సీఈవోల తయారీ ఫ్యాక్టరీగా మారుతున్న Infosys.. స్పెషల్ స్టోరీ..!

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|

Infosys: ప్రతి కంపెనీని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు నాయకత్వ పాత్రలో ఉండేవారు కీలక పాత్ర పోషిస్తుంటారు. సంస్థ ఎదుగుదలకు వారు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకమైనవిగా ఉంటాయి. పైగా సీఈవో శక్తిసామర్థ్యాలను ఉపయోగించే తీరు ఆ కంపెనీ భవితవ్యాన్ని నిర్థేశిస్తుంది.

చాకుల్లాంటి సీఈవోలను ప్రపంచ కంపెనీలకు అందించే ఒక మెగా ఫ్యాక్టరీగా భారత టెక్ కంపెనీ ఇన్ఫోసిస్ ఇటీవల అవతరిస్తోంది. ఈ కంపెనీలో కీలక పాత్రలను నిర్వహించిన సీనియర్ ఉద్యోగులు ప్రస్తుతం దేశవిదేశాల్లోని చాలా కంపెనీలకు రథసారదులుగా మారటం కంపెనీకి కూడా మంచి పేరును తెచ్చిపెడుతోంది. ఈ నెల ప్రారంభంలో ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ మోహిత్ జోషి టెక్ మహీంద్రా CEO పదవిని చేపట్టడానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

సీఈవోల తయారీ ఫ్యాక్టరీగా మారుతున్న Infosys.. స్పెషల్ స్టోరీ.

దీనికి ముందు జనవరిలో కంపెనీ మాజీ ప్రెసిడెంట్ రవి కుమార్ కాగ్నిజెంట్ సీఈవో అయ్యేందుకు కంపెనీని విడారు. ప్రస్తుతం కంపెనీ సీఈవోగా ఉన్న సలీల్ పరేఖ్ కాంట్రాక్టును ఇన్ఫోసిస్ మరో 5 ఏళ్ల పాటు పొడిగించింది. అయితే ఈ పొడిగింపుకు ముందు కంపెనీని వీడిన ఇద్దరు సీనియర్లు గతంలో ఇన్ఫోసిస్ సీఈవో పదవికి అర్హులుగా రేసులో ఉన్నారు. గతంలో సైతం కంపెనీని వీడిన సీనియర్లు చాలా మంది ప్రత్యర్థి సంస్థలకు సారధ్యం వహిస్తున్నారు.

సీఈవోల తయారీ ఫ్యాక్టరీగా మారుతున్న Infosys.. స్పెషల్ స్టోరీ.

ఉత్తమ మేనేజ్మెంట్, మంచి పరిపాలన కంపెనీలో ఉన్నందున ఇన్ఫోసిస్ నుంచి ఎక్కువ సంఖ్యలో మంచి లీడర్లు తయారవుతున్నారు. జోషి, కుమార్ విస్తృత స్థాయి పాత్రలను నిర్వహించినప్పటికీ.. దానిని భర్తీ చేయడానికి ఇన్ఫోసిస్‌కు “బలమైన నాయకత్వ బెంచ్” ఉందని నిపుణులు గమనించారు. ఇన్ఫోసిస్‌లోని లీడర్‌షిప్ టాలెంట్‌ను పరిశ్రమ బాగా గుర్తించింది.

దీనికి ముందు కాగ్నిజెంట్ నుంచి ఎక్కువమంది సీఈవోలు తయారయ్యేవారు. ఈ ఎగ్జిక్యూటివ్‌లకు అనేక బిలియన్ డాలర్ల వర్టికల్స్‌పై లోతైన పరిజ్ఞానం, దశాబ్దాల అనుభవం ఉన్నందున ఇన్ఫోసిస్ కంపెనీలోని సీనియర్లకు డిమాండ్ ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

English summary

Infosys became new CEO manufacturing hub for India, senior employee left company leading rival companies

Infosys became new CEO manufacturing hub for India, senior employees left company leading riwal companies.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *