అనిల్ అగర్వాల్ ప్లాన్‌కు కేంద్రం నుంచి ఎదురుదెబ్బ.. రుణాలు తగ్గించుకునే ప్లాన్ ఫెయిలేనా..?

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|

Vedanta: బిలియనీర్ పారిశ్రామికవేత్త అనిల్ అగర్వాల్ తన రుణాల భారాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించారు. దీనికోసం జింక్ తయారీ యూనిట్ అమ్మాలని తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. ఈ విక్రయం జరగకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేంద్రం తెలిపింది.

2.98 బిలియన్ డాలర్ల ప్రణాళికను హిందుస్థాన్ జింక్ కంపెనీలో కేంద్రం నియమించిన నామినేటెడ్ డైరెక్టర్ వ్యతిరేకించారు. అయితే దీనిని నిర్వహించటానికి కంపెనీస్ యాక్ట్ ప్రకారం ముందుగా కంపెనీ షేర్ హోల్డర్లతో జనరల్ మీటింగ్ నిర్వహించి వారి అనుమతి మేరకు ముందుకు వెళ్లాల్సి ఉంటుందని మైనింగ్ శాఖకు చెందిన అధికారులు చెబుతున్నారు.

అనిల్ అగర్వాల్ ప్లాన్‌కు కేంద్రం నుంచి ఎదురుదెబ్బ.. రుణాలు త

అయితే కంపెనీ ఇతర నగదు రహిత మార్గాలను చూడాలని కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం హిందుస్థాన్ జింక్ కంపెనీలో కేంద్ర ప్రభుత్వానికి 29.5 శాతం వాటా ఉంది. వేదాంత కంపెనీ 64.9 శాతం వాటాను కలిగి ఉంది. హిందుస్థాన్ జింక్ కంపెనీలో తన వాటాలను ప్రణాళికాబద్ధంగా విక్రయించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వేదాంత వాటాల విక్రయ ఒప్పందం అడ్డంకిగా మారనుంది. కేంద్రం నిర్ధేశించుకున్న ఉపసంహరణ లక్ష్యాన్ని చేరుకునే సామర్థాన్ని ప్రభావితం చేస్తుందని తెలుస్తోంది.

English summary

Vedanta’s Anil agrwal plan gets rejection from central Government

Vedanta’s Anil agrwal plan gets rejection from central Government

Story first published: Monday, February 20, 2023, 17:40 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *