అంబానీ షేర్లతో జాగ్రత్త, రెండు రోజుల్లోనే 36 శాతం పతనం

[ad_1]

Reliance Infra Shares At Lower Circuit: అంబానీ ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ కష్టాలు తీరే సూచనలు కనిపించడం లేదు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేర్లు గత సెషన్‌లో (శుక్రవారం, 12 ఫిబ్రవరి 2024) భారీగా పడిపోయాయి. ఒక్క రోజులోనే ఈ స్టాక్‌ 20 శాతం పతనమై రూ. 181.95 వద్దకు చేరింది. దీనికి ముందు ట్రేడింగ్ సెషన్‌లో (బుధవారం, 10 ఫిబ్రవరి 2024) మరో 20 శాతం విలువను కోల్పోయాయి. బుధవారం నాడు ఈ స్క్రిప్‌ రూ. 227.40 వద్ద ముగిసింది. ఈ రెండు ట్రేడింగ్ సెషన్లలోనే రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేర్లు దాదాపు 36 శాతం క్షీణించాయి.

రిలయన్స్ ఇన్‌ఫ్రా షేర్లు ఎందుకు పడుతున్నాయి?
కంపెనీ షేర్ల పతనానికి కారణం.. సుప్రీంకోర్టులో ఉన్న కేసు. దేశ అత్యున్నత న్యాయస్థానం, అనిల్ అంబానీకి బుధవారం పెద్ద షాక్‌ ఇచ్చింది. రూ. 8,000 కోట్ల ఆర్బిట్రేషన్ అవార్డును రద్దు చేసింది. రిలయన్స్ ఇన్‌ఫ్రా అనుబంధ సంస్థ దిల్లీ ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) రూ. 8,000 కోట్లు చెల్లించాల్సిన బాధ్యత లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గతంలో తానే ఇచ్చిన తీర్పును కోర్టు రద్దు చేసింది. అంతకుముందు ఈ మధ్యవర్తిత్వ తీర్పు అనిల్ అంబానీ అసోసియేట్ కంపెనీకి అనుకూలంగా ఉండేది. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో అనిల్‌ అంబానీ కంపెనీకి రావల్సిన వేల కోట్లు రాకుండా ఆగిపోయాయి. 

కొన్నాళ్లుగా రిలయన్స్ ఇన్‌ఫ్రా షేర్లు పెరగడానికి ఈ డబ్బే కారణం. గతంలో, సుప్రీంకోర్టు సహా కింది స్థాయి కోర్టుల్లో అనిల్‌ అంబానీకి అనుకూలంగా తీర్పులు వచ్చాయి. అందువల్ల షేర్లు చకచకా పెరిగాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు అంబానీకి వ్యతిరేకంగా రావడంతో షేర్లు పడిపోయాయి. రిలయన్స్ ఇన్‌ఫ్రా ఇన్వెస్టర్లు కేవలం రెండు రోజుల్లోనే 36 శాతం డబ్బును కోల్పోయారు.

వెలుగు తగ్గిన రిలయన్స్ పవర్
సుప్రీంకోర్టు తీర్పు ఎఫెక్ట్‌ అనిల్ అంబానీకి చెందిన మరో కంపెనీ రిలయన్స్ పవర్ షేర్ల మీద కూడా కనిపించింది, ఈ స్టాక్‌ కూడా భారీగా క్షీణించింది. శుక్రవారం కంపెనీ షేర్లు 5 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకి రూ. 26.93 వద్ద ఆగాయి. అంతకుముందు ట్రేడింగ్ సెషన్‌లో ఈ కంపెనీ షేర్లు 3 శాతం పడిపోయాయి. దీనికి ముందు, గత కొన్ని నెలలుగా కంపెనీ షేర్లు పెరుగుతూ వచ్చాయి. అప్పులు తీర్చిన తర్వాత ఈ పెరుగుదల కనిపించింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: కొండ పైనుంచి దిగని పసిడి – తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

మరిన్ని చూడండి

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *