చేసే ఆలోచనలో ఉంది.
ఈ నేపథ్యంలో, నీతి ఆయోగ్ (NITI Aayog) నుంచి ఒక ప్రకటన వచ్చింది. బ్యాంకుల ప్రైవేటీకరణకు సంబంధించి ఒక జాబితాను నీతి ఆయోగ్ విడుదల చేసింది. భవిష్యత్‌లో కేంద్ర ప్రభుత్వం ఏ బ్యాంకులను ప్రైవేటీకరించవచ్చో వివరిస్తూ, ఆ లిస్ట్‌లో కొన్ని బ్యాంకుల పేర్లను ఆ సంస్థ సూచించింది. దీంతో పాటు, ప్రస్తుతం ఏ బ్యాంకులను ప్రైవేటీకరణ కోసం పరిగణనలోకి తీసుకోకూడదో కూడా చెప్పింది.
ఏయే బ్యాంకులను ప్రైవేటీకరించరు?
నీతి ఆయోగ్ విడుదల చేసిన జాబితా ప్రకారం… స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( State Bank of India – SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (Punjab National Bank – PNB), యూనియన్ బ్యాంక్ (Union Bank), కెనరా బ్యాంక్ (Canara Bank), బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda – BoB), ఇండియన్ బ్యాంక్ (Indian Bank) పేర్లను సూచించింది. కేంద్ర ప్రభుత్వం ఈ బ్యాంకుల ప్రైవేటీకరణ గురించి ఆలోచించకూడదు. కాబట్టి, ఈ బ్యాంకుల్లో ఖాతాదార్లకు ఎలాంటి ఇబ్బంది లేదు. లావాదేవీలు యథావిధిగా కొనసాగించవచ్చు.
News Reels
ఏయే బ్యాంకులను ప్రైవేటీకరింస్తారు?
పైన పేర్కొన్న బ్యాంకులను మినహాయించి, మిగిలిన అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించవచ్చు, కేంద్ర ప్రభుత్వం కూడా ప్రస్తుతం ఇదే ఆలోచిస్తోంది. ఏకీకృతం (కన్సాలిడేషన్) అయిన అన్ని బ్యాంకులను ఈ ప్రైవేటీకరణ జాబితా నుంచి దూరంగా ఉంచినట్లు నీతి ఆయోగ్ తన ప్రకటనలో వెల్లడించింది.
ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీని ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం యోచిస్తోందని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కూడా గతంలో ప్రకటించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో, పెట్టుబడుల ఉపసంహరణ (Disinvestment) ద్వారా మొత్తం రూ. 1.75 లక్షల కోట్లను సేకరించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
త్వరలోనే ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణ
ఐడీబీఐ బ్యాంకులో (IDBI Bank) కేంద్ర ప్రభుత్వానికి 45.48 శాతం వాటా ఉంది. అదే సమయంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌కు (LIC) 49.24 శాతం వాటా ఉంది. ఐడీబీఐ బ్యాంక్‌లో కొంత వాటాను కేంద్ర ప్రభుత్వం, ఎల్ఐసీ విక్రయించి, నిర్వహణ నియంత్రణను కూడా కొనుగోలుదారుకు అప్పగించనున్నారు. ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. త్వరలోనే ఈ బ్యాంక్ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లే ప్రక్రియ ముగియవచ్చు.
[ad_2]
Source link
Leave a Reply