అలా ఎలాన్ మస్క్ ని వెనక్కు నెట్టిన అదానీ.. 60 ఏళ్ల వయస్సులో అలుపెరగక ముందుకు..!

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|

Adani Vs Elon Musk: మహేష్ బాబు సినిమాలోని పాట నిండు చందురుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు అన్నట్లుగా సాగుతోంది అదానీ ప్రస్థానం. అవును ప్రపంచ కుబేరుడిగా ఈ ఏడాది రికార్డుల్లోకి ఎక్కిన అదానీ.. తన విజయ పరంపరను కొనసాగిస్తున్నారు. భారత్‌లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా అదానీ జోరు కొనసాగుతోంది.

గౌతమ్ అదానీ ప్రపంచ సంపన్నుల జాబితాలో ఎలాన్ మస్క్ కంటే వెనుకబడి ఉండవచ్చు.. కానీ గత ఏడాది కాలంలో అదానీ కొన్ని విషయాల్లో మాత్రం ట్విట్టర్ సీఈవోను ఓడించి కొత్త స్థానాన్ని సాధించాడు. దీనికి ప్రధాన కారణం 2022లో ఎలాన్ మస్క్ సంపద భారీగా క్షీణించటమే. కేవలం ఒక్క ఏడాదిలో ఎలాన్ మస్క్ 114 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయాడు. ఇదే సమయంలో భారత పారిశ్రామికవేత్త అదానీ సంపద మాత్రం విపరీతంగా పెరిగిపోయింది.

అలా ఎలాన్ మస్క్ ని వెనక్కు నెట్టిన అదానీ.. 60 ఏళ్ల వయస్సులో

2022 బాగా కలిసొచ్చింది కేవలం గౌతమ్ అదానీకి అనటం అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఈ కాలంలో ఆయన ప్రపంచ కుబేరుల్లో 3వ స్థానాన్ని అధిరోహించారు. ఆసియా నుంచి ఈ ఘనతను సాధించిన తొలివ్యాపారవేత్తగా కూడా ఈయనే నిలిచారు. అనే అనేక కంపెనీలను కొనుగోలు చేయటంతో పాటు తన సంపదను 49 బిలియన్ డాలర్లకు పైగా పెంచుకున్నారు. గౌతమ్ అదానీ 2022లో అత్యధికంగా సంపాదిస్తున్నవారి జాబితాలో నంబర్-1గా నిలిచారు. ఇదే సమయంలో ఎలాన్ మస్క్ మాత్రం ఈ జాబితాలో అట్టడుగు స్థానానికి చేరుకున్నారు.

ట్విట్టర్ కొనుగోలు నిర్ణయంతో ఎలాన్ మస్క్ సంపద కరిగిపోయింది. పైగా సమయానికి ట్విట్టర్ డీల్ ముగించటం కోసం తప్పని పరిస్థితుల్లో ఆయన తన టెస్లా వాటాలను సైతం అమ్ముకోవాల్సి వచ్చింది. అలా ట్విట్టర్ కంపెనీని సొంతం చేసుకున్నప్పటి నుంచి ఆయన సంపదలో క్షీణత కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో 40 బిలియన్ డాలర్లు విలువైన టెస్లా షేర్లను ఈ ఏడాది విక్రయించారు. సంపద క్షీణత తర్వాత ఆయన ఆస్తి విలువ ప్రస్తుతం 156 బిలియన్ డాలర్లుగా ఉందని తెలుస్తోంది. 2022లో మస్క్ సంపాదన అత్యల్పంగా నమోదైంది.

గుజరాత్, అహ్మదాబాద్ వ్యాపారవేత్త అయిన అదానీ 60 ఏళ్ల వయస్సులో అలుపెరుగని బాటసారిగా మారారు. ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానంలో నిలిచిన గౌతమ్ అదానీ సంపద 125 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే భారత కరెన్సీ ప్రకారం ఈ సంపద విలువ దాదాపు రూ.10.34 లక్షల కోట్లుగా ఉంది. ప్రపంచంలోని టాప్ బిలియనీర్ల జాబితాలో నిలిచిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ తొమ్మిదో స్థానంలో 88.2 బిలియన్ డాలర్ల సంపదను కలిగి ఉన్నారు.

English summary

Gautam Adani Surpassed Billionaire Elon Musk with gaining wealth in 2022

Gautam Adani Surpassed Billionaire Elon Musk with gaining wealth in 2022

Story first published: Tuesday, December 20, 2022, 13:21 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *