ఆంధ్రప్రదేశ్లో కోర్టు కేసుల కారణంగా 23 పట్టణ స్థానిక సంస్థలకు (అర్బన్ బాడీలు) ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) వెల్లడించింది.
ఈ సంస్థలకు సంబంధించిన న్యాయపరమైన వివాదాలు పరిష్కారమైన తర్వాతే కొత్త ఎన్నికల తేదీలను ప్రకటిస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
ఎన్నికలు వాయిదా పడిన స్థానిక సంస్థలు
కార్పొరేషన్లు (4):
- శ్రీకాకుళం
- రాజమండ్రి
- కాకినాడ
- మంగళగిరి-తాడేపల్లి
మున్సిపాలిటీలు (15):
- ఆముదాలవలస
- రాజాం
- పాలకొల్లు
- భీమవరం
- తాడేపల్లిగూడెం
- తణుకు
- గుడివాడ
- తాడిగడప
- పొన్నూరు
- నరసరావుపేట
- బాపట్ల
- కందుకూరు
- కావలి
- గూడూరు
- శ్రీకాళహస్తి
నగర పంచాయతీలు (4):
- బి.కొత్తకోట
- అల్లూరు
- పొదిలి
- చింతలపూడి