[ad_1]
5 గంటలు
ఇంతకుముందు బిలాస్‌పూర్ నుంచి నాగ్‌పూర్ కు వెళ్లడానికి 7 గంటలు సమయం పట్టేది. వందే భారత్ రైలుతో కేవలం ఐదున్నర గంటల్లో బిలాస్ పూర్ నుంచి నాగ్ పూర్ కు వెళ్లొచ్చు. ఈ రైలు బిలాస్‌పూర్ నుంచి ఉదయం 6.45 గంటలకు బయలుదేరి 12.15 గంటలకు నాగ్‌పూర్ చేరుకుంటుంది. మధ్యాహ్నం 2 గంటలకు నాగ్‌పూర్‌లో బయలుదేరి రాత్రి 7.35 గంటలకు బిలాస్‌పూర్ చేరుకుంటుంది.
160 కిలోమీటర్ల వేగం
తూర్పు-మధ్య రైల్వే బిలాస్‌పూర్-నాగ్‌పూర్ మధ్య నడిచే వందే భారత్ రైలును నడుపుతుంది. ఈ రైలు రాయ్పూర్, దుర్గ్, గోండియా స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలు గంటకు గరిష్టంగా 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఇప్పటి వరకు దేశంలో మొత్తం ఐదు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. అవి ఢిల్లీ-వారణాసి, ఢిల్లీ-శ్రీ వైష్ణో దేవి మాత కత్రా, గాంధీనగర్ నుంచి ముంబై, న్యూఢిల్లీ నుంచి అందౌరా స్టేషన్, చెన్నై-మైసూరు మధ్య వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి.
WiFi
ఈ రైళ్లలో అన్ని కోచ్‌లకు ఆటోమేటిక్ డోర్లు ఉంటాయి. GPS సిస్టమ్, WiFi ఉన్నాయి. అదే సమయంలో, రైలులోని ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో, ప్రయాణికుల కోసం 360-డిగ్రీల తిరిగే కుర్చీలు ఉన్నాయి. త్వరలో మరిన్ని వందే భారత్ రైళ్లు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం తెలిపింది.
త్వరలో అందుబాటులోకి రానున్న 6వ వందే భారత్ ట్రైన్
డిసెంబర్ 11 నుంచి అందుబాటులోకి రానున్న ట్రైన్
ప్రారంభించనున్న ప్రధాన మంత్రి మోడీ
బిలాస్‌పూర్ నుంచి నాగ్‌పూర్ మధ్య నడవనున్న రైలు
టోమేటిక్ డోర్లతో పాటు GPS సిస్టమ్, WiFi సౌకర్యం
[ad_2]
Source link
Leave a Reply