[ad_1]
మహిళల కోసం..
దేశంలోని మహిళల సేవింగ్స్ పెంచేందుకు మహిళా సమ్మాన్ పత్రను తీసుకొస్తున్నట్లు తెలిపారు. దీనిపై వడ్డీ రేట్లు అత్యధికంగా 7.5 శాతం అందిస్తున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. దీనికి తోడు దేశంలో 50 టూరిజం ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఏటా రూ.10 వేల కోట్లను వెచ్చించనున్నట్లు వెల్లడించారు. ఎనర్జీ ట్రాన్సిషన్ కోసం రూ.35,000 కోట్లు, బ్యాటరీ నిల్వ కోసం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌లు పునరుత్పాదక ఇంధన సామర్థ్యం జోడింపులను నిర్మలమ్మ ప్రకటించారు.
సీనియర్ సిటిజన్లకు..
కేంద్ర బడ్జెట్లో నిర్మలా సీతారామన్ సీనియన్ సిటిజన్లకు పెద్ద ఊరట ప్రకటించారు. దీని ప్రకారం డిపాజిట్ గరిష్ఠ పరిమితిని రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచారు. ఇదే క్రమంలో ఆర్థిక లోటు గురించి ప్రస్థావించారు. 2024 ఆర్థిక సంత్సరానికి డీజీపీలో ఆర్థిక లోటు 5.9 శాతంగా ఉంటుందని నిర్మలమ్మ వెల్లడించారు. దీనికి తోడు 2025-26 నాటికి ద్రవ్య లోటు లక్ష్యం 6.5% కంటే తక్కువదా ఉండనున్నట్లు తన ప్రసంగంలో వెల్లడించారు.
కీలక ప్రకటనలు..
– FY24 స్థూల రుణ లక్ష్యం రూ.15.43 లక్షల కోట్లు
– FY24 కోసం ద్రవ్య లోటు లక్ష్యం 5.9%
– FY23 కోసం ద్రవ్య లోటు GDPలో 6.4%గా అంచనా వేయబడింది
– FY26 కోసం ద్రవ్య లోటు గ్లైడ్ పాత్ 4.5%
– ‘మేక్ ఇన్ ఇండియా’కు పెద్ద పుష్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది లిథియమ్ అయాన్ బ్యాటరీ, మొబైల్, టీవీ, చిమ్నీ తయారీకి అనుకూల రాయితీలను నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
[ad_2]
Source link
Leave a Reply