[ad_1]
Tenant Rights:
దేశంలో సొంత ఇళ్లు లేనివారే అధికం. ఎక్కువ మంది అద్దె ఇళ్లలోనే ఉంటారు. కొందరికి గ్రామాల్లో సొంతిళ్లు ఉన్నప్పటికీ ఉద్యోగ రీత్యా పట్టణాలు, నగరాల్లో కిరాయికే ఉండాల్సి వస్తోంది. అయితే అద్దెకు ఉండేవాళ్లకూ కొన్ని హక్కులు, బాధ్యతలు ఉంటాయని చాలామందికి తెలియదు. అవేంటో తెలుసుకుందాం!
అద్దె ఏర్పాటు అనేది ఒక యాజమాన్య వ్యవస్థ. ఇందులో రెండు పార్టీలు ఉంటాయి. ఒకరు యజమాని. మరొకరు అద్దెకు ఉండే వ్యక్తి. ఒక స్థలం లేదా ఇల్లు ఇందులోకి రావాలంటే రెండు పార్టీలు రెంటల్ అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటి కిరాయి, వసతుల కల్పన, ఇతర వివరాలు ఇందులో స్పష్టంగా ఉంటాయి. అయితే దేశంలో 90 శాతం మంది రెంటల్ అగ్రిమెంట్ చేసుకోకుండానే నివసిస్తుంటారు. ఏదేమైనా అద్దెకుండే వారికి కొన్ని న్యాయపరమైన రక్షణలు, హక్కులు ఉంటాయి.
యజమానులు, అద్దెకుండే వ్యక్తులు రెంటల్ అగ్రిమెంటుకు బద్ధులై ఉండాలి. కిరాయి చెల్లింపు, సరైన సమయంలో ఇవ్వడం, కాల పరిమితి, ఆస్తి నిర్వహణ వంటివి చూసుకోవాలి. ఇస్తున్న డబ్బుకు బదులుగా స్థలం లేదా ఇంటిని అద్దెకుండే వ్యక్తి పూర్తిగా వాడుకోవచ్చు. ఒకవేళ లేటుగా కిరాయి ఇస్తే యజమాని న్యాయపరంగా చర్యలు తీసుకోవచ్చు.
Also Read: బూమ్.. బూమ్ మార్కెట్! అనలిస్టులు సజెస్ట్ చేస్తున్న రూ.100 లోపు స్టాక్స్ లిస్ట్ మీకోసం!
అద్దెకు తీసుకున్న వ్యక్తులు ఇంటిని లేదా స్థలాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అవసరమైతే చిన్న చిన్న మరమ్మతులు చేయించుకోవాలి. భారీ మరమ్మతుల బాధ్యత మాత్రం యజమానిదే.
యజమానికి ఇంటిని సందర్శించే హక్కు ఉన్నప్పటికీ ముందుగా అద్దెకుంటున్న వ్యక్తులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. వారి గోప్యతకు భంగం కలిగించరాదు. అద్దెకుంటున్న చోటులో నీటి సరఫరా, విద్యుత్, పారిశుద్ధ్య సేవలు కల్పించాల్సిన బాధ్యత యజమానిదే. ఒకవేళ అద్దె ఆలస్యంగా ఇచ్చినా వీటిని అడ్డుకొనే అధికారం వారికి ఉండదు.
కిరాయికి ఉంటున్న వ్యక్తులకు సముచిత రీతిలో అద్దె ఇచ్చే హక్కు ఉంటుంది. మాట్లాడుకున్న దానికన్నా ఎక్కువ డిమాండ్ చేసే అధికారం యజమానికి ఉండదు. మార్కెట్ లేదా ప్రాపర్టీ విలువను బట్టి అద్దె తీసుకోవాలి. ఒకవేళ అద్దె పెంచుకోవాలంటే యజమాని, అద్దె వ్యక్తి.. ఇద్దరూ అంగీకరించాల్సిందే.
ఇంట్లో పెళ్లి జరుగుతుందనో లేదా ఇతర అవసరాలు ఉన్నాయనో అద్దెకుంటున్న వారిని యజమానులు అనైతికంగా ఖాళీ చేయించకూడదు. వరుసగా రెండు నెలలు కిరాయి ఇవ్వకపోతే, ప్రవర్తన బాగాలేకుంటే, అనైతిక, వాణిజ్య అవసరాలకు ఇంటిని వాడుకుంటే, నష్టం కలిగిస్తే తప్ప వెళ్లిపోమనడం సరికాదు. యజమాని ఎట్టి పరిస్థితుల్లోనూ చట్ట ప్రకారమే నడుచుకోవాలి.
రెంటల్ అగ్రిమెంట్, లీజ్ అగ్రిమెంట్‌ను డిమాండ్ చేసే హక్కు అద్దెకు ఉంటున్న వారికి ఉంటుంది. యాజమాన్యం, అద్దె డబ్బు, చెల్లింపుల ప్రక్రియ వంటివి అందులో స్పష్టంగా పేర్కొనాలి. అలాగే ఇల్లు ఖాళీ చేస్తే పరిమిత సమయంలోనే యజమాని సెక్యూరిటీ డిపాజిట్ డబ్బును వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
[ad_2]
Source link
Leave a Reply