స్ట్రెస్‌ ఎక్కువగా ఉంటే.. ఈ ఆనారోగ్యాలు వస్తాయ్‌ జాగ్రత్త..!

[ad_1]

Stress Related Illness: ఈ ఉరుకులు, పరుగుల లైఫ్‌స్టైల్‌లో ప్రతి ఒక్కరూ ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఉద్యోగం, వ్యాపారం, వ్యక్తిగత జీవితం, ఆర్థిక విషయాలు, బంధువులతో సంబంధాలు.. ఇలా రకరకలా ఒత్తిళ్లు ఉంటున్నాయి. కోపం, ఆవేశం, ఆందోళన, ఆవేదన…మనసులో పుట్టే ఈ భావోద్వేగాలన్నీ శరీరం మీద ప్రభావం చూపుతాయి. ఒత్తిడికి కారణమవుతాయి. తీవ్రమైన ఒత్తిళ్లు చుట్టుముడుతూ మానసికంగా కుంగుబాటుకు గురవుతున్నారు. ఒత్తిడి కారణంగా.. మానసిక సమస్యలే కాదు, శారీరకంగానూ అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

హార్మోన్లపై ప్రభావం పడుతుంది..

ఎక్కువగా స్ట్రెస్‌కు గురయ్యే వారిలో డొపమైన్, కార్టిసోల్‌ అనే హార్మోన్స్‌ ఉత్పత్తి అవుతుంది. ఇవి మిగిలిన హార్మోన్స్‌పై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోవడం, హైపర్‌టెన్షన్‌ వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈటింగ్‌ డిజార్డర్స్‌తో కొందరు అసలు ఆహారం తీసుకోకపోవడం, మరికొందరు అధిక ఆహారం తీసుకోవడం చేస్తారు. దీంతో కొందరు రక్తహీనత సమస్యలు ఎదుర్కొంటారు.

గుండె పోటు ముప్పు..

తీవ్రమైన ఒత్తిడి కారణంగా.. హార్ట్‌బీట్‌లో తేడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి ఎక్కువ అయితే.. హార్ట్‌రేట్‌ పెరిగి సడన్‌ హార్ట్‌ ఎటాక్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. రక్తపోటు, గుండె కొట్టుకునే వేగం పెరగడం వల్ల పక్షవాతం, గుండెపోటు ముప్పు పొంచివుంటుంది. ఒత్తిళ్లతో రక్తపోటు అదుపులో లేని వారిలో హెమరైజ్డ్‌ బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురయ్యే అవకాశం ఉంది.

ఇమ్యూనిటీ క్షీణిస్తుంది..

అధిక ఒత్తిడి కారణంగా.. ఇమ్యూనిటీ క్షీణిస్తుంది. దీని కారణంగా ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది. ఒంట్లో ఇన్‌ఫ్లమేషన్‌(వాపు ప్రక్రియ) వేగవంతమవడం మూలంగా దీర్ఘకాల సమస్యలూ ముంచుకొస్తాయి.

జీర్ణక్రియ సమస్యలు ఎదురవుతాయ్‌..

ఒత్తిడి కారణంగా.. పేగులకు పోషకాలను గ్రహించే సామర్థ్యం తగ్గుతుంది. జీవక్రియల వేగం మందగిస్తుంది. ఎంజైమ్‌ల ఉత్పత్తి తగ్గుతుంది. పేగుల్లో పూత, విరేచనాలు, మలబద్ధకం వంటి సమస్యలు తరచుగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఒత్తిడి ఎక్కువ అయితే.. కడుపునొప్పి, అజీర్ణం, ఆకలి మందగించడం, అతిగా తినడం, వికారం లాంటివి కన్పిస్తాయి. కడుపులో అల్సర్లు ఏర్పడతాయి.

చర్మ సమస్యలు..

ఒత్తిడి వల్ల చర్మానికి అనేక సమస్యలు తలెత్తుతాయట. ఒత్తిడితో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుందని, దాని కారణంగానే మొటిమలు, దద్దుర్లు రావడం.. జట్టు సన్నబడటం, రాలిపోవడం, ఇతర చర్మ సమస్యలు వస్తాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. శరీరం ఒత్తిడికి గురైనప్పుడు కార్టిసోల్‌ అనే హార్మోన్‌ ఎక్కువగా విడుదలవుతుంది. ఈ హార్మోన్‌ను స్ట్రెస్‌ హార్మోన్‌ అని కూడా పిలుస్తారు. ఇది చర్మంలోని రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. దీంతో చర్మం బలహీనపడి ముడతలు వస్తాయి.

తలనొప్పి వేధిస్తుంది..

అధిక ఒత్తిడి కారణంగా.. తలనొప్పి, పార్శ్వనొప్పి, తీవ్రమైన కోపం, నిస్సత్తువ, ఆందోళన లాంటివి కుంగుబాటుకీ దారితీస్తాయి.

స్ట్రెస్‌ ఇలా తగ్గించుకోండి..

  • యోగా, ధ్యానం లాంటివి ఒత్తిడిని తగ్గిస్తాయి. స్ట్రెస్‌ హార్మోన్‌ స్థాయినీ, రక్తపోటునీ తగ్గిస్తాయివి. శ్వాస వ్యాయామాలతో పారాసింపథెటిక్‌ నాడీ వ్యవస్థ ఉత్తేజితమై రిలాక్స్‌ అవుతారు.
  • సంగీతం వినడం, బొమ్మలు వేయడం, పుస్తకాలు చదవడం లాంటివి చేయడం వల్ల ఆందోళన కలిగించే విషయం మీదినుంచి మనసు మళ్లి రిలాక్స్‌ అవుతుంది.
  • ప్రశాంతంగా నిద్రపోండి. శరీరము, మనసూ రిలాక్స్‌ అవుతాయి.
  • రోజూ వ్యాయామం చేయడం ఒత్తిడికి మంచి మందు. నిద్ర బాగాపడుతుంది.
  • మీ ఫ్యామిలీతో టైమ్‌ స్పెండ్‌ చేయండి. ఇలా చేస్తే మీ మైండ్‌ రిలాక్స్‌ అవుతుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *