[ad_1]
అందరి లాగే తాను కూడా చంద్రయాన్ 3 యొక్క విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఎంతో ఉత్సాహంగా, ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు సునీతా విలియమ్స్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్ సాధించిన పురోగతి పట్ల ఆమె ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలోనే చంద్రయాన్ 3 ప్రయత్నం ఇస్రో వేసిన ఒక గొప్ప అడుగు అని సునితా విలియమ్స్ అభివర్ణించారు. జాబిల్లిపై చేసే పరిశోధనలు కేవలం విజ్ఞానానికి మాత్రమే పరిమితం కాదని.. భూమి కాకుండా ఇతర గ్రహాలపై మనుషులకు స్థిరమైన నివాసాలను ఏర్పాటు చేసుకునేందుకు ఉన్న అవకాశాలను కనుగొనవచ్చని ఆమె తాజాగా ఇచ్చిన ఓ టీవీ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
చంద్రుడిపై విజయవంతంగా ల్యాండింగ్ అయితే అందరికీ అవసరమైన ఎంతో విలువైన సమాచారాన్ని అందిస్తుందని సునీతా విలియమ్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. అంతరిక్ష పరిశోధనలు, చంద్రుడిపై శాశ్వత నివాసాల కోసం అన్వేషణల విషయంలో భారత్ ముందంజలో ఉందని ఆమె తెలిపారు. అందుకు తనకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. జాబిల్లిపై దిగిన ల్యాండర్, రోవర్ శాస్త్రీయ పరిశోధనల ఫలితాల విషయంలో.. తాను ఎంతో ఆతృతగా ఉన్నట్లు చెప్పారు. చంద్రుడిపై చేసే పరిశోధనలు, అన్వేషణలకు సంబంధించి ఈ చంద్రయాన్ 3 విజయం ఒక గొప్ప మైలురాయి కానుందని సునీతా విలియమ్స్ వివరించారు.
చంద్రయాన్ 3 సామర్థ్యం గురించి తెలిపిన సునీతా విలియమ్స్ ఇది చంద్రుడి దక్షిణ ధ్రువంపై స్థిరమైన మానవ నివాసాలను ఏర్పాటు చేసేందుకు అనుకూలించే ప్రదేశాలను గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. మరోవైపు.. అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారత సంతతికి చెందిన మహిళగా సునీతా విలియమ్స్ ఖ్యాతి గడించారు. సునీతా విలియమ్స్ కంటే ముందు కల్పనా చావ్లా నింగిలోకి వెళ్లిన భారత సంతతికి చెందిన మొదటి మహిళగా రికార్డుల కెక్కారు. మరోవైపు.. చంద్రుడిపై ప్రయోగాలు, పరిశోధనలు చేసేందుకు ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 బుధవారం సాయంత్రం 6.04 గంటలకు జాబిల్లిపై కాలు పెట్టనుంది. ఇంతటి అపురూప ఘట్టాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఇస్రో అన్ని రకాల ఏర్పాట్లు చేసింది.
Read More Latest Science & Technology News And Telugu News
[ad_2]
Source link
Leave a Reply