రూ.13 వేల కోట్లు కనిపిస్తున్నా తీసుకునే మనిషే లేడు, మీరు ట్రై చేస్తారా?

[ad_1]

Unclaimed Deposits in Jan Dhan accounts: దేశంలోని ప్రతి వ్యక్తిని ఆర్థిక వ్యవస్థలో భాగం చేయడంతో పాటు, ప్రతి అర్హుడికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందించడానికి భారత ప్రభుత్వం జన్ ధన్ యోజన (Jan Dhan Yojana) ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రారంభించిన బ్యాంక్‌ ఖాతాలు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ స్కీమ్ (Direct Benefit Transfer Scheme) విజయవంతంలో కీలక పాత్ర పోషించాయి.

మూతబడిన ఖాతాల్లో రూ.12,779 కోట్లు
ప్రస్తుతం, భారతదేశంలో 51 కోట్లకు పైగా జన్ ధన్ ఖాతాలు (Jan Dhan accounts in India) ఉన్నట్లు భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే… వీటిలో దాదాపు 20 శాతం అకౌంట్లు/10 కోట్లకు పైగా ఖాతాలు మూతబడ్డాయి. ఇవి మూతబడింది డబ్బు లేక మాత్రం కాదు. ఈ 10 కోట్ల ఖాతాల్లో రూ.12,779 కోట్లు పడి ఉన్నాయి. ఈ మొత్తాన్ని ఎవరూ క్లెయిమ్ చేయడం లేదు (Unclaimed Deposits in bank accounts). అంటే, ఆ డబ్బు మాదేనని ఎవరూ ముందుకు రావడం లేదు.

పని చేయని 4.93 కోట్ల మహిళల ఖాతాలు
దేశంలో దాదాపు 51.11 కోట్ల పీఎం జన్‌ధన్ ఖాతాలు ఉన్నాయని, పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో (Winter Sessions of Parliament‌), ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ రాజ్యసభకు వెల్లడించారు. వీటిలో 4.93 కోట్ల ఖాతాలు మహిళల పేరిట ఉన్నాయి. బ్యాంకుల నుంచి అందిన సమాచారం ప్రకారం, 2023 డిసెంబర్ 6వ తేదీ వరకు, వివిధ బ్యాంకుల్లో మొత్తం 10.34 కోట్ల ఖాతాలు నిష్క్రియంగా మారాయని చెప్పారు.

రూ.12,779 కోట్లు ఇప్పటికీ క్రియారహిత జన్ ధన్ ఖాతాల్లోనే ‍‌(Inactive Jan Dhan accounts) ఉన్నాయి. ఈ ఖాతాల్లో ఉన్న మొత్తం డిపాజిట్స్‌లో ఇది దాదాపు 6.12 శాతానికి సమానం. క్లోజ్డ్ అకౌంట్లలోని డబ్బుపై ఎప్పటికప్పుడు వడ్డీ కూడా జమ అవుతోంది. ఇలాంటి ఖాతాల సంఖ్యను తగ్గించేందుకు బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయని, భారత ప్రభుత్వం కూడా పర్యవేక్షిస్తోందని భగవత్ కరాద్ చెప్పారు.

మొత్తం లబ్ధిదారుల్లో 55.5 శాతం మంది మహిళలు
జన్ ధన్ ఖాతాల్లో 55.5 శాతం మహిళలవేనని ఆర్థిక మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ట్వీట్‌ చేసింది. 2023 నవంబర్ 22 వరకు, ఈ ఖాతాల్లో రూ.2.10 లక్షల కోట్లు జమ అయ్యాయి. 4.30 కోట్ల ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా లేదు. జన్ ధన్ ఖాతాల్లో కనీస మొత్తం ఉంచాల్సిన అవసరం లేదు.

ఇన్‌ యాక్టివ్ ఖాతాల్లో రూ.42 వేల కోట్లు
2023 మార్చి నాటికి, ఇన్‌యాక్టివ్‌గా ఉన్న బ్యాంక్‌ ఖాతాల్లో దాదాపు రూ.42,270 కోట్లు పడి ఉన్నాయని కరాద్ గతంలో పార్లమెంటుకు తెలిపారు. క్రితం ఏడాది ఈ సంఖ్య రూ.32,934 కోట్లుగా ఉంది. ఈ ఖాతాల యజమానులను గుర్తించేందుకు ఆర్‌బీఐ చాలా చర్యలు చేపట్టిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి వెల్లడించారు. 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు పని చేయని ఖాతాల్లోని మొత్తం డబ్బు ‘డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్‌’లో జమ చేస్తారు.

RBI రిపోర్ట్‌ ప్రకారం… తమిళనాడు, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, బెంగాల్, కర్ణాటక, బిహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని బ్యాంకుల్లో ఇలాంటి అన్‌క్లెయిమ్డ్‌ మనీ ఎక్కువగా డిపాజిట్ అయింది.

మరో ఆసక్తికర కథనం: మీ క్రెడిట్‌ స్కోర్‌ చాలా తక్కువగా ఉన్నా క్రెడిట్‌ కార్డ్‌ పొందే దారుంది!

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *