Stock Market: 2023లో శుభ సోమవారం.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. ఎందుకింత మార్పంటే..

[ad_1]

మార్కెట్లను నడిపిస్తోంది..

మార్కెట్లను నడిపిస్తోంది..

అమెరికా ఆర్థిక వ్యవస్థలో ప్రతికూల పరిస్థితులు నెమ్మదిగా దారికి రావటం మెుదలైంది. అమెరికా డిసెంబర్ జాబ్ డేటా రావటంతో ఆందోళనలు తగ్గాయి. డిసెంబరులో వేతన వృద్ధి మందగించిందని, ద్రవ్యోల్బణం తగ్గుతోందని ఫెడరల్ రిజర్వ్ పేర్కొంది. కొందరు భయపడినంత దూకుడుగా పరిస్థితులు లేకపోవటం ఇన్వెస్టర్లలో జోష్ నింపింది. ఈ ప్రకటన తర్వాత ఆసియా మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

మార్కెట్ సూచీలు..

మార్కెట్ సూచీలు..

మధ్యాహ్నం 12.21 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 920 పాయింట్లు, నిఫ్టీ 260 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 470 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 254 పాయింట్ల మేర లాభాలతో కొనసాగుతున్నాయి. దాదాపుగా అన్ని రంగాలకు చెందిన సూచీలు సైతం మంచి లాభాల్లో కొనసాగుతున్నాయి. దీనికి తోడు ఈ వారం ఐటీ రంగంలోని కంపెనీలు తమ క్యూ3 ఫలితాలను విడుదల చేయనున్న తరుణంలో ఇన్వెస్టర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు.

టాప్ గెయినర్స్..

టాప్ గెయినర్స్..

ఈ సమయంలో ఎన్ఎస్ఈ సూచీలో మహీంద్రా అండ్ మహీంద్రా, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్ టెల్, విప్రో, టాటా మోటార్స్, రిలయన్స్, ఎస్బీఐ లైఫ్, హిందాల్కొ, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్, యూపీఎల్, ఓఎన్జీసీ, అదానీ పోర్ట్స్, సిప్లా కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి.

టాప్ లూజర్స్..

టాప్ లూజర్స్..

ఇక సూచీలో నష్టాల్లో కొనసాగుతున్న షేర్ల విషయాన్ని గమనిస్తే.. టైటాన్ కంపెనీ ముందు వరుసలో నిలిచింది. టైటాన్ విడుదల చేసిన ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోకపోవటంతో ఇన్వెస్టర్లు నిరాశకు గురయ్యారు. దీని తర్వాత హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఆటో, బ్రిటానియా, గ్రాసిమ్, బజాజ్ ఫిన్ సర్వ్ కంపెనీల షేర్లు మాత్రం నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా ఉన్నాయి.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *