అనుష్ఠానం అంటే ఏంటి…ఒకరికొకరు ఎందుకు సహాయం చేసుకోవాలి..?

[ad_1]

అనుష్ఠానం ఒక పవిత్రమైన పదం. పదం ఎంత గంభీరమో! దాని అర్ధం కూడా అంతే గూఢం. భగవంతుడికి సంబంధించిన పదం కాబట్టి దీని అర్ధం విలక్షణంగానూ విస్తృతంగానూ ఉంటుంది

Feature

oi-M N Charya

|

Google Oneindia TeluguNews

డా.
ఎం.
ఎన్.
ఆచార్య

ప్రముఖ
అంతర్జాతీయ
జ్యోతిష,
జాతక,
వాస్తు
శాస్త్ర
పండితులు

శ్రీమన్నారాయణ
ఉపాసకులు.
సునంద
రాజన్
జ్యోతిష,
జాతక,
వాస్తు
కేంద్రం.
తార్నాక
-హైదరాబాద్

ఫోన్:
9440611151


అనుష్ఠానం

అనుష్ఠానం

తోటివారిని
సంతోష
పెట్టేదో
లేక
సాటివారి
కన్నీరు
తుడిచేదో..
ఏదైనా
నిజమైన
అనుష్ఠానమే
!
అసలు
“అనుష్ఠానం”
అంటే
ఏమిటి
?
అనుష్ఠానం
ఒక
పవిత్రమైన
పదం.
పదం
ఎంత
గంభీరమో!
దాని
అర్ధం
కూడా
అంతే
గూఢం.
భగవంతుడికి
సంబంధించిన
పదం
కాబట్టి
దీని
అర్ధం
విలక్షణంగానూ
విస్తృతంగానూ
ఉంటుంది.
“ఫలానాలా
చేస్తేనే
అనుష్ఠానం”
అని
గిరి
గీసి
చెప్పటానికి
లేకుండా
“గిరి”
అంత
ఉన్నతమైన
విలువ
కలది.
ఒక్క
మాటలో
చెప్పాలంటే
భగవంతునిలానే
అనిర్వచనీయం.

సమాజహితం
కోసం
ఏకాగ్రతతో
చేసే
అనుష్ఠానం,
ధ్యానం
లేదా
తపస్సు
ఒక
దృఢమైన
సంకల్పశక్తి
గా
లోక
కల్యాణానికి
ఎలా
మారుతుందో…మహానుభావుల
చరిత్ర
చూస్తే
తెలుస్తుంది.
మరి
మనం
అలా
చెయ్యాలంటే
అంత
మానసిక
శారీరక
తుష్టి
పుష్టి
మనకి
ఉందా?
అంత
ఏకాగ్రత
మనం
సంపాదించుకోగలమా?
ఖచ్చితంగా
చెయ్యలేమనే
చెప్పాలి.
మరి
సమాజానికి
మన
అనుష్ఠానం
ఉపయోగపడటం
ఎలా?
ఎలా
అంటే
“మన
స్థాయిలో
సమాజానికి”
ఉపయోగపడేలా
మనం
చేసే
ప్రతీ
చర్యా
అనుష్ఠానమే.
అలాంటి
అనుష్ఠానాలు
అవలోకించి
చూస్తే
అడుగడుగునా
బోలెడు.

ఉదాహరణకు
:-
జోరున
వర్షం
పడుతోంది.
పక్కింటి
వాళ్ళు
లేరు.
కానీ
వారు
ఆరేసిన
బట్టలు
వానలో
తడుస్తున్నాయి.
వెంటనే
మీరు
అవి
తీసి
ఆరబెట్టి
మడతబెట్టి
రాగానే
ఇస్తే
వాళ్ళు
ఎంత
ఆనందిస్తారో
కదా?
తెల్లవారుజామున
మీరు
జిమ్
కు
అని
వెహికిల్
మీద
వెళ్తున్నారు.
ఇంతలో
ఒక
పెద్దమనిషి
చేతిలో
సూట్
కేస్
తో
అటూ
ఇటూ
ఆదుర్దాగా
చూస్తున్నాడు.
మీకు
అర్ధం
అయ్యింది!
ఆయన
స్టేషన్
కి
వెళ్లాలని.
కనుచూపుమేరలో
ఆటో
కనపడటం
లేదు.పోనీ
మీ
పని
అంత
అర్జంట్
కానప్పుడు
ఆగి
స్టేషన్
దగ్గర
దింపితే
ఆయనకి
ఎంత
ఊరట!
అతను
రైలులో
కూచొని
‘దైవం
మానుష
రూపేణా’
అన్నట్లు
దేముడిలా
అతనెవరోదించాడు
కాబట్టి
సరిపోయింది
లేకపోతే
ఏమయ్యేది
?
అన్న
ఆయన
కృతజ్ఞతా
తలంపు
మీకు
ఎంత
పెద్ద
దీవెన?
ఇలాంటివన్నీ
అనుష్ఠానాలు
కాకుండా
పోవు
కదా.

Feel good stories:Why you have to help others and what karma says

పండగ
వచ్చింది.
మన
పక్కఉండే
వారు
ఏదో
ఊరికి
వెళ్లిపోయారు
అనుకోండి,
పండగ
రోజు
కాస్త
వాళ్ళ
ముంగిట్లో
ముగ్గు,
నాలుగు
మామిడాకులు
వాళ్ళ
గుమ్మం
ముందు
ఉంచితే
మన
బతుకు
పచ్చ
తోరణం
అవ్వదూ!
మన
నోటికి
భయపడి
వాతవరణం
ఎలా
ఉన్నా,
వర్షంలో
కూడా
మానకుండా
వచ్చే
పనిమనిషికి
మనం
తాగే
కాఫీ
లాంటిది
ఇస్తే

అమ్మాయిలో
కలిగే
అల్ప
కృతఙ్ఞత
మనకి
అనల్పసంతోష
హేతువవ్వదూ!

మన
ఇంట్లో
మనం
తినటం
కన్నా
పక్క
ఇంట్లో
భోజనానికి
వెళ్ళినప్పుడు
వాళ్ళు
ఎంత
సంతోషంగా
వడ్డిస్తారో
అలాగే
మన
ఇంట్లో
భగవానుడు,
పక్క
ఇంట్లో
వాడికి
పెడితే
అంతగానూ
సంతోషపడతాడు
కదా!
భార్య
శ్రద్ధగా
వంట
చేసి
పెడుతుంటే
మెచ్చుకోవడం,
పక్కవాడి
తులసి
మొక్కకి
కాసిని
నీళ్లు
పోయడం,
వాళ్ళ
పెంపుడు
జంతువులకు,
పక్షులకు..
మూగజీవులకు
కాస్త
వాటికి
దానా
పెట్టడం
కూడా
మహా
అనుష్ఠానమే
కదా!

బట్టలషాపులో
పనిచేసేవారికి
సరైన
పౌష్టికాహారం
ఎక్కడ
ఉంటుంది?
పైగా
షాపులో
ఉన్నంతసేపు
అలా
నుంచొని
ఉండాల్సిందే!
డజన్లకొద్దీ
డిజైన్లని,
రంగులని
తీయిస్తూ

సేల్స్
చేసే
వ్యక్తికి
సహనాన్ని
పరీక్షిస్తూ..
ఏమి
తీసుకోకుండా
వెళ్ళేవాళ్ళు
ఎందరో?

సేల్స్మేన్
కి
“అమ్మే
తెలివితేటలు
లేవని”
ఓనర్
తిట్టే
అరుపులు
మన
చెవికి
వినపడవు.
గతిలేని

వ్యక్తి
కన్నీరు
మనకి
కనపడదు.
ఇది
గ్రహించని
మనం
చేసే
పూజకి
పరమార్థం
ఉందంటారా?

ఎక్కే
గుమ్మం
దిగేగుమ్మంగా
ఉద్యోగాలు
చేసేవారు
ఉంటారు.
ఉదాహరణకు
కేబుల్
టీవీ
వాళ్ళు
బిల్లు
కోసం
మూడంతస్తులు
ఆయాసపడి
ఎక్కివస్తే
“మళ్ళీ
రండి”
అని
విసుక్కోకుండా
వెంటనే
కట్టేస్తే
ఎంత
సంతోషిస్తాడు,
పైగా
అందరూ
ఇలా
ఉంటే
ఎంత
బాగుండు
అనుకోడూ!
అతనికి
లభించిన

చిన్నస్వాంతన
భగవంతుడు
మీ
వైపు
చూసేలా
చెయ్యదా
ఒక
సారి
ఆలోచిద్దాం.

Feel good stories:Why you have to help others and what karma says

ఒక
చిన్న
సైకిల్
మూలంగా
మొత్తం
ట్రాఫిక్
ఆగిపోతే
ఎవరికి
వారు
నామోషీకి
పోయి
కార్లు,
బళ్ల
మీద
బిర్రబిగుసుకుని
కూచోకుండా

సైకిల్
మనమే
జరిపితే
కొంతైనా
సంస్కారం
ఉన్న
వ్యక్తులు
మన
వైపు
కృతజ్ఞతతో
చూసే
చూపు
మీ
వైటల్
ఎనర్జీని
రెట్టింపు
చెయ్యదూ?
ఏదో
వీక్
ఎండ్
లో

పుణ్యక్షేత్రమో
వెళ్తున్నప్పుడు
కుటుంబ
సభ్యులతో
బాటు

బీదవారినో
ఒకర్ని
తీసుకెళ్లి
దర్శనం
చేయిస్తే
గుళ్లో
దేముడు
బోల్డు
సంతోష
పడిపోడూ?
మన
ఇంట్లో
పూచినవో,
కాచినవో
నలుగురికీ
మనస్ఫూర్తిగా
అందిస్తే

చెట్లు
మరింత
ఇవ్వడానికి
సిద్దమవుతాయట.
వాటి
సగటు
ఆయుర్దాయం
కూడా
పెరుగుతుందని
పెద్దలు
అంటారు.

మనఇంటి
పూలతో
నలుగురూ
చేసే
పూజ,
మన
కాయఫలాలతో
చేసే
వైద్యమో,
నైవేద్యమో
ఎంత
మంది
చేస్తే
అంతకు
అంతా
అనుష్ఠాన
ఫలితం
మనకు
దక్కకుండా
ఎవరికీ
పోదు
కదా.
చాలా
మంది
ఇంట్లో
చెత్తని
రోడ్డు
మీద
ఎవరూ
చూడట్లేదన్న
భ్రమలో
ఇంకోకరి
ఇంటి
ముందు
పారపోసేస్తూంటారు.
కొంత
మంది
చెత్త
బుట్టలో
వేస్తారు
కానీ
దాన్లో
కుమ్మరించడం
వలన
తీసుకెళ్లే
పారిశుధ్య
కార్మికులకు
ఎంతో
అవస్థ.
కొన్ని
చెత్తబుట్టలు
చిల్లులు
పడినా
మార్చరు.
వాటినుంచి
చెత్త
రాలుతూ,
కారుతూ
ఉంటుంది.
తినడానికి
హోటళ్లకు,
కాలక్షేపానికి
సినిమాలకి
డబ్బులు
ఖర్చుపెడతాం
కానీ
చెత్త
బుట్ట
లేదా
కవర్లు
మంచివి
కొననే
కొనం.
పాపం

పారిశుధ్య
కార్మికుడు
మనసు
కష్టపెట్టుకున్నా
సరే
మీరు
చేస్తున్నది
తప్పు
అని
మనకు
చెప్పే
ధైర్యం
అతనికి
ఉండదు.
ఇంట్లో
పొగుచేసిన
చెత్తనంతటినీ
ఒక
క్యారీబాగ్స్
లో
పెట్టి
వేస్తే
తీసుకెళ్లే
అతనికి
ఎంత
సౌకర్యంగా
ఉంటుంది.
ఇలాంటి
చిన్నసామాజిక
బాధ్యతని
గుర్తించి
మన
వంతు
కర్తవ్యాన్ని
మనము
నిర్వహిస్తే
అంతకన్నా
పెద్ద
‘అనుష్ఠానం’
ఇంకేముంటుంది
ఆలోచించండి.

ప్రయాణాలలో
వృద్దులు,
వికలాంగులు,
గర్భిణీలు,
చిన్న
పిల్లతల్లులకు,
అనారోగ్యంతో
ఉన్నవారికి
మనం
కూర్చున్న
సీటు
వారికి
ఇవ్వడం
వలన
ఎంతో
పుణ్యఫలం
దక్కుతుంది
ఇది
కూడా
అనుష్ఠానమే.
సాటివారిని,
జీవులకు
మనం
చేసే
చిరు
సహాయం
వలన
‘అనుష్ఠానాలు’
చేసిన
పుణ్యఫలితం
దక్కుతుంది.
కొన్ని
చేయకుండా
ఉంటే
“అనుష్ఠానాలుగా”
మారేవి
కూడా
ఉన్నాయి.
ఉదాహరణకు
తన
దారిన
తాను
పోతున్న
కుక్కనో,
పందినో
ఊరికే
కొట్టడం,
నడుస్తున్న
వారి
మీద
రోడ్డుపై
నిలిచిన
వాననీళ్లు
పడేలా
వాహనాలు
వేగంగా
నడపడం,
పనికి
మాలిన
మాటలతో
ఎవరినో
ఇబ్బందులకు
గురిచేయడమో,
అపహాస్యం
చేయడమో
మంచిది
కాదు.

తప్పుడు
సమాచారాలని
మోస్తూ
కాలక్షేపం
చేస్తే
మహా
పాపం,

పాపం
ఊరికే
పోదు.
ఎందరో
పొట్టతిప్పల
కోసం
చేసుకుంటున్న
ఉద్యోగాన్ని
అవకాశం
తన
చేతిలో
ఉందని
అహంకారంతో
ఇబ్బందు
కలిగించడం
తప్పు,
ఒకరి
హృదయ
వేదనకు
మనం
ఎంత
మాత్రం
కారణం
కాకూడదు.
అందుతున్నాయి
కదా
అని
అనుమతి
లేకుండా
పక్కవారి
పూలు,
కాయలు
కోసేయడం
ఇలాంటివి
చేయకుండా
ఉంటే
‘అనుష్ఠానం’
చేసినట్లే.
తోటివారిని
సంతోష
పెట్టేది,
సాటివారి
కన్నీరు
తుడిచేది,
సహాయంగా
నిలిచేది
ఏదైనా
“అనుష్ఠానమే”.
సత్సంకల్పంతో
చేసే
పనులకు
శరీరానికి
కాంతి,
మనసుకి
ఎంతో
శాంతి..

English summary

When one helps the people who are in need will always be blessed and that is called Anushtanam.

Story first published: Tuesday, February 28, 2023, 13:27 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *