చిటికెడు ఇంగువతో.. ఎన్ని లాభాలో తెలుసా..?

[ad_1]

Asafetida Health Benefits: మనం వంటలలో వాడే సుగంధ ద్రవ్యాలలో ఇంగువ ఒకటి. పులిహోర, చారు, రోటీ పచ్చళ్లు, కూరల తాలింపులో.. చిటికెడు ఇంగువ వేస్తే దాని టేస్ట్‌ రెట్టింపు అవుతుంది. అందుకే.. ప్రతి ఒక్కరి వంటింట్లో ఇంగువ ఉండాల్సిందే. ఇంగువ వంట టేస్ట్‌ పెంచడానికే కాదు, మన ఆరోగ్యాన్ని రక్షించడానికీ ఇది సహాయపడుతుంది. సాంప్రదాయ వైద్యంలోనూ దీనికి ప్రత్యేక స్థానం ఉంది. స్వచ్చమైన ఇంగువను యునాని, సిధా, ఆయుర్వేద మెడిసిన్ తయారీలోనూ ఉపయోగిస్తారు. దీనిలో కార్మినేటివ్, యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇంగువలో ఫైబర్‌, ప్రొటీన్స్ , కాల్షియం, ఫాస్పరస్, ఐరన్‌, కెరటిన్, బి – విటమిన్, వంటి పోషకాలూ ఉంటాయి. ఇంగువను మన తరచుగా వంటల్లో వాడితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.

జీర్ణక్రియకు మంచిది..

ఇంగువ తరచుగా తీసుకుంటే.. జీర్ణవ్యవస్థకు మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంగువ జీర్ణ రసాలు ఉత్పత్తి అవడానికి తోడ్పడుతుంది. ఎంజైమ్‌ల చర్యను ప్రభావితం చేస్తుంది. ఇంగువ తీసుకుంటే.. అజీర్తి, కడుపులో మంట, ఉబ్బరం, IBS, పేగులో పురుగులు, అపానవాయువు వంటి కడుపు సమస్యలు దూరం అవుతాయి. ఆకలి లేకపోవడం లాంటి సమస్యలతోపాటు జీర్ణ సంబంధ వ్యాధులను తగ్గిస్తుంది. ఇంగువలో యాంటీ-స్పాస్మోడిక్‌, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. గ్లాసు మజ్జిగలో దీన్ని వేసుకుని తాగితే జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.

ఆస్తమా నుంచి రిలీఫ్‌ లభిస్తుంది..

ఇంగువలో యాంటీ వైరల్, యాంటీబయాటిక్ లక్షణాలు మెండుగా ఉంటాయి. ఇవి ఆస్తమా, బ్రోన్కైటిస్, పొడి దగ్గు వంటి సమస్యలను నివారిస్తాయి. జలుబు, దగ్గు వంటి సమస్యలను ఇంగువ దూరం చేస్తుంది. ఈ సీజన్‌లో వచ్చే ఫ్లూను ఎదుర్కోవడానికి ఇంగువ నీరు బాగా పనికొస్తుంది. ఇంగువ తీసుకుంటే.. ఛాతీ రద్దీని తగ్గుతుంది, కఫం కరుగుతుంది. చిటికెడు ఇంగువ వేసిన నీరు తాగితే.. శ్వాసకోశ సమస్యలు దూరం అవుతాయి.

బీపీ తగ్గిస్తుంది..

ఇంగువ న్యాచురల్‌ బ్లడ్‌ థిన్నర్‌లా పని చేస్తుంది. హైపర్‌టెన్షన్‌ను తగ్గించడంలో.. ఇంగువ సహాయపడుతుంది. ఇంగువలో కమారిన్‌ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. తద్వారా రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది.

నెలసరి నొప్పుల నుంచి రిలీఫ్‌ ఇస్తుంది..

నెలసరి సమయంలో కడుపు నొప్పి, నడుము నొప్పి, తిమ్మిరిని తగ్గించడానికి ఇంగువ ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది. ఇది న్యాచురల్‌ బ్లడ్‌ థిన్నర్‌ కాబట్టి.. శరీరంలోని అన్ని భాగాలకు రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా సహాయపడుతుంది. ఇది ప్రొజెస్టెరాన్ స్రావాన్ని మెరుగుపరుస్తుంది. దీంతో నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. పీరియడ్స్‌ టైమ్‌లో నొప్పితో బాధపడుతుంటే.. కప్పు మజ్జిగలో చిటికెడు ఇంగువ, మెంతుల పొడి, చిటికెడు ఉప్పు వేసుకుని తాగండి.

చర్మ సమస్యలు దూరం..

చర్మంపై దురదలు, దద్దుర్లు, అలర్జీ వంటివి ఉంటే… ఇంగువ పొడిని కూరల్లో తప్పక వాడాలి. లేదంటే… ఇంగువ పొడిని కొబ్బరి నూనెలో కలిపి దురద ఉన్న చోట రాసుకుంటే మంచి రిజల్ట్స్‌ ఉంటాయి. ప్రతిరోజు ఇంగువ నీటిని తాగితే చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. ఇంగువలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ వల్ల జరిగే నష్టం నుంచి శరీరాన్ని రక్షిస్తాయి.

తలనొప్పి తగ్గుతుంది..

ఇంగువలోని బలమైన యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు తలలోని రక్తనాళాలను సడలించడానికి సహాయపడతాయి. అంతేకాకుండా, ఇంగువ యాంటిడిప్రెసెంట్‌గా పనిచేస్తుంది. ఒత్తిడి కారణంగా వచ్చే తలనొప్పి, మైగ్రెన్‌ తలనొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది.

కొలెస్ట్రాల్‌ కరుగుతుంది..

ఇంగువ శరీర జీవక్రియను మెరుగుపరచి.. కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గిస్తుంది. ఇది రక్త నాళాల వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. అథెరోస్క్లెరోసిస్ అభివృద్ధికి, రక్త నాళాలలో కొలెస్ట్రాల్ పేరుకోవడానికి.. రక్త నాళాల వాపు ప్రధాన కారణం.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *