నిద్రపోయే ముందు ఈ అలవాట్లు ఉంటే.. గుండెపోటు వస్తుంది జాగ్రత్త..!

[ad_1]

Things To Avoid Before Sleep: మనిషికి.. తిండి, నీరు ఎంత అవసరమో నిద్ర కూడా అంతే ముఖ్యం. రాత్రి ప్రశాంతమైన నిద్ర.. మీరు రోజంతా యాక్టివ్‌గా, రీఫ్రెష్‌గా, ఏకాగ్రతతో, ఒత్తిడి లేకుండా.. ఉంచడంలో సహాయపడుతుంది. వీటితో పాటు.. ఇమ్యూనిటీ బూస్ట్‌ అవుతుంది, గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. సరిపడా నిద్ర.. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. రాత్రిపూట పడుకునే ముందు కొన్ని అలవాట్ల కారణంగా.. నిద్ర డిస్టర్బ్‌ అవుతుంది. దీర్ఘకాలం నిద్రసరిగ్గా లేకపోతే.. హైబీపీ, టైప్‌–2 డయాబెటిస్, గుండెజబ్బులు, గుండెపోటు పక్షవాతం, మూర్ఛ వంటి తీవ్ర సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. రాత్రి పూట నిద్రపోయే ముందు చేయకూడని పనులు ఏమిటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.

ఫొన్‌ వాడొద్దు..

స్లీప్ ఫౌండేషన్ ప్రకారం, నిద్రపోయే ముందు ఫోన్‌ వాడితే.. క్వాలిటీ స్లీప్‌ను ఎఫెక్ట్‌ చేస్తుంది. మన శరీరంలో సహజంగానే.. స్లీప్‌ – వేక్‌ సైకిల్‌ ఉంటుంది. ఉదయం పూట మన శరీరంలో కార్టిసాల్ హార్మోన్ ఏర్పడుతుంది, ఇది మనల్ని నిద్రలేపుతుంది. రాత్రిపూట, మన శరీరంలో మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇది శరీరం నిద్రపోయేలా చేస్తుంది. మీరు నిద్రపోయే ముందు ఫోన్‌ని ఉపయోగిస్తే, ఎలక్ట్రానిక్స్‌లో కనిపించే ఫ్లోరోసెంట్, LED నుంచి వెలువడే.. బ్లూ లైట్‌ ఈ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తాయి. దీంతో మీ నిద్రకు భంగం కలుగుతుంది. రాత్రి మీరు పడుకునే సమయం కంటే ఓ అరగంట ముందు స్మార్ట్‌ ఫోన్‌ను పూర్తిగా పక్కన పెట్టేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఎక్సర్‌సైజ్‌ చేయవద్దు..

మనం ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చాలా ముఖ్యం. కానీ అది చేసే సమయం మీ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. రాత్రిపూట వ్యాయామం చేయడం వల్ల.. నిద్రకు ఆటంకం కలుగుతుందని నిపుణులు అంటున్నారు. రాత్రిపూట ఎక్కువ వ్యాయామం చేయడం వల్ల, శరీరంలో ఒత్తిడి హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. రక్తప్రవాహం ఎక్కువ అవుతుంది. ఇవి నిద్రను డిస్టర్బ్‌ చేస్తాయి. అంతే కాదు మరుసటి రోజు మీరు మరింత అలసిపోయేలా చేస్తుంది.

పని చేయవద్దు..

అతిగా పని చేయడం మీ ఆరోగ్యానికి హానికరం. వారానికి 55 గంటలకు పైగా పని చేయడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్‌, అకాల మరణాల ప్రమాదం ఎక్కువగా ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. కొంతమంది రాత్రిపూట.. నిద్రపోయే ముందు ఆఫీస్‌ పని చేస్తూ ఉంటారు. ఇది వారి నిద్రను డిస్టర్బ్‌ చేస్తుంది. రాత్రి భోజనం తర్వాత మీ ఆఫీస్‌ వర్క్‌ చేయకండి, విశ్రాంతి తీసుకోండి.

టీ/కాఫీ తాగొద్దు..

కొంతమందికి నిద్రపోయే ముందు, రాత్రిపూట.. టీ/కాఫీ తాగే అలవాటు ఉంటుంది. టీ, కాఫీలలో కెఫీన్ ఉంటుంది. ఇది మెదడును యాక్టివ్‌గా ఉంచుతుంది. నిద్రపోయే ముందు కెఫిన్‌ ఉండే పదార్థాలు తీసుకుంటే.. రాత్రంతా మేల్కోవలసి ఉంటుంది. కెఫీన్ మీ బాడీ న్యాచురల్‌ క్లాక్‌కు అంతరాయం కలిగిస్తుందని ఓ అధ్యయనం స్పష్టం చేసింది. ఇది నిద్రలేమికి దారి తీస్తుంది.

హెవీగా తినొద్దు..

రాత్రి పూట హెవీగా తిన్నా.. నిద్రకు ఆటంకం కలుగుతుంది. కేలరీలు ఎక్కువగా ఉండే ఆహారం ఎక్కువగా తింటే.. జీర్ణక్రియ ఆలస్యం అవుతుంది, మీ శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. శరీర ఉష్ణోగ్రతలో ఈ పెరుగుదల నిద్రను దెబ్బతీస్తుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *